నిజానికి ఆంధ్రజ్యోతి రూట్ వేరు… తప్పు దొర్లితే దొర్లనీ… పొరపాటు జరిగితే జరగనీ… పాత్రికేయం అంటే అదేమైనా కంప్యూటర్ ప్రోగ్రామా..? నిర్దేశిత మార్గంలో వెళ్లడానికి..? హ్యూమన్ ఎర్రర్స్, అనగా మానవతప్పిదాలు ఉంటయ్… సహజం అన్నట్టుగా ఉంటుంది దాని వైఖరి… నిజానికి పత్రికలో ఏవైనా తప్పులు దొర్లితే, కాదు, పొరపాట్లు చోటుచేసుకుంటే హుందాగా పాఠకులను క్షమించమని అడగడం, చింతిస్తున్నామని చెప్పడం మంచి లక్షణం…
కానీ… ఇప్పుడు పత్రికల అవసరాలు వేరు… తాము కొమ్ము కాసే పార్టీలు, నాయకుల కోసం కొన్నిసార్లు కావాలనే తప్పులు రాయబడతాయి… మరి అప్పుడేమిటి..? సో, ఇప్పుడా చర్చలోకి వద్దు గానీ… ఈరోజు కేసీయార్ సంబంధిత వార్త గురించి ఆంధ్రజ్యోతి ఒక వివరణ ప్రచురించింది… క్లుప్తంగా సాారాంశం ఏమిటంటే..? ‘తప్పులు జరిగేది మతోన్మాదంతోనే’ శీర్షికతో 22న ఓ వార్త వచ్చింది ఈ పత్రికలో… అందరూ రాసిన వార్తే… 21న ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల వార్త…
అందులో పాల్గొన్న కేసీయార్ ఆ వ్యాఖ్య చేసినట్టుగా హెడింగ్ పెట్టారు… టెక్స్ట్ మ్యాటర్‌లో కూడా ‘‘కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు అప్పట్లో గుళ్లపై దాడులు చేశారు, దాంతో హిందూ సోదరులకు బాధ కలిగింది… కొంతమంది వేరే రాజులు వేరే మతం వాళ్లవి కూలగొట్టారు, దానివల్ల సాధించేదేముంది..? పరస్పర దాడులతో మానవ జాతికి జరిగే మేలేమీ లేదు’’ అని కేసీయార్ మాట్లాడినట్టు పబ్లిషైంది… నిజానికి ఆరోజు కేసీయార్ అవేమీ మాట్లాడలేదు…
Ads
సీఎం కార్యాలయం ఇదేమిటంటూ రియాక్ట్ అయినట్టుంది… దాంతో ఆంధ్రజ్యోతి ఈ తప్పెలా జరిగిందని కాస్త వెనక్కి తిరిగి చూసుకుంది… తన పబ్లిష్ చేసిన వివరణలో అదే చెప్పుకుంది… ‘‘సీఎంవో జారీ చేసిన ప్రకటనకు మరింత అదనపు సమాచారం జోడించాలని భావించాం… వీడియోలను పరిశీలిస్తున్నప్పుడు, గత ఏడాది ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేసీయార్ చేసిన వ్యాఖ్యలను ఈసారి వేడుకల్లో చేసినట్టుగా తప్పులో కాలేశాం… సో, ఆ వ్యాఖ్యలు గత ఏడాదివి, పొరపాటుకు చింతిస్తున్నాం’’ అని వివరించింది…
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే..? సీఎంవో ప్రకటన ఎప్పుడూ వార్తకు అవసరమైన దానికన్నా సుదీర్ఘంగానే ఉంటుంది… వివరంగానే ఉంటుంది… ప్రత్యేకించి సీఎం మాటల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది సీఎంవో… ఇంకా దానికి అదనపు సమాచారం జోడించే అవసరం ఏమొచ్చింది ఆంధ్రజ్యోతికి..? సీఎంవో ప్రకటనకు రెండు ఫోటోలు కలిపి కొడితే సరిపోలేదా..? పోనీ, చాలా ఇంపార్టెంట్ వార్త, ఇంకా వివరంగా ఇవ్వాలి అనుకున్న పక్షంలో… వీడియోలని వెతికి రాసుకోవడం ఏమిటి..?
స్పాట్ రిపోర్టింగ్ లేదా..? ఆంధ్రజ్యోతి నుంచి ఎవరూ వెళ్లలేదా..? వెళ్లకపోయినా సీఎం బీట్ చూసే ఏ రిపోర్టర్‌ను అడిగినా సీఎం స్పీచ్ ఏమిటో చెబుతాడు కదా… ఐనా సీఎం ప్రోగ్రాములకు ఆంధ్రజ్యోతిని రాకుండా ఏమీ నిషేధించలేదు కదా తెలంగాణలో…!! సో, ఈ వివరణ కూడా నమ్మబుల్‌గా లేదు… పైగా గత ఏడాది ఆ వ్యాఖ్యలు చేశాడు సరే, ఇప్పుడు ఆ ధోరణికి భిన్నమైన వైఖరిని తీసుకున్నాడా కేసీయార్..? గత ఏడాది వార్తను ఈ ఏడాది వార్తలో కలిపేయడం తప్పే… కానీ ఆ తప్పు వల్ల జరిగిన నష్టం ఏమైనా ఉందా..? ఎందుకు ఈ సీరియస్ చింతన..? అదే అర్థం కానిది…!!
Share this Article