Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా అంటే అంతే… బంగ్లాదేశ్ కవ్వింపులు కూడా ఓ ఆటలో భాగమే…

December 8, 2024 by M S R

.

….. ( పార్థసారథి పొట్లూరి )…… మార్జోరే టేలర్ గ్రీనే – Marjorie Taylor Greene! అమెరికన్ హౌస్ అఫ్ రిప్రరిజెన్టేటివ్ సభ్యురాలు సంచలన ఆరోపణలు చేసింది! అవి ఆరోపణలే కావొచ్చు! కానీ జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే నిజం కావొచ్చు అనే అనిపిస్తుంది!

మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలు ఏమిటో చూద్దాం!

Ads

1.జో బిడెన్ జనవరి 20 న డోనాల్డ్ ట్రంప్ కి అధికారం ఇచ్చే ఆలోచనలో లేడు.

2.జో బిడెన్ రష్యా ఉక్రెయిన్ ల మధ్య అణు యుద్ధం జరిగేలా చేసి దానిని సాకుగా చూపి ట్రంప్ కి అధికారం ఇచ్చే కార్యక్రమం రద్దు చేసే ఆలోచనలో ఉన్నాడు!

3.గత నెల 9 న న్యూయార్క్ టైమ్స్ ఈ కధనాన్ని ప్రచురించింది.

మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామలతో పోలిస్తే ఎంతో కొంత నిజం ఉంది అని అనిపిస్తుంది!

4.అమెరికా ఉక్రెయిన్ కి సప్లై చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ని రష్యా మీదకి దాడికి అనుమతి ఇవ్వబోతున్నది అని పుతిన్ తెలుసుకుని అణు దాడి చేస్తాను అని హెచ్చరించినా అనుమతి ఇచ్చి ప్రోత్సహించింది అమెరికా.

5.దక్షిణ కొరియా యుద్ధ టాంక్ లని పంపించింది ఉక్రెయిన్ కి.

6.ఫ్రాన్స్ కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చింది ఉక్రెయిన్ కి.

మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలో రష్యా ఉక్రెయిన్ ల మధ్య అణు యుద్ధం జరిగేలా జో బిడెన్ ప్రోత్సహిస్తున్నాడు అన్నది. అలాగే ఉక్రెయిన్ కి అణు బాంబులు తిరిగి ఇవ్వాలని జో బిడెన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఆరోపించింది!

ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తున్నాయి!
అణు బాంబులు తిరిగి ఎవరి నుండి ఇప్పిస్తాడు జో బిడెన్?
అణు బాంబులు రహస్యంగా జో బిడెన్ ఇస్తాడా ఉక్రెయిన్ కి?

మొదటి ప్రశ్నకి జవాబు : 1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన తరువాత సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ దగ్గర సింహాభాగం అణు వార్ హెడ్లు కలిగిన మిసైల్స్ ( ICBM ) లు ఉన్నాయి. దాదాపు సగం మిలిటరీ కాంప్లెక్స్ లు సోవియట్ లో భాగంగా ఉక్రెయిన్ లోనే ఉన్నాయి.

1994 లో ఉక్రెయిన్ దగ్గర ఉన్న అణు వార్ హెడ్లని రష్యాకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఉక్రెయిన్. అమెరికా, బ్రిటన్, రష్యాలు ఉక్రెయిన్ భద్రతకి హామీ ఉండేట్లుగా ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అణు వార్ హెడ్లని రష్యాకి ఇచ్చేసింది. అంతర్జాతీయ అణు శక్తి సంఘం ఉక్రెయిన్ లో తనిఖీలు చేసి అణు వార్ హెడ్లు ఏవీ లేవని నిర్ధారించింది!

మరి జో బిడెన్ అణు బాంబులు తిరిగి ఇవ్వడానికి ఎక్కడ నుండి ఇస్తాడు?

2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్ లో యూరినియం శుద్ధి చేసే లాబో్రెటరీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

అంటే రహస్యంగా శుద్ధి చేసిన యూరెనియం ఉక్రెయిన్ దగ్గర ఉండి ఉండవచ్చు లేదా అక్రమంగా ఉక్రెయిన్ లోకి అమెరికా ఇచ్చి ఉండవచ్చు!

శుద్ధి చేసిన యూరెనియం ఉంటే అణు బాంబు తయారు చేయవచ్చు కానీ దానిని పేల్చడానికి ట్రిగ్గర్ కావాలి. ట్రిగ్గర్ తయారుచేయగల సామర్ధ్యం అమెరికా, రష్యాల దగ్గర మాత్రమే ఉంది. రష్యా చైనాకి ఇచ్చింది. చైనా ఉత్తర కొరియాకి ఇచ్చింది. ఉత్తర కొరియా నుండి పాకిస్థాన్ కి వచ్చింది.

ట్రిగ్గర్ ఇప్పటికే ఉక్రెయిన్ కి ఇచ్చి ఉండవచ్చు జో బిడెన్!

******
మార్జోరే టేలర్ గ్రీనే ఆరోపణలకి బలమైన సాక్ష్యాలు కనపడుతున్నాయి.

7.బాంగ్లాదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే ఏ మాత్రం భయపడకుండా ప్రవర్తిస్తున్నది మన దేశంతో. అంటే జనవరి 20 తరువాత ఏమీ జరగదు అనే భరోసా ఎవరో ఇచ్చి ఉంటారు.

8.ప్రశాంతంగా ఉండే దక్షిణ కొరియాలో సంక్షోభం సృష్టించింది అమెరికా. అమెరికాకి తొత్తుగా పిలిచే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్ ( Yoon Suk Yeol ) మార్షల్ లా విధించాడు. ప్రతి పక్షాలు, ప్రజలు తీవ్రంగా ఎదురు తిరిగే సరికి మార్షల్ లా విధించిన 7 గంటల తరువాత ఉపసంహరించాడు. మార్షల్ లా విధించడానికి యూన్ చెప్పిన కారణమ్ ఏమిటంటే ప్రతి పక్షాలు ఉత్తర కొరియా కి మద్దతుగా మాట్లాడుతున్నాయి అని. అర్ధరాత్రి రాజధాని సియోల్ లో యుద్ధ టాంక్ లు తిరగడం ఉదయానికి వెనక్కి వెళ్లిపోవడం విచిత్రంగా లేదూ?

9. అయిదు రోజుల్లో సిరియా రెబెల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది.

10.రొమేనియా ఎంత దేశం? ఏదో జరగబోతున్నది అంటూ 12 F35 ఫైటర్ జెట్స్ కొనడానికి ఒప్పందం మీద సంతకం చేసింది రొమేనియా! సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చింది అమెరికా వారం క్రితం. రొమేనియా 1964 లో అప్పటి సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్య్రం పొందింది. రొమేనియా ఉక్రెయిన్ తో సరిహద్దుని కలిగి ఉంది కానీ వివాదం ఉంది.

11. నిన్న ఆధునిక డ్రోన్స్ తో ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి రిఫైనరి మీద దాడి చేసి ధ్వంసం చేసింది. దాంతో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ లోని ఫార్వర్డ్ దళాలకి ఇంధనం సరఫరా చేయలేదు. మూడింట రెండు వంతుల చమురు శుద్ధి చేసే సామర్ధ్యం కోల్పోయింది రష్యా.

So! ట్రంప్ అధికారంలోకి రాడు అనేగా ఇవన్నీ జరుగుతున్నది?

లేకపోతె నెల రోజుల కోసం ఇన్ని చేస్తారా?

జనవరి 20 దాకా ఆగనవసరం లేదు. బాంగ్లాదేశ్ ని మనదేశం మీదకి ఉసిగొలిపి బాంగ్లాదేశ్ మీద మోడీ దాడి చేసేలా చేసి పాకిస్థాన్ బాంగ్లాదేశ్ కి సహాయంగా దాడి చేయించాలనే ప్లాన్ ప్రస్తుతం అమలవుతున్నది.

మోడీని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా జో బిడెన్ పావులు కదుపుతున్నాడు.

Dec 3 న డోనాల్డ్ లూ భారత్ చేరుకున్నాడు. డోనాల్డ్ లూ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది అని తెలుసు కదా? డోనాల్డ్ లూ భారత్ తో పాటు శ్రీలంక, నేపాల్ దేశాలలో పర్యటిస్తున్నాడు. Dec 10 న అమెరికా వెళ్ళిపోతాడు.

ఇప్పటికే మోడీని ఆస్థిర పరచడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది అంటూ ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది!

అంటే భారత ప్రభుత్వానికి ఏదో తెలుసు కానీ అదేమిటో బయటికి చెప్పడం లేదు.

ఒకటి మాత్రం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అది : బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లతో ఘర్షణ లేదా యుద్ధం జరగవచ్చు.

చైనా ఇప్పటికే అర్ధం చేసుకుంది కాబట్టి జోక్యం చేసుకోదు.

ఒక మాజీ CIA అధికారి ఒక విలువైన విషయం బయటపెట్టాడు : ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతున్నది అనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న రాడికల్ ముస్లిం గ్రూపులకి తెలుస్తుంది. వాళ్ళు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. ఒక చిన్న రహస్య సంకేతం చాలు దాడులు మొదలుపెట్టడానికి!

భారత్ కి మినహాయింపు ఉండదు!

ఒకసారి బాంగ్లాదేశ్ తో ఘర్షణ మొదలువ్వడమే చాలు పుట్టలోంచి చీమలు బయటికి వస్తాయి. జనవరి 20 దాకా ఆగే అవకాశం ఉండబోదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions