కామాతురాణాం నభయం నలజ్జ… కామంతో ఉన్నవాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు అంటారు కదా… నిజానికి అది రాజకీయాధికారానికి వర్తిస్తుంది… అక్షరాలా రాజకీయ నాయకులకే అది ఆప్ట్… పర్‌ఫెక్ట్ ఉదాహరణ నితిశ్… జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి ఎప్పుడు తనకు ఆలోచన వస్తే అప్పుడు పొత్తులు మార్చేస్తాడు… తనకు కావల్సింది కుర్చీ… వోట్లేసిన జనం, కార్యకర్తలు, మన్నూమశానం జాన్తా నై…
Every Thing is Fair in Love and War అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ప్రతిదీ ఫెయిర్ అనుకుని నిర్లిప్తంగా ఓసారి ప్చ్ అని నిట్టూర్చడమే బెటరేమో… పేరుకు ఇది సెక్యులర్ పార్టీ… ఇటు బీజేపీ వైపు ఉంటాడు, అటు వెంటనే ఆర్జేడీ వైపు జంపుతాడు… మిగతా పార్టీల వాళ్లు పిచ్చోళ్లలా నితిశ్ కదిలించే పావుల్లా మారిపోతుంటారు… ఈ పార్టీల్లో ది గ్రేట్ బీజేపీ కూడా ఉండటమే ఆశ్చర్యం…
నిజానికి బీజేపీ తన అపరమిత సాధనసంపత్తిలో పార్టీలను, నేతల్ని లోబరుచుకుని ఆట తను ఆడుతూ ఉంటుంది… కానీ బిహార్ వేరు… నితిశ్ ఆటలో తను పావు అవుతూ ఉంటుంది… ఇప్పుడు నితిశ్ మరో ఆట మొదలెట్టాడు… బీజేపీ మళ్లీ గుడ్డిగా తలూపి తన వెంట నడవడానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది… ఫాఫం…
Ads
ఇక్కడ అధికారానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 122… బీజేపీ, జేడీయూ కలిస్తే ఆ రెండే చాలు… కానీ నితిశ్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని, తనకు సిగ్గూశరం ఉంటే మళ్లీ బీజేపీ వైపు తొంగిచూడను అన్నాడు… అవి ఉండవు కదా, బీజేపీ వైపే చూస్తున్నాడు… సరే, పోతేపో అని లాలూ తనదైన రాజకీయాల్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నాడు గానీ… కాంగ్రెస్, ఆర్జేడీ కలిస్తే సరిపోదు… సరే, 16 లెఫ్ట్, 4హెచ్ఎం కలిసినా చాలదు… మజ్లిస్ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి… ఐనా రెండు తక్కువే… ఇక మిగిలింది జేడీయూను చీల్చడమే…
తను అనుకున్నట్టు అధికారం కొనసాగకపోతే నితిశ్ ఏం చేయాలి..? ఐతే అసెంబ్లీని రద్దు చేసి, నేరుగా వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిపోవడం… ఎలాగూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పాజిటివ్ రిజల్ట్ రాబోతోందని అందరూ నమ్ముతున్నారు కదా, ఆ దెబ్బకు మళ్లీ అయిదేళ్ల పాలనాధికారం సుస్థిరంగా దక్కుతుందని నితిశ్ ఆశ… అది సక్రమంగా జరగాలంటే ప్రస్తుత సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ప్రకటించి, బీజేపీ పొత్తుతో మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని కల్పించడం… సో, ఇక్కడ బాల్ బీజేపీ కోర్టులో ఉంది…
నిజానికి బీజేపీ ఇలాంటి ట్రాపుల్లో పడకుండా… తనే స్వతంత్రంగా బరిలో దిగడం కరెక్టు… కొన్నాళ్లు వెయిట్ చేస్తే చాలు, తనకు ఎలాగూ మంచి చాన్స్, మెజారిటీ వచ్చే సూచనలున్నయ్ అక్కడ… ప్రభుత్వ వ్యతిరేకత, కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న, ఇండి కూటమిలో లుకలుకలు, అయోధ్య పాజిటివ్ వైబ్స్ కలిసొస్తాయి… మరి అలాంటప్పుడు అత్యంత చంచలవేత్త నితిశ్ ఆడే చదరంగంలో పావు ఎందుకు కావాలి..? అబ్బే, బీజేపీ హైకమాండ్ అస్సలు అంతుపట్టదు… తెలంగాణలో కేసీయార్‌కు దాసోహం అనలేదా..? అందరమూ చూడలేదా..? కొన్ని అలా తర్కరహితంగా చేసేస్తూ ఉంటుంది బీజేపీ…!! స్థానిక బీజేపీ శ్రేణుల ఆకాంక్షలను సైతం పట్టించుకోదు ఇలాంటి సందర్భాల్లో..!!
Share this Article