మోడీకి కేసీయార్ సరెండర్…. ఇదే కదా ఆంధ్రజ్యోతి మొన్నటి ఆదివారం ఆ పత్రిక ఓనర్ రాసిన పెద్ద ‘కొత్త పలుకు’ వ్యాసానికి శీర్షిక… అందులో ఏమని రాశాడో గుర్తుందా..? ‘‘మోడీకి కేసీయార్ సరెండరయ్యాడు… కేసీయార్ జగన్ ద్వారా పావులు కదిపితే… ఇటు అవినాష్ రెడ్డీ సేఫ్… అటు కవిత సేఫ్… బీజేపీ ఇక ఫుల్లుగా కేజ్రీవాల్ మీదే కాన్సంట్రేట్ చేస్తుంది… ఎందుకంటే తన ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ కొరకరాని కొయ్య అయిపోయాడు… అందుకే మోడీ కాన్సంట్రేషన్ తన మీదే… అరెస్టు చేయవచ్చు కూడా…
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం హఠాత్పరిణామం ఏమీ కాదు… కొన్ని మాసాలుగా తెర వెనుక తతంగం సాగుతోంది… ఇప్పుడు అప్రూవర్‌గా మారిపోవడంతో మద్యం కేసు బిగుసుకుని కేజ్రీవాల్ ఇరుక్కుంటాడు… వివేకా హత్య కేసులో సీబీఐ చల్లబడుతుంది… ఇక కేసీయార్ మోడీ మీద ఏమీ మాట్లాడడు… సో, మోడీ హేపీ, జగన్ హేపీ, కేసీయార్ హేపీ…’’ దాదాపు ఇదే కదా రాధాకృష్ణ రాతల సారాంశం… కొందరు నవ్వుకున్నారు… ఇంకొందరు నమ్మారు… కానీ తెర వెనుక దాదాపు ఇదే జరుగుతుందని అనుకున్నారు కొందరు…
నువ్వు గోకూ గోకకపో, నేను గోకుతూనే ఉంటా…. అని కేసీయార్ కొన్నాళ్లుగా మోడీ వెంటబడ్డాడు… పరుషమైన మాటలు వదిలాడు… బిడ్డా, గాయిగత్తర లేపుతా, నీ సంగతి చూస్తా అనీ సవాల్ విసిరాడు… కానీ ఇప్పుడేం జరిగింది..? కేసీయార్ గోకుడు బంద్… ఈమధ్య జిల్లా పర్యటనలకు వెళ్లి చేస్తున్న ప్రసంగాల్లో మోడీ ప్రస్తావన లేదు… కాన్సంట్రేషన్ మళ్లీ కాంగ్రెస్ పార్టీపై పడింది… రాష్ట్ర బీజేపీ కూడా చల్లబడిపోయింది… జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం పెరిగింది… అంతేకాదు, ఈటల కూడా బీజేపీలో కంపర్ట్‌గా ఏమీ లేడని, తను కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాడనీ ప్రచారం సాగుతోంది… వాళ్లతోపాటు విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎట్సెట్రా కూడా…
Ads
రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు కూడా బాగా ఉంది… కేసీయార్ అనుకూల వర్గం ఒకటి బండి సంజయ్ దూకుడుకు ఎక్కడికక్కడ పగ్గాలు వేయడమే కాదు, హైకమాండ్ దగ్గర ఏవేవో చెప్పి సంజయ్ పట్ల వ్యతిరేకతను పెంచుతోందనే ప్రచారం ఉంది… రాష్ట్ర బీజేపీలోకి ఎవరినీ కొత్తవారిని రానివ్వరు, రానివ్వడం లేదు… నాగం సహా చాలామంది వచ్చారు, వెళ్లిపోయారు… మొత్తానికి తెలంగాణ మీద బీజేపికి ఆశలెక్కువ… పటాటోపం ఎక్కువ… చేయాల్సిన శ్రమ, పడాల్సిన ప్రయాస మాత్రం ఏమీ లేదు అన్నట్టుగా మారింది స్థితి…
కవితను అరెస్టు చేయకపోవడంతో ఇటు బీజేపీ హైకమాండ్, అటు బీఆర్ఎస్… తమ మధ్య బయటికి చెప్పుకోలేని బలమైన బంధం ఉందనే సంకేతాలను ప్రజలకు ఇస్తున్నట్టయింది… ఈమధ్య మరీ ఆంధ్రజ్యోతి రాసినట్టుగానే బీఆర్ఎస్, బీజేపీ ప్రస్తుతానికి ప్రజల ఎదుట ఉత్తుత్తి ఫైట్ చేస్తున్నట్టుగానే ఉంది… తెర వెనుకకు పోాగానే ఆ కర్ర కత్తులు పక్కనపడేసి ఆలింగనం చేసుకుంటున్నాయి… ఇదంతా ఉభయతారక ప్రహసనం… బీఆర్ఎస్‌కు బలమైన ప్రతిపక్షం లేకుండా పోతుంది…
ఈరోజుకూ తెలంగాణవ్యాప్తంగా మంచి కేడర్ ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బతీయాలి… బీజేపీ కోరుకునేది కూడా అదే కదా మరి…! ఓ పెద్దాయన నవ్వుతూ చెప్పిన మాట… ‘‘రేప్పొద్దున కేంద్రంలో ఎన్‌డీయేకు నాలుగు సీట్లు తక్కువ పడితే అందరికన్నా ముందుగా మద్దతు ప్రకటించేది కేసీయార్… ఎందుకంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, మోడీ వ్యతిరేక పార్టీలు కేసీయార్‌ను మాత్రం దగ్గరకు రానివ్వవు, ఆయన్ని ఆ పార్టీలు నమ్మవు.., కేసీయార్‌ను యాంటీ మోడీ మీటింగులకు పిలవకపోవడమే తార్కాణం…’’
రైలు ప్రమాదం కారణంగా మోడీ-చంద్రబాబు భేటీ జరగలేదు… అమిత్ షాను కలిశాడు… రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అమిత్ షాను కలిసినట్టుగా చంద్రబాబు తన కేడర్‌కు చెప్పుకున్నాడని పత్రికల్లో వార్తలు రాయించుకున్నాడు… అఫ్‌కోర్స్, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ హోదాలో అమిత్ షాతో చర్చలు జరిపాడు… ఏమిటా ప్రయోజనాలు..? అంతా ఉత్తదే… హంబగ్… ఒకవేళ చంద్రబాబు ఎత్తుగడలు ఫలించి, ఎలాగూ ఏపీలో ఒంటరిపోటీతో సాధించదేమీ లేదు కాబట్టి చంద్రబాబుతో గనుక బీజేపీ మిలాఖత్ అయిపోతే… బీజేపీకి తెలంగాణలో మరింత దెబ్బ… బీఆర్ఎస్‌తో నిజమైన పోరాటం లేక ఒకవైపు… చంద్రబాబు దోస్తీ గుదిబండగా మారి మరోవైపు… తెలంగాణ బీజేపీ మరింత నీరసపడిపోవడం ఖాయం… ఇప్పటికే బీజేపీ జోష్ బాగా చల్లబడినట్టు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది… !!
Share this Article