రండి, రండి, వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం… అని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్‌కు పిలుపునిచ్చాడు… నో డౌట్, ఖమ్మం మీటింగుకు జనం బాగానే వచ్చారు… అదేమిటో గానీ తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్రా పార్టీకి ఖమ్మమే గుమ్మం… అటు వైఎస్పార్టీపి అక్కడే పార్టీ ఆఫీసు కట్టుకుంటోంది… తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది… పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగు పెడతాడు… జనసేనదే ఇంకా ఎటూ తేలడం లేదు…
ఇంతకీ అందరినీ వచ్చేయాలని చెబుతున్నాడు కదా… అసలు వెళ్లిపోయే పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరు..? ఇప్పుడు రారండోయ్ అనగానే పరుగెత్తుకుని రావాలా..? తెలంగాణలో పార్టీని వదిలేసి పోయావ్… కేడర్ అష్టకష్టాలు పడింది… ఏదో సైలెంటుగా టీఆర్ఎస్‌లో చేరిపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే కేసీయార్ ఇంకా దారుణంగా చీల్చేవాడు పార్టీ కేడర్‌ను…
ఒక్క రేవంత్‌రెడ్డి అండ్ గ్యాంగ్ కొంతకాలం ఏదో పోరాడి, నిలబడి… చివరకు కాంగ్రెస్‌లో చేరిపోయింది… (ఇదే చంద్రబాబు సూచించాడని ఓ టాక్… మళ్లీ ఆ గ్రూపంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే దిక్కులేని స్థితికి చేరారు…) తరువాత అసలు తెలంగాణలో తెలుగుదేశం అనే పార్టీ ఉండేది అని చెప్పుకునే అవశేషాలు కూడా కనిపించకుండా మాయమైపోయింది… ఈ స్థితిలో మళ్లీ వస్తున్నాడు చంద్రబాబు… తన కార్యక్షేత్రం ఆంధ్రా… తన ప్రత్యర్థి జగన్… తన ఆశలు అమరావతి… మరి ఈ తెలంగాణ లొల్లి దేనికి..?
Ads
ఇప్పుడు మళ్లీ ఆర్గనైజ్ చేస్తాడు సరే… హైదరాబాద్, మరికొన్ని సెటిలర్స్ ఏరియాల్లో పార్టీలో కదలిక వస్తుంది కరెక్టే… కానీ మళ్లీ రేప్పొద్దున ఇంకేదో భయం వెంటాడి, వదిలేసి పారిపోతే ఎలా..? నాయకుడే స్థిరంగా, భయరహితంగా నిలబడకపోతే ఇక కేడర్ నిర్భయంగా ఎలా ఉంటుంది…? రండి, రండి, ఉద్దరిద్దాం, తెలంగాణ అభివృద్ధి అంతా నా పుణ్యమే అంటాడు తప్ప… రేవంత్ ఉన్న కాంగ్రెస్‌ను పల్లెత్తు మాట అనడు… ఏం భయమో గానీ కేసీయార్ మీద మాట్లాడడు… బీజేపీ ప్రస్తావనే తీసుకురాడు…
బేసిక్‌గా ప్రభుత్వ విధానాల మీద తన వైఖరి ఏమిటో చెప్పడు… నేను మొబైల్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, సైబరాబాద్ కట్టిపెట్టాను అనగనే జనం వోట్లేసి, కుర్చీలు ఎక్కించాలా..? కేసు భయంతో, తెలంగాణ దుకాణం మూసేసి, తెరచాటు చీకటి ఒప్పందాలతో అమరావతికి పారిపోయిన తనకు అసలు తెలంగాణ జనం వోట్లు ఎందుకు వేయాలి..?
తెలంగాణలో కొన్నిచోట్లనైనా బలం పెంచుకుని, షో చేసి, మీడియాలో ఫుల్లు రాయించుకుని, బీజేపీ గనుక పొత్తుకు వస్తానంటే… ఏపీలో పొత్తును బేరంగా పెట్టాలనే ఎత్తుగడా ఇది..? ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తే ఇక జగన్ పని మటాషే అనే ఆంచనాయా..? వైసీపీ వ్యతిరేక వోటు చీలనివ్వను అని పవన్ హైపిచ్ ప్రసంగాల సారం కూడా ఇదేనా..? ఏమో… ఇప్పుడున్న స్థితిలో, చంద్రబాబు అంటే మోడీకి ఉన్న వ్యతిరేకతను బట్టి చూస్తే… అవసరమైతే పార్టీనే తొక్కే పని చేపడతారు తప్ప, చంద్రబాబుతో పొత్తు బేరాలు ఆడతారని అనుకోలేం… ఏమో, చంద్రబాబు మార్మిక ఆలోచన ఏమిటో మరి..? తెలంగాణలో చంద్రబాబు వల్ల తమకు నష్టం అని బీజేపీ ఫిక్సయితే మాత్రం, అది చంద్రబాబుకే ఇబ్బంది భవిష్యత్తులో…!!
Share this Article