Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా దురాక్రమణ దూకుడుకు… దలై లామా వారసుడి ప్రకటనకూ లింకు…

December 26, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి…..  చైనా లడాక్ దగ్గర తన సైన్యాన్ని అలానే ఉంచి, ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ మీద దృష్టి పెట్టింది ? చైనా, పాకిస్థాన్ లు కలిసి భారత్ మీద దాడి చేస్తాయి అని రాహుల్ అంటున్నాడు ! అమెరికన్, ఆస్ట్రేలియన్ శాటిలైట్లు తీసిన ఫోటోలని చూపిస్తూ చైనా అరుణాచల్ ప్రదేశ్ తోపాటు హిందూ మహా సముద్రంలో భారత నావీ మీద దాడికి సన్నాహాలు చేస్తున్నది అని హెచ్చరిస్తున్నారు !

అసలు మన ప్రభుత్వం ఆడగకుండా ఇలా ప్రైవేట్ శాటిలైట్ సంస్థలు ఫోటోలు తీయడం, వాటిని విశ్లేషిస్తూ అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడడం ఎందుకు ? రాహుల్ చేసిన వ్యాఖ్యకి ఇలా ప్రైవేట్ శాటిలైట్ సంస్థలు మాట్లాడడానికి ఏదన్నా సంబంధం ఉందా ? మరో వైపు చైనా విదేశాంగ మంత్రి భారత్ తో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉంది అంటూ ప్రకటన చేశాడు నిన్న! పైన ఉదహరించిన వాటిలో ఒకదానితో ఇంకొకటి పోలి ఉన్నా, చివరగా చైనా విదేశాంగ మంత్రి మాటలు మాత్రం వాజపేయి హయాంలో లాహోర్ బస్సు యాత్ర, ఆ తరవాత కార్గిల్ చొరబాటుని గుర్తుకు తెస్తున్నాయి.

************************************

Ads

చైనా – దలై లామా ఫాక్టర్ !

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లోని ‘గాల్డెన్ నామ్గే లాట్సే ’[Galden Namgey Lhatse] బౌద్ధ మఠం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద బౌద్ధ మఠం టిబెట్ లోని బౌద్ధ మఠం తరువాత ! టిబెట్ లోని లాసాలో ఉన్న పొటాల పలాసే [Potala Palace] అతి పెద్ద బౌద్ధ మఠం! తవాంగ్ మొదటి నుండి సాంస్కృతికంగా, మత పరంగా, ఆర్ధికంగా టిబెటన్ బౌద్ధులతో పాటు ప్రపంచంలో ఉన్న బౌద్ధులకి అత్యంత ముఖ్యమయినది. టిబెట్ లోని లాసా బౌద్ధ మఠం మరియు తవాంగ్ లోని గాల్డెన్ నామ్గే లాట్సే లు బౌద్ధులకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, టిబెట్ ని చైనా ఆక్రమించిన తరువాత టిబెట్ లోని పధాన బౌద్ధ మఠం తన ప్రాముఖ్యతని కోల్పోయింది… కాగా ప్రస్తుతం తవాంగ్ లోని గాల్డెన్ నామ్గే లాట్సే బౌద్ధ మఠం నుండి ప్రధాన కార్యకలాపాలు జరుగుతున్నాయి.

తవాంగ్ లోని గాల్డెన్ నామ్గే లాట్సే మఠం ఆరవ దలై లామా [ఉర్గెల్లింగ్ గొంప] కి జన్మస్థలము. కాబట్టి తవాంగ్ బౌద్ధులకి అత్యంత ముఖ్యమయినది. టిబెట్ లో ప్రధాన మఠంని చైనా గత 7 దశాబ్దాలుగా నాస్తిక వాదంతో ప్రభావితం చేస్తూ వచ్చింది. అసలు దలై లామా అంటూ ఎవరూ ఉండరని, అదంతా మూఢ నమ్మకం అని బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నది. కానీ టిబెటన్లు అంత త్వరగా నాస్తిక వాదాన్ని నమ్మరనీ చైనాకి తెలుసు… కాబట్టి ప్రస్తుత దలై లామా భారత్ లో ఉన్నాడు కాబట్టి, అతని వారసుడిగా ఒక బాలుడిని దలై లామాగా ప్రకటించి, ఆ బాలుడిని అక్కడి బౌద్ధ మఠంలో ఉంచింది…

కానీ అతను దాదాపుగా హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు చాలా కాలం నుండి. బౌద్ధులు ఎవరయినా సరే అక్కడి దలై లామా ని దర్శించుకోవాలి తప్పితే చైనా నియమించిన దలైలామా మాత్రం ఆ బౌద్ధ మఠం నుండి బయటికి రావడానికి అనుమతించదు.  ప్రస్తుతం భారత్ లో ఉన్న దలై లామా తన వారసుడిని వెతికే పనిలో ఉన్నారు… ఎందుకంటే, ఇప్పటికే అతని వయస్సు 87 ఏళ్లు. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న దలై లామా 14 వ తరం వారు !

14 వ దలై లామా తన వారసుడు భారత్ లోని తవాంగ్ లో ఉన్నాడు అని ప్రకటించారు కాబట్టి, తన వారసుడిని ప్రకటించి, అతనిని కనుక తవాంగ్ లోని గాల్డెన్ నామ్గే లాట్సే బౌద్ధ మఠంలో నియమిస్తే, అప్పుడు టిబెట్ లోని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు అందరూ తవాంగ్ లోని దలై లామానే పూజిస్తారు, గౌరవిస్తారు… టిబెట్ లో చైనా నియమించిన దలై లామాకి ప్రాముఖ్యత ఉండదు. ఇదే జరిగితే ఎప్పుడయినా టిబెట్ బౌద్ధులు చైనాకి వ్యతిరేకంగా తిరగబడే అవకాశం ఉంటుంది.

భారత్ ని ఎదుర్కోవడానికి మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ని ఎదుర్కోవడానికి ఇప్పటికే టిబెట్ లోని యువకులతో ఒక ప్రత్యేక బెటాలియన్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నది చైనా సైన్యం ! అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కనుక దలై లామా నియామకం జరిగితే అప్పుడు టిబెట్ లోని చైనా శిక్షణలో ఉన్న టిబెట్ యువకులు భారత్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇష్టపడరు! వాళ్ళు తవాంగ్ లోని దలై లామా ఆదేశాలని పాటిస్తారు !

*********************************************

14 వ దలై లామా తన వారసుడిని ప్రకటించి అతనిని తవాంగ్ లో నియమించే లోపున ఎలాగయినా అరుణాచల్ ప్రదేశ్ ని స్వాధీనం చేసుకొని, తవాంగ్ మీద ఆధిపత్యం వహించాలి లేకపోతే అరణాచాల్ ప్రదేశ్ తో పాటు టిబెట్ తమ నుండి వేరు అయిపోయే అవకాశాలు ఉన్నాయని చైనా గాఢంగా విశ్వసిస్తున్నది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ దలై లామాకి గట్టిగా మద్దతు పలుకుతున్నారు అంటే భారత్ లో బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నంత కాలం తవాంగ్ విషయంలో తీవ్రంగా స్పందిస్తుంది ! మరోవైపు తైవాన్ లో ఇప్పుడున్న ప్రభుత్వం టిబెట్ ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నది. తైవాన్ ప్రభుత్వం తమ విద్యార్ధులని టిబెట్ లోని బౌద్ధ సంస్కృతి మీద అధ్యయనం చేయడానికి స్కాలర్ షిప్స్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నది. టిబెట్ లో దలైలామా పునరావతారం గురించి పరిశోధన చేసే విద్యార్ధులకి డాక్టరేట్ ఇవ్వడానికి ప్రోత్సాహాకాలని ప్రకటించింది. ప్రస్తుతం భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులకి సందేశం ఇస్తున్నారు దలై లామా !

తైవాన్ ఇప్పుడు టిబెట్ దేశాధినేతగా దలై లామాని తమ దేశంలో పర్యటించమని అడుగుతున్నది ! ఒకవైపు అమెరికా తైవాన్ వైపు నిలబడి తమ ప్రయోజనాలని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ చైనాకి చికాకులు కల్పిస్తున్నది. దాంతో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా 14 వ దలై లామా తన వారసుడిని ప్రకటించేలోపలే తవాంగ్ ని తన అధీనంలోకి తీసుకోవాలని ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీని వల్ల చైనాకి రెండు లాభాలు.

1. భారత్ తన సైన్యాన్ని లడాక్ మరియు అరుణాచల్ వైపు మోహరించి చిన్నపాటి యుద్ధం చేస్తే అది ఆర్ధికంగా భారత ఆర్ధిక వ్యవస్థని దెబ్బతీస్తుంది పైగా కోవిడ్ వల్ల చైనా నుండి తరలిపోయే పరిశ్రమల యజమానులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది యుద్ధం వలన. 2 తనకి నమ్మకమయిన కాంగ్రెస్ ని తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో కూర్చోబెట్టే అవకాశాన్ని యుద్ధం కలిగిస్తుంది అని నమ్ముతున్నది చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమాండ్ ! కాకపోతే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపి ప్రభుత్వం ఇప్పటికే దీని మీద ప్రతి వ్యూహాలని సిద్ధం చేసింది కాబట్టి చైనా ప్రయత్నం అంత సులువుగా సిద్ధించదు ! నష్టం అనేది రెండు వైపులా ఉంటుంది ! కాకపోతే ఎవరు ఎక్కువ నష్టపోతారు అన్న దాని మీద ఆధారపడి తైవాన్ స్వాధీన ప్రక్రియ ఉంటుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions