ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అత్యంత ఘోరంగా ఫ్లాపయింది… నిజమే, ఫ్లాపే అని అంగీకరిస్తూ నిర్మాత సుంకర అనిల్… బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే, సరైన స్క్రీన్ ప్లే లేకుండానే సినిమా తీసేశామనీ, చేతులు కాలాయనీ చెబుతున్నాడు… ఇంకా నయం, ప్రస్తుతం ఇండస్ట్రీలో పాపాల భైరవుల్లా కనిపిస్తున్న దర్శకుల మీదకు నెపాన్ని తోసేయలేదు… అక్కడికి సురేందర్‌రెడ్డి లక్కీ ఫెలో… ’’
అఖిల్‌కు కూడా మనసులో ఎంత కోపం, అసంతృప్తి ఉన్నా… తన స్టామినా సరిపోదు కాబట్టి ఎవరినీ నిందించలేదు… రచయిత వక్కంశం వంశీ చెప్పిన సింగిల్ లైన్ ప్లాట్‌తో సినిమాను చుట్టేశారు… ఇది ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేయడం… కొన్నాళ్ల క్రితం ఆచార్య ఫెయిల్యూర్‌కు చిరంజీవి దర్శకుడిని నిందించాడు… సెట్‌కు వచ్చి డైలాగులు రాస్తున్నారు, అప్పటికప్పుడు స్క్రీన్ ప్లే మారుస్తున్నారు, కథలో ఛేంజెస్ చేస్తున్నారు అని పలు కామెంట్స్ చేశాడు… సీన్స్, డైలాగ్స్ ఫైనలయ్యాకే సెట్ మీదకు వెళ్లాలని హితబోధ కూడా చేశాడు…
రామబాణం సినిమా కూడా అంతే… అదీ అట్టర్ ఫ్లాప్… ఎక్కువ ఫీడ్ ఉన్నా సరే, కాస్త ఎక్కువే కట్ చేశాం, ఎందుకైనా మంచిదని కొన్ని సీన్లు అదనంగా చిత్రీకరించి పెట్టుకున్నామని హీరో గోపీచంద్ ఏదో ప్రమోషన్ మీట్‌లో చెప్పినట్టు గుర్తు… డిలిటెడ్ సీన్స్ అని దాదాపు 16 నిమిషాల ఫుటేజీని బిట్లుబిట్లుగా యూట్యూబులో విడుదల చేస్తున్నారు… అవి ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో సెట్ కావు, మరెందుకు షూట్ చేసినట్టు..? నిర్మాతకు లాస్ కాదా..?’’
Ads
….. ఇదండీ వార్త సారాంశం… సరిగ్గా భిన్నమైన చిత్రాన్ని, అసలైన విషయాన్ని మాట్లాడుకుందాం… హీరోయిన్‌గా ఎవరుండాలో, ఆమె చెప్పులు ఎలా ఉండాలో దగ్గర నుంచి పాటల ట్యూన్లు, రాగాలు, పాటల రచయిత, కొరియోగ్రఫీలో మూమెంట్స్… చివరకు కార్వాన్‌లో టీ ఎవడు సప్లయ్ చేయాలో కూడా హీరోయే డిసైడ్ చేస్తున్న దుర్దినాలు ఇవి… దర్శకుడి మెగాఫోన్ లాక్కుని తామే డైరెక్షన్ కూడా వెలగబెడుతున్న గ్రహణకాలం ఇది… అలాంటిది కథ ఏమిటో, స్క్రీన్ ఫ్లే ఏమిటో ముందే తెలియదా..? దర్శకుడు ఎలా సీన్లు తీస్తున్నాడో చూడటం లేదా..?
పోస్ట్ ప్రొడక్షన్‌కు ముందే రషెస్ చూస్తూ అవసరమైతే రీషూట్ అని హీరోగారు ఆర్డర్లేస్తున్న రోజులివి… హిట్టయితే హీరో గొప్పదనమా..? ఫెయిలైతే దర్శకుడి నిర్వాకమా..? పాపాల భైరవుడు అయిపోయాడా చివరకు దర్శకుడు..? సినిమా పరాజయానికి, విజయానికి సమానబాధ్యత హీరో ఎందుకు స్వీకరించడు..? దిక్కుమాలిన పాత కథలతో రొటీన్ ఇమేజీ బిల్డప్పుల సినిమాలు తీయిస్తూ, అన్నీ తామే డిసైడ్ చేస్తూ… ఫెయిల్యూర్ బాధ్యతను మాత్రం దర్శకుడి మెడలో వేయాలా..?
రాజమౌళి, సుకుమార్ వంటి ఒకరిద్దరు మినహా మిగతా దర్శకుల్లో ఎవరు తమ స్వతంత్రతను కాపాడుకుంటున్నారు..? హీరో కాళ్ల మీద పడి బతకడం, వాళ్లు చెప్పింది చేయడం మినహా…! అందుకే హీరోలకు అలుసైపోయారు… ఏజెంట్ సినిమాయే తీసుకుందాం… బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమా తీశాం అని చెప్పడానికి నిర్మాత సిగ్గుపడాలి… ఆ పిచ్చి ప్రయోగానికి అఖిల్ కెరీర్‌నే పణంగా పెట్టారు… ఈ విషయంలో నాగార్జునది కూడా తప్పే… చైతూ, నాగ్, అఖిల్… అందరూ ఫ్లాపర్లే కదా, మరి ఏజెంట్ కథ, స్క్రిప్టు విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు దేనికి..?
రామబాణం కథా ఇంతే… కథకు అవసరం లేని సీన్లు షూట్ చేస్తున్నాడని నిర్మాతో, హీరో గమనించలేదా..? అదే నిజమైతే నిర్మాత సిగ్గుపడాలి… తను డబ్బు ఖర్చు చేస్తున్న సినిమా ఎటువైపు వెళ్తుందో తనకు కూడా తెలియకపోతే ఇక నిర్మాతతనం దేనికి..? అవును, ఎంతసేపూ హీరోల తొక్కలో ఇమేజీ కోణంలోనే సినిమాలు తీస్తే… ఇప్పటిదాకా చెలామణీ అయ్యింది… కానీ ఇకపై నడవవు… ప్రేక్షకులు చాలా ఎదిగిపోయారు… ఈడ్చి తంతున్నారు… ఎవరు బాధ్యులనే విషయంలో మీరూ మీరూ ఈ హీరోక్రసీ వ్యవస్థలో తన్నుకొండి… ప్రేక్షకుడికి అవన్నీ పట్టవు… పట్టాల్సిన అవసరమూ లేదు…
Share this Article