Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీబీసీ… మీ రాజకుటుంబం నిర్వాకాల మీద ఒక్క డాక్యుమెంటరీ ప్లీజ్…

February 25, 2023 by M S R

Devika Reddy………   గురివింద తనకింది నలుపు ఎరగదన్నట్టు….

వీళ్లు మేఘన్, హ్యారీ…

చార్లెస్, డయానా చిన్నకొడుకు హ్యారీ నల్లజాతిపిల్ల మేఘన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు…

అత్త డయానా అంత అందగత్తె కాకపోయినా… అంతకుమించిన ఆత్మవిశ్వాసం తనలో…

డయానాను వేధించినట్టే రాజకుటుంబీకులు, ముఖ్యంగా మొన్న పోయిన ముసల్ది ఎలిజబెత్ ఈ పిల్లనూ వేపుకు తింది…

అందుకే మీ ప్యాలెస్ కు ఓ దండమంటూ హ్యారీని తీసుకుని దేశం వీడింది.. అయినా వేధించింది రాజకుటుంబం, వాళ్ల మీడియా…

డయానాను పొట్టనపెట్టుకున్నట్టే తననూ మింగుతారని అనుకుందేమో…

May be an image of 2 people, people standing and outdoors

ప్యాలెస్ ను గుప్పిట్లో పెట్టుకున్న మీడియానూ మేఘన్ ఎప్పుడూ లెక్కచేయలే…
ఆమధ్య అసోసియేట్ ప్రెస్ మీద సుప్రీం కోర్టులో దావా వేసింది ఏకంగా… తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ…

పెద్దోడు ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్ మిడిల్టా తెల్లతోలుది … అందుకే ఫ్యామిలీ అంతా ఇప్పుడు తనకు దాసోహం…

మేఘన్ కడుపుతో ఉన్న రెండుసార్లూ టార్చర్… పుట్టే పిల్ల నల్లగా పుట్టొద్దూ, తెల్లగా ఉంటేనే అంగీకరిస్తాం అని… అప్పుడెంత టెన్షన్ పడ్డానోనని ఓ ఇంటర్వ్యూలో వాపోయింది మేఘన్ హ్యారీతో కలిసి… కాకుంటే తెల్లపిల్లలే పుట్టారు…

ఇట్లాంటి చిల్లరలొల్లులే ఎప్పుడూ పాలెస్ లో… అవి బీబీసీ రాయదు… మేం తోపులమని మందికి నీతులు చెబుతుంది…

20 ఏళ్లనాటి గుజరాత్ అల్లర్ల మీద ఎగేసుకుని డాక్యుమెంటరీ తీశారుగా, ఏదీ మేఘన్ ఎదుర్కొన్న వర్ణవివక్షను ఎత్తిచూపుతూ ప్రసారాలు చేస్తదా… చేయదు.. చేస్తే అది ఉండదు…

మళ్లా ప్రపంచానికి నాగరికత నేర్పిందే మేం అంటూ సొల్లు ఆ బ్రిటన్ …

#BanBBCinIndia 

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions