Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో మైసూర్ పాక్… నో కరాచీ బేకరీ… పతంజలి ముల్తానీ మిట్టీ వోకేనా..?!

May 25, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… #పహల్గాం_ఫైల్స్ … జూలియస్ సీజర్ అనే నాటకాన్ని William Shakespeare వ్రాసారు . చాలామంది చదివే ఉంటారు . లేదా సినిమాను చూసి ఉంటారు .

విషయం ఏందంటే : కొంతమంది సెనేటర్లు సీజర్ని చంపుతారు . రోమ్ ప్రజలు కుట్రదారుల మీద తిరగపడతారు . మూక మనస్తత్వంతో కుట్రదారులని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంటారు .

Ads

అప్పుడు రోమ్‌లో సిన్నా అనే పేరుతో ఇద్దరు ఉంటారు . ఒకరు కవి , మరొకరు కుట్రదారుడు . కుట్రదారుడు సిన్నా కోసం వెతుకుతూ ఉంటారు . మూకలో ఒకడు అడుగో సిన్నా అని అరుస్తాడు . అతన్ని చంపటానికి జనం పరుగెడతారు .

అతను నేను సిన్నా అనే కుట్రదారుడిని కాదు , సిన్నా అనే కవిని అని గగ్గోలు పెడతాడు . జనంలో నుంచి ఒకడు ఇవన్నీ మాకు తెలియవు , సిన్నా అనే పేరుంది కదా ! అది చాలు అని లేపేస్తారు .

mysore pak

పహల్గాం దుర్ఘటన జరిగాక కొందరు హైదరాబాదులో కరాచీ బేకరీ మీద చేసిన దాడి ఇలాంటిదే . జనం ఎంతగా భయపడి పోయారంటే ఎవరికి వారు పాక్ లేదా పాకిస్థానుకు సంబంధించిన ఏ పేరయినా తమకు తామే మార్చేసుకుంటున్నారు . ఈ మైసూరు పాక్ స్టోరీ కూడా ఇదే . వాస్తవానికి అది పాకం . పాకం కాస్త పాక్ అయిపోయింది .

మనమందరం దశాబ్దాలుగా మైసూరు పాక్ అనే అంటున్నాం . ఇంతటి అనాలోచిత మనుషులు ఉద్భవిస్తారని ఎవరికి తెలుసు !? ఫాఫం మైసూరు మహారాజా ప్యాలెసులో గతంలో పనిచేసిన ఓ మాస్టర్ చెఫ్ దీన్ని కనిపెట్టాడట… తన మునిమనమడు ఆ ఒరిజినల్ పేరు మార్చకండిరా బాబూ, పాక్ కాదు, అది పాకం అని నిన్న పత్రికల్లో మొత్తుకున్నాడు… వినేవాడెవ్వడు..?

multani

సంతోషం ఏమిటంటే… పతంజలి రాందేవ్ బాబా ముల్తాని మిట్టి అనే సోపులు , క్రీములు అమ్ముకుంటూ ఉంటాడు . ఈ అతివాదులు ఎవరూ ఆయన మీద పడలేదు . అంతవరకు ఆనందం … (ఇది స్వీటు కూడా కాదు, మట్టి…)

సాధారణ ప్రజలకు ధైర్యాన్ని కలిగించవలసిన ప్రభుత్వాలు మౌనంగా ఉండటం బాధాకరం . కనీసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కూడా చెప్పకపోవటం ఇంకా ఆక్షేపణీయం . మూకస్వామ్యం , జనాన్ని మందస్వామ్యం వైపు తోసేస్తున్నారు … ఈ స్వీటు వెనుక చేదు కూడా ఇదే… అవునూ, పాక్ అని ఎండయ్యే అనేకానేక పదాలున్నాయి, మరి వాటినేం చేద్దాం..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?
  • ఉల్టా పేలిన హరీష్ తుపాకీ..! ఇరికించే ప్లాన్ చేసి దొరికిపోయాడు..!!
  • ప్రతివారం రెండురోజులు లాక్‌డౌన్… పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం…
  • మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions