కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్రైవేటుగా ఉరి తీస్తుందనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ… ఇన్నాళ్లూ తెలంగాణ ఇదేదో తనకు అక్కరలేని యవ్వారం అనుకుని కిమ్మనలేదు… కానీ ఎప్పుడైతే కేసీయార్ రంగంలోకి దిగి, నేను ఈ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ గండం నుంచి రక్షించి, ఏపీ ప్రయోజనాలను కూడా ఉద్దరిస్తామని ముందుకొచ్చాడో అప్పుడిక తెలంగాణలోనూ స్టీల్ ప్లాంట్ చర్చనీయాంశమైంది…
అసలు స్టీల్ ప్లాంటు పిలిచిన ఈవోఐ బిడ్లు కొనుగోలు- అమ్మకాల కోసం కానేకాదు… బొగ్గు సరఫరా చేయండి, బదులుగా స్టీల్ ఇస్తాం తీసుకొండి అనే రఫ్ ఆఫర్… ఇప్పుడున్న రూల్స్‌ను బట్టి తెలంగాణ సర్కారు గానీ, సింగరేణి గానీ ఆ బిడ్లు కూడా వేయలేవు… అదంతా వేరే కథ… కానీ కేసీయార్ అన్నీ తెలిసి గడుసుగా ఒక్క దెబ్బకు నాలుగైదు పిట్టలు అనే తరహాలో ఈ ఎత్తుగడకు పూనుకున్నాడు…
కాకపోతే అది జగన్‌పై ‘చేతకానివాడు’ అనే ముద్ర వేస్తోంది… ఇక్కడి సీఎంకు చేతకాలేదు, పొరుగు రాష్ట్ర సీఎం కాపాడతానని అంటున్నాడు అనే డిబేట్‌కు దారితీసింది… తన కేసుల కోసం బీజేపీ ఎదుట సాగిలపడుతున్న జగన్ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నాడు అనే విమర్శ స్టార్టయింది… ఈ స్థితిలో జగన్ గానీ, ఆయన క్యాంపు గానీ కేసీయార్ వైఖరిని ప్రశ్నించాలి… కేసీయార్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలి… ప్రజల్లో తన ప్రతిష్ట పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి…
Ads
కానీ జరుగుతున్నది ఏమిటి..? ప్రతి దానికీ చంద్రబాబు మీద పొలిటికల్ అటాక్ చేయడమే పరిష్కారంగా భావిస్తున్న జగన్ క్యాంపు… చివరకు తమ పరువు పోతున్నా సరే… కేసీయార్‌ను ఒక్క ముక్క కూడా అనకుండా చంద్రబాబును ఆడిపోసుకుంటోంది… సాక్షి మొదటి పేజీ బ్యానర్ స్టోరీ ఇదే… ఫాఫం, దాని కంటిన్యుయేషన్ తీసుకుపోయి ఎడిట్ పేజీలో పరిచేశారు… (చివరకు సాక్షి ఎడిట్ పేజీ ఈ కొరవ వ్యాసాలు నింపే స్పేస్ అయిపోయింది…) కిలోమీటర్ల కొద్దీ ఉన్న ఈ వ్యాసంలో లేదా కథనంలో కేసీయార్ పేరు పొరపాటున కూడా ప్రస్తావించలేదు…
చంద్రబాబు ప్రబల ప్రత్యర్థి, రాజకీయంగా తిడతాను అంటే వోకే… ఏపీ పాలిటిక్సులో అన్నీ అలాగే ఉంటాయి… చంద్రబాబు క్యాంపు కూడా సేమ్… కానీ ఇక్కడ జగన్ పరువు పోతోంది కేసీయార్ తీసుకున్న నిర్ణయం కారణంగా… ఐనా సరే, తనను ఏమీ అనకుండా, ఇందులోనూ చంద్రబాబునే తిట్టేస్తానంటే ఎలా..?
ఎప్పుడో జరిగిన వెన్నుపోటు బాగోతాన్ని మళ్లీ గుర్తు చేస్తూ… ఎన్టీయార్ సొంత ఊరు నిమ్మకూరు మౌనంగా ప్రశ్నిస్తోంది అని మరో ఎడిటోరియల్… (సాక్షి ఎడిట్ పేజీ అంటే అంతే… ఇష్టారాజ్యంగా వాడేస్తుంది…) ఇన్నేళ్ల తరువాత కూడా ఇంకా ఇంకా అదే ప్రశ్నించడం దేనికి..? చంద్రబాబు సొంత పార్టీయే సంపూర్ణంగా అంగీకరించి, ఆమోదముద్ర వేసింది కదా… ఐనా ఈ కథనం ఇప్పుడు సబబే అనుకుంటే, ఓ మంచి కార్టూన్ లేదా బొమ్మ గీయించి, విడిగా పబ్లిష్ చేయవచ్చు కదా… రిపోర్టర్ల కథనాల్ని కూడా ఎడిటోరియల్స్ ప్లేసులో పబ్లిష్ చేయడం ఏమిటి..? ఫాఫం, విశ్వనాథ్ వంటి సమర్థుడైన రిపోర్టర్ శ్రమను కూడా ఇలా వృథా చేయడం దేనికి..? అవునూ, కేసీయార్ జోలికి వెళ్లడానికి జగన్‌కు ఎందుకంత భయం..?!
Share this Article