Prasen Bellamkonda…… రెండు వీర సినీమాలు ముంచుకొస్తున్న వేళ ఓ మెమరీ… సినిమా బాగోలేదని రాయకూడదట, ఒకవేళ అలా రాసినా సినిమా రిలీజ్ అయిన వారానికో మూడు వారాలకో రాయాలట. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు ఆధార పడి ఉంటాయి కనుక సినిమా బాగాలేదని అనొద్దట. నిర్మాత కోట్లు పెడతాడు కనుక అతనికి నష్టం జరిగే పని చేయొద్దట.
రిడిక్యులస్. నిర్మాత కోట్ల రూపాయలకంటే నాకు నా 170 రూపాయలే ఎక్కువ. నీ సినిమా హిట్టయితే నీకు వంద కోట్లు వస్తాయి. నా సంతోషం ఫట్టయితే నాకు జరిగే నష్టం విలువను ఎవరు పూడ్చాలి. నా 170 రూపాయలే నాకు వందన్నర కోట్లు. గుండు బాస్ చెప్పింది తప్పై నీకు వంద కోట్లు ఊరికే వస్తాయేమో. నాకు మాత్రం గుండు బాసే రైట్. నా 170 రూపాయలు నాకు ఊరికే రావు. నా డబ్బులకు పైసా వసూల్ అయిందా లేదా అనేదే నా లెక్క.
సినీరంగంలోని కుటుంబాల క్షేమం చూసుకోవాల్సింది సినీరంగ పెద్దలే. ఆ భాద్యత నిర్మాతలు, దర్శకులదే. నిజంగా అంత బాధ్యతాపరులైతే మంచి సినిమాలు, డబ్బులొచ్చే సినిమాలు మాత్రమే తీయాలి. తమిళ మలయాళ సినిమాలు చూడండి. చిన్న సినిమాలు ఎంత గొప్పగా ఉంటాయో.
Ads
కొందరైతే మరీ అతి. నువ్వు సినిమా తీసి చూపించు అని గొప్ప ఎదురు దాడి. వాళ్లకు నేను చెప్పేదొక్కటే. ‘సినిమా తీయడం నా పని కాదు. నా కొచ్చిన రిటర్న్స్ ఏమిటి అనేదే నా లెక్క. కానప్పుడు నిన్ను మరమ్మత్తు చేయడమే నాపని ‘. చెత్త పోగు చేసి జనం మీదకు వదిలి కుటుంబాల కోసం, నిర్మాతల కోసం భరించాలని దేబిరిస్తే ఎలా. ఒకవైపు రివ్యూలను ఎవరూ పట్టించుకోవట్లేదంటూనే వాటి వల్ల నష్టం జరుగుతోందంటున్నారు. ఎలా? చెత్తయితే చెత్త అనాల్సిందే…
Share this Article