Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవడో తప్పుడు వార్త ఇస్తే… అందరూ కళ్లకద్దుకుని అచ్చేయడమేనా..?!

January 29, 2022 by M S R

తమ చుట్టాలకు చెందిన కోవాగ్జిన్ టీకాలను దృష్టిలో పెట్టుకుని… ఈమధ్య ఈనాడు కరోనా వార్తలపై అదుపు తప్పిపోయింది… భయాన్ని పెంచే పనిలో పడింది… ఎంత భయం పెరిగితే అంతగా వేక్సిన్ల అమ్మకాలు… వాళ్ల బూస్టర్ డోసులకు, చుక్కల టీకాలకు గిరాకీ… తరువాత  ఈ డోసులకు గిరాకీ తగ్గకుండా చూడాలనే ఓ పిచ్చి తాపత్రయం… సో, నిన్నటి నుంచీ ప్రచారంలోకి వచ్చిన ఓ పిచ్చి వార్తను ఫస్ట్ పేజీలో బొంబాట్ చేయడం గ్యారంటీ అనుకున్నారు అందరూ… ప్రతి ముగ్గురిలో ఒకడు చచ్చిపోవాల్సిందే అనే ఓ తలతిక్క హెడ్డింగుతో నిన్న సోషల్ మీడియాలో ఈ వార్త జనాన్ని పిచ్చోళ్లను చేసిన సంగతి తెలిసిందే కదా…

పాత్రికేయంలో అత్యంత దరిద్రమైన లీడ్ అది… పర్వర్షన్… అసలు ఆ వైరస్ జంతువుల మధ్య మాత్రమే వ్యాపిస్తుంది… కొత్త వైరసే కాదు… మనుషులకు సోకడం లేదు… అందులో మ్యుటేషన్లు గనుక వస్తే మనుషులకు ప్రమాదం, అప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకడు చచ్చిపోతాడు… ఇదీ వార్త… ఈ రిపోర్ట్ విడుదల చేసిన చైనా వుహాన్ శాస్త్రవేత్తలకు బుర్రల్లేవు… అసలు కరోనాను పుట్టించిందే వాళ్లు కదా… ఎక్కడో దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో కనిపించింది ఈ కొత్త వైరస్ అంటూ మళ్లీ ప్రపంచాన్ని భయంలోకి నెట్టేయడం తప్ప ఈ వార్తలో నిజం లేదు, అదసలు వార్తే కాదు… దీనిపై ‘ముచ్చట’ రాసుకొచ్చిన నిజాల కథనం ఇదీ…

ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందేనా..? జాగ్రత్తగా చదవండి ఓసారి…!!

Ads

మన మెయిన్ స్ట్రీమ్ మీడియా సంగతి తెలుసు కదా… ఇంకేం, ఒక్కొక్కరూ రెచ్చిపోయి రాసేస్తారు అని ఊహిస్తున్నదే… కొన్ని పత్రికల డెస్కులకు అసలు వార్తే సరిగ్గా అర్థం కాలేదు, అడ్డదిడ్డంగా రాసిపారేశారు… టీవీల సంగతి వదిలేయండి… రేపటికల్లా సగం జనాభా ఖతం అనే పిచ్చి వార్త సర్క్యులేట్ అయినా సరే, వీళ్లు కళ్లకద్దుకుని ప్రసారం చేసేస్తారు… ఆంధ్రజ్యోతి వాడయితే మాస్ట్ హెడ్ పక్కనే ఈ వార్తను కుమ్మేశాడు… ప్రపంచానికి మరో కొత్త ముప్పు అంటాడు… వేలాడే గబ్బిలాల ఫోటో ఒకటి పబ్లిష్ చేశాడు… నిజమే, మనం కూడా విదేశీ ఏజెన్సీల వార్తల్ని పట్టుకుని గుడ్డిగా వేలాడే గబ్బిలాలమే… సాక్షి, నమస్తేలను వదిలేద్దాం, ఈమధ్య ఏం రాస్తున్నారో వాళ్లకే సమజైతలేదు… సో, రీడర్స్ రీచ్ ఎక్కువగా ఉన్న ఈనాడు పరిస్థితేమిటి..?

neocov

తను కూడా భయానకంగా, బీభత్సంగా, భీకరంగా రెచ్చిపోయాడా..? లేదు… చాలా సంయమనం పాటించారు… పాఠకుడికి అర్థమయ్యేలా రాశారు… నిజాలకు పాతరేయలేదు… వక్రబాష్యాలేమీ చెప్పలేదు… ఫెయిర్‌గా ఉంది… అరె, ఈనాడుకు అంత ప్రొఫెషనలిజమా అని విస్తుపోకండి… ఈ వార్తల్లో ప్రధానాంశం ఏమిటంటే… ఈ వైరస్ గనుక పుట్టుకొస్తే, విస్తరిస్తే ఇప్పుడున్న వేక్సిన్లు ఏవీ పనిచేయవు అనే వాక్యాలూ ఉన్నాయి… సో, మన వేక్సిన్లు ఎలాగూ పనిచేయవు అంటున్నారు కదా… అందుకని దీన్ని బీభత్సంగా పరిచేస్తే మనకొచ్చే లాభం ఏమీ లేదు కదా… అందుకని ఈ సంయమనం… పనిలోపనిగా ఆ ఊహల్లో పుట్టుకొచ్చిన ముప్పు, పనిచేయని వేక్సిన్లు అనే వాక్యాలను మాత్రం అవాయిడ్ చేశారు… సింపుల్… ఎవడి బాధ వాడిది…!

కానీ, ఈ వార్తను రాయాల్సిన తీరు ఇదే… మరీ నిక్కచ్చిగా చెప్పాలంటే వార్తను క్యారీ చేయాల్సిన పనేలేదు… కాకపోతే మిగతావాళ్లు రాస్తారు కదా అనే కోణంలో ఈ దరిద్రాన్ని మోయాల్సి వచ్చింది..!! ఎవడో రాసిన ఏదో పిచ్చి వార్తను రాసుకోవడమా..? లేక తప్పుడు ప్రచారాన్ని కౌంటర్ చేస్తూ నిజమేమిటో చెప్పడమా..? ఈనాడు వంటి పెద్ద పత్రిక కర్తవ్యం ఏమిటి..? ఎస్… ఈనాడే ఓసారి ఆత్మశోధన చేసుకోవాలి..! బ్యాడ్ లక్ ఏమిటంటే… అదే ఇప్పుడు ఈనాడులో లోపించింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions