Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ కేసీయార్ హిస్టరీని రిపీట్ చేయడం రేవంత్‌కు ఎందుకు తప్పనిసరి..!!

March 20, 2024 by M S R

2014… కేసీయార్‌కు అత్తెసరు మెజారిటీయే… తెలుగుదేశం, కాంగ్రెస్ ఏవో కుట్రలు పన్ని, తెలంగాణ ఏర్పాటుకు ఓ విఫల ప్రయోగంగా చేస్తాయనే భయం కూడా ఉండింది… కేసీయార్ గేట్లు ఎత్తాడు… నిలబెట్టి ఒక్కొక్కరికి ఏం కావాలో అడిగి మరీ అప్పటి టీఆర్‌ఎస్‌లోకి లాగేసిండు… ఒక్క కాంగ్రెసో, ఒక్క తెలుగుదేశమో కాదు… టీడీపీ 12, కాంగ్రెస్ 5, వైసీపీ 3, సీపీఐ ఒకటి, బీఎస్పీ ఇద్దరు… గేట్లు దాటి జంప్…

ఎందుకు..? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం… ఎలాగూ ప్రజెంట్ రాజకీయాల్లో డబ్బు, ప్రలోభాలు తప్ప నైతికత, నిజాయితీ మన్నూమశానం ఏమీ లేవు కదా… ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరించింది టీఆర్ఎస్… వెరసి కేసీయార్ అధికారం అలా ఏ ఒడిదొడుకులు లేకుండా కొనసాగింది… అంతేనా..? వోటుకునోటు కేసుతో టీడీపీ తెలంగాణ నుంచే పారిపోయింది… ఖేల్ ఖతం…

2018… ఈసారి కాంగ్రెస్ ప్రధాన టార్గెట్… ఏకంగా 12 మందిని లాగేసి, మూడింట రెండొంతులను చీల్చేశాడు… అంతేనా..? మరో ఇద్దరు ఇండిపెండెంట్లు, టీడీపీ నుంచి ఇద్దరిని కూడా… సరిపడా మెజారిటీ ఉండి, సొంత పార్టీలో ఎదురు మాట్లాడేవాడు ఎవరూ లేని స్థితిలో… కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి ఏ కుట్రకూ తావు లేని పరిస్థితిలో కూడా కేసీయార్ ప్రతిపక్షాలకు చీల్చి పారేశాడు… ఎందుకు..? తెలంగాణ అంటే తను తప్ప మరో పార్టీ, ప్రశ్నించే గొంతు ఉండకూడదు… అంతే…

Ads

సో, ఇప్పుడు కాంగ్రెస్ గనుక బీఆర్ఎస్‌ను నిలువునా, కాదు, కాదు, 39 మందిలో 26 మందిని గనుక లాగేయగలిగితే..? ఎస్, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు… అసలే కవిత అరెస్టు, కాళేశ్వరం వంటి బోలెడు అవినీతి కేసులు, పార్టీ నుంచి వరుస కట్టిన నేతలు, మనుగడపైనే సందేహాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌ను కంప్లీటుగా తొక్కాలనే ఆలోచనకు వచ్చింది కాంగ్రెస్… 26 మంది చేరితే చాలు… ఆ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనీ అంటున్నారు…

సరే, ఇది అనుకున్నట్టు వర్కవుట్ అవుతుందా లేదానేది పక్కన పెడితే… కాంగ్రెస్, ప్రత్యేకించి రేవంత్‌కు ఇది తప్పనిసరి ఎందుకైంది..? ఈమధ్య బీజేపీ లక్ష్మణ్ తదితరులు ఈ ఎంపీ ఎన్నికల తరువాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని పదే పదే అంటున్నాడు… బీఆర్ఎస్, బీజేపీ బయటికే ప్రత్యర్థులు గానీ లోలోపల ఒకటే… సో, బీజేపీ బీఆర్ఎస్ సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తుందనే అనుమానాల్ని బీజేపీ వాళ్లే బలపరుస్తున్నారు…

నిజానికి చేసేవాడు చెప్పొద్దు… రాజకీయాల్లో గోప్యత ప్రధానం… నిజంగా బీజేపీకి ఆ ఆలోచన ఉన్నా సరే, బయటికి ఆ కూతలు వినిపించకూడదు… పైగా బీజేపీకి ఈ ట్రాక్ రికార్డు ఘనంగా ఉంది కదా… సో, కాంగ్రెస్ ఇలా అలర్టయిపోయింది… అసలే సీనియర్ల నుంచి నిత్యం ముప్పు ఎదుర్కునే రేవంత్‌కు వచ్చే ఎంపీ సీట్లను ఎక్కువగా గెలుచుకోవాల్సిందే… లేకపోతే తన కుర్చీ కిందకు నీళ్లు తీసుకువస్తారు సీనియర్లు… ఎంపీ ఎన్నికలనేసరికి మోడీ ప్రభావం కూడా పనిచేసే చాన్సుంది…

సో, తన ప్రభుత్వ సుస్థిరతకు ప్లస్ లోకసభ ఎన్నికల్లో బెటర్ ఫలితాల కోసం రేవంత్‌ ఏదో ఒకటి చేయాల్సిందే… అదే చేస్తున్నాడు… మరి కేసీయార్ నేర్పిన విద్యయే కదా… అయ్యో, అయ్యో నా ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయిస్తున్నారు, ఏమిటీ అనైతికత వంటి నీతిసూత్రాలు వల్లించడమూ కేసీయార్‌కు చెల్లదు..!!

తెలంగాణ బరి నుంచి వైసీపీ ఎప్పుడో సెల్ఫ్ ఔట్… టీడీపీ, జనసేన కూడా అన్నీ మూసుకుని చాన్నాళ్లయింది… ఉండీలేనట్టుగా కనిపించిన షర్మిల పార్టీ ఆ కాంగ్రెస్‌లోనే నిమజ్జనం… ఆర్ఎస్పీ నిష్క్రమణతో బీఎస్పీ దాదాపు సైలెంట్… ఏపీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ దాదాపుగా లేనట్టే… తెలంగాణలో మాత్రం అవే ప్రధాన పార్టీలు… ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యర్థులు… ఏమాత్రం సందు దొరికినా ఆ రెండే కలిసి కొంప ముంచుతాయి… రెండు పార్టీలకు కావల్సినంత సాధనసంపత్తి, ఆర్థిక బలం కూడా ఉన్నాయి… అందుకే రేవంత్ త్వరపడాల్సిందే..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions