Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!

December 30, 2025 by M S R

.

మిట్టల్… బ్రిటన్‌లో రాబోయే కొత్త పన్నుల విధానం విని, ట్యాక్స్ హెవెన్‌గా పిలిచే దుబయ్ లేదా స్విట్జర్లాండ్‌లో సెటిల్ కాబోతున్నాడు… మితిమీరిన పన్నుల అధికారుల వేధింపులకు కారణమవుతాయి… అవినీతికి, అశాంతికీ దారితీస్తాయి…

సీన్ కట్ చేయండి… ఇండియా నుంచి చాలామంది ధనికులు వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు… బ్యూరోక్రసీ, రాజకీయ క్షుద్ర ప్రభావాాల నుంచి తప్పించుకుని… ఇక్కడి సిస్టమ్ భరించలేక… ఆధునిక, నాగరిక దేశాలకు వెళ్తున్నారు… తమ భారతీయ పౌరసత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నారు… ఇది రియాలిటీ…

Ads

నిన్న బెంగుళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ ‘ఇండియా వదిలేసి వెళ్తున్నాను’ అని చెప్పాడు… కారణాలేమిటో తెలుసా..? ‘18 నెలల్లో 4 కోట్ల పన్ను నిజాయితీగా కట్టాను, అత్యంత లోపభూయిష్ట వ్యాపార పన్ను వ్యవస్థ ఇక్కడ… అధికారుల వేధింపులను తట్టుకోలేను ఇక’ అంటున్నాడు…

నీతిగా, నిజాయితీగా పూర్తిమొత్తంలో పన్నులు చెల్లిస్తున్నా వారిని నిత్యం ఎందుకు అనుమానంగా చూస్తు న్నారని ఆయన ప్రశ్నించాడు… దేశంలో 5 శాతం మంది మాత్రమే ప్రత్యక్ష ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని, అయినప్పటికీ వారు పదేపదే పరిశీలన, నిఘాను ఎదుర్కొంటున్నారని రోహిత్ ప్రాప్ ఆరోపించాడు…

జీఎస్టీ, ఆదాయపు పన్ను అధికారుల నుంచి పదే పదే నోటీసులు, నిఘాలు… వీటికి సమాధానాలతో టైమ్, మనీ వేస్టవుతున్నాయి… ’’ ఇదీ తన ఆవేదన… చాలామంది వేదన ఇదే… 14 ఏండ్లలో 20 లక్షల మంది ఇండియాకు గుడ్ బై చెప్పారు… 135 దేశాలకు వలసపోయారు… ప్రధాన కారణం మన బ్యూరోక్రసీ, అసమర్థ విధానాలు, అశాంతి…

నాకు నా దేశమంటే, ఈ దేశమట్టి మీద అభిమానం, ప్రేమ బాగా ఉండేది… ఇప్పటికీ ఉంది కూడా! దేశ మాతృత్వభావం నా మనసు పొరల్లో ఎప్పడు స్పృశిస్తూ ఉంటుంది…. కానీ 2021 -23 లో నేను ప్రభుత్వ ప్రాజెక్టులపై స్టార్టప్ పెట్టినప్పుడు… వాటి జిఎస్టీలపై, వాటి ఖాతాలపై నన్ను గత 3 సంవత్సరాల నుండి ఇంకా వేధిస్తున్నారు…

జస్ట్ 26 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ పై ఇప్పటికీ 10 సార్లు నోటీసులు ఇచ్చారు… దానిపై నేను అంబుడ్స్మెన్ కు అప్పీల్ కు వెళ్ళాను.. ఆపై కోర్టుకు వెళ్ళాను… అయినప్పటికీ 26 లక్షల్లో సుమారు 20 శాతం అడ్వాన్స్ పేమెంట్ కట్టాకే నా వాదన విన్నారు కానీ ఈ దేశ పౌరుడిగా నాపై కనీస కనికరం చూపలేదు…

ఆదాయపు పన్ను శాఖ, ఇతర ఆర్ధిక విభాగాల వేధింపులు భారత జెన్‌జి జనరేషన్‌పై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. టాలెంట్ ఉండి కష్టపడటమే తప్పన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక పన్నుల విధానాలతో భారత యువత తమలో సృజనాత్మక ఆలోచనలు రావటానికి కూడా భయపడతారు.

ఎందుకంటే ఆ సృజనాత్మక ఆలోచనలు అమలు కావాలంటే కంపెనీలు పెట్టాలి, కంపెనీ పెట్టాలంటే పెట్టే పెట్టుబడికి, వచ్చే రాబడికి రూపాయికి రెండు రూపాయలు పన్నులు కట్టడం భారత ప్రజల ఆలోచనాధోరణికి విరుద్ధమైనది, విభిన్నమైనది…

ఇక సగటు ఉద్యోగి… ఒక కంపెనీలో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు… ఆ జీతంలో ప్రభుత్వమే పన్నుల రూపంలో దాదాపు 20 శాతం లాగేస్తున్నది. పోనీ అన్ని పన్నులు కట్టినందుకు వాడు ఇంటి నుండి బయటకు రాగానే ఏదైనా సమాజపరంగా సౌకర్యాన్ని అనుభవిస్తున్నాడా అంటే లేదనే చెప్పాలి…

ఒక రోడ్డు సరిగ్గా ఉండదు, వాడి పిల్లలకు సరైన మౌలిక సదుపాయాలున్న బడి సరిగా ఉండదు, ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య ఎదురైతే సరైన వైద్యం అందదు… పైగా వాడు రోడ్డు మీదకి వస్తే రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, వాడి పిల్లాడికి ఆకలేసి పల్లి పొట్లం కొనాలన్నా జీఎస్టీ రూపంలో చాంతాడు పన్నులు… బయటి దేశాల్లో లేవా అంటే ఉన్నాయి ఈ పన్నులు. కానీ బయటి దేశాల్లో వాడు కట్టే పన్నులకు నాణ్యమైన బ్రతుకు దొరుకుతుంది. ఇక్కడ మన దేశంలో దొరుకుతుందా? లేదు 100% లేదు…

రోజు పొద్దున లేచి పేపర్ చూస్తే, దేశంలోని ఏ రాష్ట్రానికి పోయినా అవినీతి, అక్రమాలు, అప్పులు, ఆరోపణలు.. మనం కట్టే పన్ను రాజకీయ నేత జేబులోకో, ప్రభుత్వ ఉద్యోగి బీరువాలోకో నల్ల డబ్బుగా మారి మూలుగుతూ ఉంటుంది.

మొన్న ఎక్కడో పేపర్లో చదివాను… పాకిస్థాన్ నుండి మేధావులైన సబ్జెక్ట్ నిపుణులు… దేశం తరలి వెళ్లిపోతున్నారని. అగ్నికి ఆజ్యం తోడయినట్టు అక్కడ ఉగ్రవాదం, అరాచకవాదం ఇతర కారణాలు ఏమైనా ఉండనీ… పాకిస్థాన్ సృజనాత్మకత లేని స్మశానం కావటానికి ఎన్నో రోజులు పట్టదు!

migration from india




ప్రపంచంలో ఎంతెంత డబ్బుంటే ఎంతటి బ్రహ్మాండమైన పౌరసత్వాలు ఇచ్చే దేశాలున్నాయో ఒక వీడియో కనిపించింది… ఈ వీడియోకు లక్ష యాభై వేల లైకులు వచ్చాయి… వాట్సాప్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది… గ్లోబలైజేషన్ లో భాగంగా ఈ దేశ యువత ఆలోచనలు వేరే దేశాల మీదకు మళ్లటం మంచిదే…

30 ఏళ్ళ క్రితం మొదలైన గ్లోబలైజేషన్ ప్రభావం ఇప్పుడు పీక్ కు వచ్చింది. కేవలం భారత ప్రజలు మాత్రమే సెంటిమెంట్లపై ఆధారపడి ఉంటారు… ఆ సెంటిమెంట్ దారం ఒక్కసారి తెగిందంటే… దేశం అంటే ఒక దేశం అంతే… నాట్ మట్టిగడ్డ, మాతృభూమి…

మన ముందు తరాలు, మన తరం ఈ దేశంతో పెనవేసుకున్న బంధం… రానున్న తరాలు పెద్దగా ఈ దేశంతో అనుబంధాన్ని, పేగుబంధాన్ని పెట్టుకోలేరు… వాళ్ళు “safest, invest, purest (ఎన్విరాన్మెంటల్ పరంగా), happiest” ఈ పదాల ఆధారంగా వాళ్ళు దేశాన్ని ఎంచుకుంటారు…

ఆఫ్ట్రాల్ మిడిల్ క్లాస్ కు అబోవ్ క్లాస్ కు మధ్య ఊగిసలాడేటోల్లే వేరే దేశం ఎక్కడ బాగుంటుందని, చదువు ఎక్కడ బాగుంటుందని రీసెర్చ్ చేస్తున్నారు… అబోవ్ మిడిల్ క్లాస్ గాళ్లు, రిచ్ గాళ్లు మన కంటే ఎప్పడు పది మెట్లు ముందుగానే ఆలోచన చేస్తారు…

2034 వరకు భారత్ 10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. IMF మొదలుకొని World Bank వరకు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. అంటే 79 ఏళ్లలో సాధించిన wealth రాబోయే 9 ఏళ్లలో రెట్టింపు అవుతుంది, కానీ విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉంటాయి…

ప్రభుత్వాలు, సమాజం సరిగ్గా ఇప్పుడు ఆలోచించి, సరైన చర్యలు తీసుకోకపోతే… ఇప్పుడు 10 కోట్ల generational wealth ఉన్న కుటుంబాలు, సొంత తెలివితో నూతన ఆవిష్కరణలు చేసే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళైనా సరే లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు, ప్రాపర్ విలువలు, ప్రశాంతత, ప్రకృతితో కూడిన బతుకు బతుకుతారు.

రాబోయే 10 ఏళ్ళు చాలా కీలకం… సరైన అడుగులు పడకపోతే… ఒకవైపు మన నగరాల్లో ధారవి లాంటి స్లమ్స్, లేదా బాంద్రా లాంటి సూపర్ రిచ్ ఏరియాస్… అంతరం అలాగే… కాదు, ఇప్పటి స్థాయికి మించి ఉంటుంది…  దేశం ప్రస్తుత సవాళ్లకు దీటుగా ఏ రోజుకారోజు update అవ్వకపోతే దగ్గరలోనే ఏదో ఒకరోజు మనం outdate అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది…… [[ హరికాంత్ రెడ్డి   ]]

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!
  • SIR … వోట్ల ప్రక్షాళన తరువాత ఏమిటి..? ఇదీ ఓ క్లారిటీ..!
  • అసలు ఏమిటి ఈ ఉన్నావో కేసు..? ఎవరు ఆ నొటోరియస్ క్రిమినల్..?
  • వెండి, బంగారం…! ఎందుకీ పరుగు..? ఎక్కడి దాకా..? సేఫేనా..?
  • ‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
  • వీడొక డర్టీ ఫెలో… అగ్లీ కేరక్టర్… తగిన శాస్తి చేయండి… అర్హుడే..!!
  • ముక్కోటి ఏకాదశి అంటే ఒకటే తిథి కదా.., మరి పదిరోజుల దర్శనాలు..?!
  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
  • NCP ఏకీకరణ..? NDA వైపు శరద్ పవార్ అడుగులు..? ఇండి కూటమికి దెబ్బ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions