ఇది ఎప్పుడూ ఓ చిక్కు ప్రశ్నే… ఒక సినిమా రివ్యూ ఎలా ఉండాలి..? ఎందుకంటే..? కొన్నిసార్లు సినిమా ఏమాత్రం బాగాలేకపోవచ్చు, కానీ కమర్షియల్‌గా సూపర్ హిట్ కావచ్చు… అలాగే సినిమా బాగున్నా సరే కమర్షియల్‌గా క్లిక్ కాకపోవచ్చు… దానికి రకరకాల కారణాలుంటయ్… అయితే బేసిక్‌గా ఓ ఫిలిమ్ రివ్యూయర్ తన వ్యక్తిగత అభిరుచిని ప్రామాణికంగా తీసుకోవాలా..? మెజారిటీ ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవాలా..? ఏది ముఖ్యం..?
ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకొస్తున్నదంటే..? కేజీఎఫ్-2 సినిమా…!! మొదట పుష్ప… తరువాత ఆర్ఆర్ఆర్… ఇప్పుడు కేజీఎఫ్-2… బాలీవుడ్ అహంపై వరుస దెబ్బలు ఇవన్నీ… కేజీఎఫ్-2 వార్తల కవరేజీలో గానీ, సినిమా రివ్యూల్లో గానీ… బాలీవుడ్‌కు బలమైన మద్దతుగా నిలిచే నార్త్ ఇండియన్ ఫిలిమ్ జర్నలిజం వివక్ష ప్రదర్శిస్తోందా..? కొంచెం ఆ వాసన గుప్పుమని కొడుతోంది… సౌత్ ఇండియన్ సినిమా మీద ఒకింత అసహనం కనిపిస్తోంది…
స్థూలంగా చూస్తే తెలుగు జర్నలిస్టులు, రివ్యూయర్లు ఆర్ఆర్ఆర్, పుష్పతో సమానంగా కేజీఎఫ్‌కు ప్రయారిటీ ఇచ్చారు… నిష్పక్షపాతంగానే ఉన్నారు… పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాల్లోని పలు లాజిక్‌రాహిత్యాలను రాస్తూనే, స్థూలంగా కమర్షియల్ హిట్స్ అనే రాశారు, రేటింగ్స్ కూడా దాదాపు అలాగే ఇచ్చారు… ఇక్కడ మెజారిటీ ఆడియెన్స్ పల్స్‌కే పెద్దపీట వేయబడింది…
Ads
రిలీజ్ తరువాత కూడా హిందీ సినిమాలైతే బోలెడు ఫాలోఅప్ వార్తలు రాస్తుంటుంది నార్త్ ఇండియన్ మీడియా… కానీ కేజీఎఫ్-2 మీద అవేమీ లేవు… అఫ్ కోర్స్, ట్రిపుల్ ఆర్ మీద కూడా అంతే… పుష్ప కాస్త నయం… నార్త్ ఇండియన్ మీమర్లు, సోషల్ మీడియా, టీవీ చానెళ్లు బాగా ఓన్ చేసుకున్నాయి… స్పూఫ్స్ అదరగొట్టాయి… ప్రస్తుతం కేజీఎఫ్ వసూళ్లు, రికార్డుల సంగతి కాసేపు పక్కన పెడదాం… సినిమా నాణ్యతపై మన అభిప్రాయాలు కూడా పక్కన పెడదాం… ఒక్కసారి కేజీఎఫ్-2 మీద కొన్ని మీడియా సంస్థల రేటింగ్స్ చూద్దాం…
- ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన శుభ్ర గుప్తా జస్ట్, ఒకటిన్నర రేటింగ్ ఇచ్చింది… అసలు ఆ పూర్ రేటింగ్‌కు జస్టిఫికేషన్ కూడా సరిగ్గా లేదు…
- ఎన్డీటీవీకి చెందిన సైబల్ ఛటర్జీ ఇచ్చిన రేటింగ్ జస్ట్, రెండు…
- చాలామంది పరిగణనలోకి తీసుకునే రాటెన్ టమాటోస్ 44 శాతం రేటింగ్, పదికి అయిదు మార్కులేసింది…
- రెడిఫ్.కామ్‌కు చెందిన సుకన్య వర్మ రెండున్నర స్టార్లు ఇచ్చింది…
- స్క్రోల్.ఇన్‌కు చెందిన నందిని రామనాథ్ ఇచ్చిన రేటింగ్ రెండున్నర స్టార్లు…
అందరూ అని కాదు… కానీ చాలా మంది… ఇది కేవలం ఉదాహరణలు… తరన్ ఆదర్శ్ వంటి సినిమా విశ్లేషకులు ఆబ్జెక్టివ్‌గానే ఉన్నారు… ఫస్ట్‌పోస్ట్, టైమ్స్, డెక్కన్ హెరాల్డ్, ఇండియాటుడే వంటివి 3 నుంచి 4 మధ్యలో రేటింగ్స్ ఇచ్చాయి… అయితే ఒక సెక్షన్ నుంచి ఎందుకీ వివక్ష..? హిందీలో ఈ నిర్మాతలు సరిగ్గా ‘‘ప్రమోషన్ వర్క్’’ చేయకపోవడమా..? లేక బాలీవుడ్ మీద అతి ప్రేమా..? సినిమాల రేటింగ్ దందా మీద బోలెడన్ని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నవే… కానీ మరీ పనిగట్టుకుని నెగెటివిటీని స్ప్రెడ్ చేసేందుకు నార్త్ ఇండియన్ ఫిల్మ్ మీడియా లాబీలు ప్రయత్నించాయా..? సౌత్ ఇండియన్ సినిమా సర్కిళ్ల సందేహం అదే…! అదే…!! కానీ ఎవరాపగలరు..?!
ఇప్పట్లో సౌతిండియన్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హైరేంజ్ సినిమాలేవీ రిలీజ్‌కు లేవు… అంటే మరీ పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ స్థాయిలో…! ప్రభాస్ ఆదిపురుష్ రాబోతోంది కానీ నార్త్ ఇండియన్ లాబీ దాని మీద నెగెటివ్‌గా వెళ్లదు… అందులో ప్రభాస్ తప్ప మిగతా తారాగణం, టెక్నికల్ టీం ప్రధానంగా నార్త్ ఇండియన్ బాపతే… ఇక సలార్… దీనికే నార్త్ ఇండియన్ లాబీ వక్రదృష్టి బలంగా తగిలే ప్రమాదం కనిపిస్తోంది..!! (ఈ కథనానికి దిష్టి చుక్క ఏమిటంటే..? తమిళ, తెలుగు ఇండస్ట్రీలో భారీ అతిపెద్ద తలకాయలు కూడా కేజీఎఫ్-2 విజయం పట్ల కుతకుతలాడుతున్నారు… ఒక్కరూ సహృదయంతో అభినందించిన పాపాన పోలేదు…)
Share this Article