.
ఎస్వీబీసీ సలహాదారు, అరసవిల్లి దర్శన వివాదం, శ్రీకాకుళం గుళ్లో షూటింగు, టీడీపీ ప్రచారం పట్ల విముఖత, అదేదో పాటలో కంటెంటు వివాదం… మంగ్లీ వివాదాలు, తాజాగా కేసు, ఆమె వివరణ గట్రా కాసేపు పక్కన పెడదాం…
ఎందరు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు, అక్కడికక్కడ ఎలా నిర్ధారించారనే ప్రశ్నలూ వదిలేద్దాం కాసేపు… కానీ చెబుతున్న ప్రధాన నేరాలు (?) ఏమిటి..? అనుమతి లేకుండా మద్య సేవనం, విదేశీ మద్యం, డీజే అనుమతి… ఇవే కదా..,
Ads
ఇక్కడ అనేక ప్రశ్నలు.,. నిజంగానే సగటు మనిషికి అర్థం కానివి… విదేశీ మద్యం సేవించడం నేరం ఎలా అవుతుంది..? ఇప్పుడు అనేక మంది విదేశాలకు వెళ్లివస్తున్నారు… లక్షల మంది మనవాళ్లు విదేశాల్లో కొలువులు చేస్తూ వచ్చిపోతున్నారు, వాళ్లను చూడటానికి పేరెంట్స్ వెళ్తున్నారు, టూరిస్టులు వెళ్తున్నారు…
ఎంచక్కా విమానాశ్రయాల్లోనే కస్టమ్స్ ఫ్రీ ఫారిన్ లిక్కర్ దొరుకుతుంది… చౌకగా… తమ వినియోగం కోసమో, తెలిసినవాళ్లకు ఇవ్వడం కోసమో బాగానే కొనుక్కని తెస్తుంటారు… డొమెస్టిక్ ఫ్లయిట్లలో 2 లేదా 3 బాటిల్స్‌కే పర్మిషన్ ఉన్నా సరే, తోటి ప్రయాణికులతో కొనిపించి, బ్యాగుల్లో పెట్టి తీసుకొస్తుంటారు..,. గ్లాస్ విత్ కేర్ ఏర్పాట్లతో… ఆ మద్యం అధికారికం కాదా..? దానికి కూడా ఇక్కడ ఎక్సయిజు డ్యూటీ, స్పెషల్ టాక్స్ గట్రా చెల్లించాలా..?
పోనీ, అక్రమంగా విదేశీ మద్యం వస్తోందా..? అలాంటప్పుడు ఆ రూట్లను బ్రేక్ చేయడం కదా ముఖ్యం..? జానీవాకర్, గ్లెన్ బాపతు మద్యం కూడా బోలెడు షాపుల్లో దొరుకుతూనే ఉంది కదా… గాంజా చాక్లెట్లు, సిగరెట్లు గట్రా విపరీతంగా దొరుకుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో… డ్రగ్స్ సరేసరి… ఆ మార్గాలు కదా పట్టుకుని, విచ్ఛిన్నం చేసి, పెడలర్ల నెట్‌వర్క్ కదా బ్రేక్ చేయాల్సింది…
సరే, హైదరాబాదు శివాార్లలోని రిసార్టుల్లో లిక్కర్ పార్టీలు బోలెడు, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి… ఎన్ని సీసాల వినియోగానికి సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి..? నాలుగు సీసాలు మించితే అనుమతి కావాలట… అబ్సర్డ్… పదీపన్నెండు మంది చిన్న పార్టీ చేసుకున్నా నాలుగైదు సీసాలు ఖర్చవుతాయి కదా…
అసలు అనుమతి అవసరమనే విషయమే సగటు మనిషికి తెలియదు… పైగా అదో పెద్ద ప్రక్రియ, దానికీ డబ్బులు… ఐనా రిసార్టు వాడు చెప్పాలి కదా… వాడు కదా నిందితుడు… పక్కా అన్ ప్రొఫెషనల్ రిసార్టులు…
ఐనా మద్యం మీద సర్కారీ కార్పొరేషన్ మార్జిన్, పన్నులు, ఎక్సయిజు గట్రా బాదుతూనే ఉంది కదా సర్కారు… మళ్లీ వినియోగం ఎక్కువ ఉండే పార్టీలు చేసుకుంటే ప్రత్యేక పర్మిషన్లు దేనికి..? జస్ట్, సతాయించడం, సంపాదించడం కోసమే కదా… నాలుగు బాటిళ్లకు ఎంత ఖర్చో, అనుమతికి 11 వేల ఖర్చే దుర్భారం…
డీజే పర్మిషన్..? సో వాట్..? ఎక్కడో ఊరవతల డీజే పెట్టుకుంటే ఎవరికేం నొప్పి..? చుట్టుపక్కల జనావాసాలు లేనిచోట్ల డీజేకు ఏం అభ్యంతరం..? ఎస్.., డ్రగ్స్, రేవ్ పార్టీ అయితే దాడులు చేయండి, కానీ చిన్నాచితకా లిక్కర్ పార్టీలపై దేనికి దాడులు..? డ్రగ్స్ కేసులే నిలవడం లేదు… అకున్ సబర్వాల్ బాపతు కేసు ఏమైంది..?
ఇక్కడ మంగ్లీ కేసు గురించి కాదు చర్చ… జనరల్‌గా తరచూ జరుగుతున్న దాడులు, కేసుల గురించే… ఏవో చాలామందికి అర్థం కానివి, తెలియనివి పర్మిషన్లు, రూల్స్, రిస్ట్రిక్షన్లతో గాకుండా… కొడితే, పెద్ద నేరగాళ్లు దొరికిపోవాలి… అసలు పెద్ద తిమింగలాలను కదా పట్టాల్సింది..!!
Share this Article