.
చంద్రబాబు మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏదో విషయంలో బాగా అసంతృప్తి ఉంది… అసహనం ఉంది… ఈరోజు రాతల్లో అదే కనిపిస్తోంది… ‘నువ్వు ఇలాగే ఉంటే గత ఐదేళ్లకాలంలో నీకు అండగా ఉన్న వ్యక్తులు నీతో ఉండబోరు’ అని హెచ్చరిస్తున్నాడు…
టీవీ5 నాయుడికి దక్కుతున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదనా..? ఇంకా ఏమైనా కోరుకున్నాడా..? రాజ్యసభ సభ్యత్వమా..? తెలియదు..! కానీ ఆ కోపం మాత్రం కనిపిస్తూనే ఉంది… కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు ఈరోజు కొత్త పలుకులో…
Ads
ఇంతకీ చంద్రబాబు ఏం చేయాలి..? అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు, రాజకీయ ఎజెండా లేదు, జగన్ రెడ్డిని చూసైనా నేర్చుకో, తెలుగుదేశాన్ని ఎలా కట్టడి చేశాడు, ఎన్ని కేసులు పెట్టాడు, ఎలా ఇరికించాడు, నీకు చేతకావడం లేదు, కనీసం కేసులు పకడ్బందీగా పెట్టడం కూడా నీవల్ల కావడం లేదు, ఇలాగే ఉంటే 2029లో లోకేష్ సంగతేమిటి అనడుగుతున్నాడు…
పైగా నీ ఎమ్మెల్యేలు జనకంటకులు అయిపోతున్నారు… ఎడాపెడా ఎయిర్ పోర్టులు నిర్మిస్తే వోట్లు పడతాయా..? ఆ ఎయిర్ పోర్టు పనులకు మేనేజర్లను కూడా ఎమ్మెల్యే అండతో కిడ్నాప్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి..? అసలు ప్రజాకంటకులుగా మారే ఎమ్మెల్యేలతో పార్టీలు భ్రష్టుపడుతున్నాయి అని చెబుతున్నాడు…
నిజమే, కేసీయార్ ఓటమికి కూడా కారణం తెలంగాణలోని తన సిట్టింగులే… వాళ్లకే టికెట్లు, వాళ్లకు సర్వాధికారాలు, ఏం చేసినా చూసీచూడనట్టు ధోరణి, ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు సామంతరాజులను చేశాడు… ఫలితం చూశాం కదా… జగన్ హయాంలో కూడా అంతే… రేపు చంద్రబాబుకు కూడా అంతే…
కేసులు పెట్టి, వేధించి తెలుగుదేశం నాయకుల్లో కసిని పెంచి, నిలబడి, తెగబడి పోరాడేలా చేసింది జగన్ రెడ్డే… ఇప్పుడు చంద్రబాబు అదే పని చేసినా రేప్పొద్దున వైసీపీ నేతలు కూడా అలాగే నిలదొక్కుకుని పోరాడతారు కదా… మరి ఓ పొలిటికల్ ఎజెండా వైసీపీని తొక్కవెందుకు అని రాధాకృష్ణ అడగడంతో జస్టిఫికేషన్ ఏముంది..?
ఓ మంత్రి హైదరాబాదులో అడ్డా వేసి, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, కాస్త చూసుకో అని రేవంత్ సర్కారు చంద్రబాబుకు సమాచారం ఇచ్చిందట… (చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే బుక్ చేయాలి, చంద్రబాబుతో అడిగించుకోవాలి గానీ ఇదేం ధోరణో అర్థం కాదు… చంద్రబాబు మనుషుల జోలికి వెళ్లాంటే భయమా..? భక్తా..? గౌరవమా..?)
లోకేష్ విషయానికి వస్తే… ఆర్కే దాచుకుంటున్నట్టున్నాడు గానీ… పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు, ఇతరత్రా లోకేషే సింహభాగం చూసుకుంటున్నాడు… చివరగా ఒక్క మాట… 2029 నాటికి చంద్రబాబు వయస్సుడిగి, పార్టీని లీడ్ చేయలేకపోవచ్చు ఆర్కే సందేహిస్తున్నట్టుగా… కానీ లోకేష్ నిలదొక్కుకోవాలంటే వైసీపీని తొక్కాలనే సూచన కరెక్టు కాదు… ఎందుకంటే..?
పవన్ కల్యాణ్ మొన్నటి ఫలితాలు తన సొంత బలం కాదు, అది జగన్ మీద ప్రబలమైన ప్రజా వ్యతిరేక వోటు… చంద్రబాబు గెలుపు కూడా తన పాజిటివ్ వోటేమీ కాదు… తను ఏదో ఉద్దరిస్తాడనీ కాదు, అలాగైతే 2019లో ఓడిపోయేవాడు కాదు కదా…
పాలకుల పాలన విధానాలపై పాజిటివ్ వోటుతో పార్టీలు గెలిచే రోజులు కావు… కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డిని గెలిపించారు జనం, అంతేతప్ప తనేదో గొప్పగా పాలిస్తాడని కాదు… సేమ్, జగన్ మీద కోపంతో చంద్రబాబు కూటమిని గెలిపించారు… అంతే… సో, లోకేష్ గురించి ఆర్కే బాధపడటంలో అర్థం లేదు… కొడుకు గురించి తండ్రి ఆలోచించుకుంటాడు కదా..!!
చివరగా… పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి అయిపోయి, నాగబాబు ఇక్కడ కూటమి సర్కారులో చేరి, బీజేపీ ఎంకరేజ్ చేసినా సరే అంత తేలికగా జనసేన రాష్ట్రవ్యాప్త బలం పుంజుకునే సీన్ ప్రస్తుతానికైతే లేదు… ఒకటి మాత్రం ఆర్కే చెప్పింది నిజం… చంద్రబాబును బీజేపీ హైకమాండ్ పూర్తిగా నమ్మే స్థితిలో లేదు అని..!!
Share this Article