తిరుపతి ఎస్సి రిజర్వుడు సీటు. రాష్ట్రంలో మాల-మాదిగలు నాకు రెండు కళ్ళలాంటివాళ్ళు అని జగన్ గారు బాహాటంగా చెప్పినా. వర్గీకరణపట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం. మాల-మాదిగ కార్పొరేషన్లుగా విభజించినా పెద్దగా ఫండ్స్ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో 68% మాదిగలు ఓట్లు వేసినా 53% ఓట్లేసిన మాలలకే పదవుల్లో అధికారాలలో పట్టంకట్టారు అనే ఫీలింగ్ మాదిగల్లో ఉంది. అవటానికి రెండుకళ్ళేగానీ ఒకటి మెల్లకన్ను అనే భావన ప్రచారంలోకి వచ్చింది. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ఇద్దరూ మాల సామాజిక వర్గమే. జనాభాపరంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మాల-మాదిగల నిష్పత్తి తేడా కేవలం 3%. ఆల్రెడీ వర్గీకరణ పట్ల సానుకూలత చూపించిన బీజేపీ (వెంకయ్యనాయుడు గారు) ఇప్పుడు మాదిగ సామాజికవర్గానికి చెందిన రత్నప్రభ గారిని అభ్యర్థిగా ఎంచుకోవడం వెనక ఈ కుల సమీకరణ లేదు అనుకుంటే అది మన అమాయకత్వం మాత్రమే. మందకృష్ణ మాదిగ,బ్రహ్మయ్య మాదిగ లాంటి మాదిగ నాయకులు త్వరలో తిరుపతి ఎన్నికలవైపు యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
ఆల్రెడీ జనసేన- తెలుగుదేశం లోపాయకారి ఒప్పందంలో ఉండటం. తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి గారి నిరాసక్తత నేపథ్యంలో. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని తిరుపతి,కాళహస్తి,గూడూరు, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలలోని బలమైన (దాదాపు 20 – 30%) బలిజ సామాజికవర్గం ఓట్లు రత్నప్రభ గారివైపు చీల్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ‘గెలుపుమాదే. మెజారిటీ ఎంత అనేదే లెక్కచూడాలి’ అని డిసైడ్ అయిన వైఎస్సార్సీపీ ధీమాని ఆ అమెజారిటీ తగ్గించి దెబ్బకొట్టాలి అనే ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో మొదలైపోయాయి. జగన్ టీం ఈ పరిణామాల్ని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి….. – కత్తి మహేష్
Share this Article
Ads