Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుష్పరాజ్ కేసులో రేవంత్ రెడ్డి ‘తగ్గేదేలా’ అని ఎందుకంటున్నాడు..?!

December 19, 2024 by M S R

.

పుష్పరాజ్‌కు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లనుందని వార్తలు… ఎందుకు..? అంత పట్టుదల దేనికి..? అదే పుష్పరాజ్ తరహాలో తగ్గేదేలే అని ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి..?

బోలెడు కారణాలు… అనేక ప్రచారాలు… కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్దాలు కావచ్చు…

Ads

1. పుష్ప2 సినిమాలో ఫహాద్ ఐపీఎస్ ఆఫీసర్, తనను పుష్పరాజ్ ఈతకొలనులో పడేసి ఉచ్చపోసి అవమానిస్తాడు… ఐపీఎస్ అధికారులు తమ సర్వీస్‌ను కించపరిచినట్టుగా మండిపోతున్నారు… ఎక్కడ దొరుకుతాడు అని చూశారు, సంధ్య తొక్కిసలాటలో మహిళ మరణంతో చాన్స్ దొరికింది…

2. సినిమా సక్సెస్ మీట్ వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడు అల్లు అర్జున్.. బహుశా ఇదీ కఠిన వైఖరికి ఓ కారణమేమో… పుష్ప టీమ్ కృతఘ్నత అని సర్కారు భావన…

3. అడగ్గానే మునుపెన్నడూ లేని రేట్లు ఇచ్చారు… ఎడాపెడా బెనిఫిట్ షోలు ఇచ్చారు… షోల సంఖ్య పెంపునకూ అనుమతించారు… ఐనా సరే, బన్నీకి, పుష్ప నిర్మాతలకు కనీస కృతజ్ఞత లేదనేది సర్కారు భావన…

4. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత… మరి అల్లు అర్జున్ మీద పాజిటివ్ ధోరణి ఎందుకనే విమర్శలు రావద్దని అటు మోహన్‌బాబునూ, కొడుకులనూ బుక్ చేశారు కేసుల్లో… ఇటు అల్లు అర్జున్‌ను కూడా తొక్కిసలాట కేసులో బుక్ చేశారు…

5. క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టం, వద్దూ, రావద్దూ అని చెప్పినా సరే, ధిక్కరించి అల్లు అర్జున్ వచ్చేసి, ర్యాలీ తరహాలో అందరికీ అభివాదం చేస్తూ పోవడంతోనే తొక్కిసలాట,… అత్యంత బాధ్యతారాహిత్యం… బిగ్‌బాస్‌ పల్లవి ప్రశాంత్‌కూ తనకూ తేడా లేదా..? అదీ పోలీసులకు మండుతోంది…

6. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రోజైనా జైలులో ఉండకూడదన్న పంతంతో లాయర్లు హైకోర్టు దాకా చకచకా వెళ్లారు… బెయిల్ వచ్చింది, ఐనాసరే, ఆరాత్రి జైలులోనే ఉంచింది ప్రభుత్వం… దీని మీద ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతామని లాయర్లు చెప్పారు… దాంతో మరింత మండుకొచ్చినట్టుంది ప్రభుత్వానికి…

7. మరోవైపు ఈ అరెస్టు విషయంలో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వెకిలి వ్యాఖ్యలకు దిగారు రేవంత్ రెడ్డి మీద… ఇది ప్రభుత్వాన్ని మరింత చిర్రెత్తించింది… బన్నీ సోషల్ వెటకారపు ఫ్యాన్స్ మీద కేసులు పెట్టి ఒక్కొక్కరినీ వేటాడుతున్నారు ఇప్పుడు…

8. హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ వద్దకు ఎవడూ వెళ్లడం లేదు కానీ బన్నీ ఇంటికి తనను బాధితుడిగా చిత్రీకరిస్తూ, రేవంత్ సర్కారును నిందిస్తున్నట్టుగా ఇండస్ట్రీ ప్రముఖులందరూ క్యూలు కట్టారు… అదీ ప్రభుత్వానికి నచ్చలేదు… ఇండస్ట్రీతో ఎంత బాగా ఉంటున్నా సరే, ఆ కృతజ్ఞత లేదు ఎవరికీ అనే భావన…

9. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ విమర్శలకు దిగాయి… జాతీయ స్థాయి నాయకులు కూడా రేవంత్ సర్కారు మీద విమర్శలు చేశాయి… ఈ లా అండ్ ఆర్డర్ కేసులో ఈ క్షుద్ర రాజకీయాల జోక్యం ఏమిటనేది రేవంత్ రెడ్డి ఆగ్రహానికి ఇంకో కారణం… పొలిటికల్ దాడి స్టార్టయితే పొలిటిషియన్ ఊరుకోడు కదా…

10. బెడ్‌రూం దాకా వెళ్లి అరెస్టు చేశారు, డ్రెస్ కూడా మార్చుకోనివ్వలేదు, ఓ జాతీయ అవార్డు విజేతకు అవమానం అనే ప్రకటనలూ మరో కారణం… జాతీయ అవార్డు విజేతలైతే చట్టాలకు అతీతులా..? చట్టం ఎదుట ఎవరైతేనేం అనే మరో పట్టుదల… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఓసారి కోర్టు బోనులో నిల్చున్నాడు…

…… చెబుతూ పోతే ఇలా ఎన్నో… ఖచ్చితంగా మేం అన్నింటికీ అతీతులం అని పదే పదే చాటడానికి బన్నీ టీం, ఫ్యామిలీ ప్రయత్నించడమే కేసు మరింత బిగుసుకోవడానికి ప్రధాన కారణం… వాళ్లకు అర్థం కానిది ఏమిటంటే..? మన వ్యవస్థలో రాజకీయాధికారమే అల్టిమేట్… నా ఫ్యాన్స్, నా టీం, నా డబ్బు, నా సంపాదన, నా ఫ్యామిలీ, నా పాపులారిటీ, నా ఇష్టం అనే ధోరణి ఎప్పుడూ చెల్లదు… అది రియాలిటీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions