.
రేపటి నుంచి ప్రారంభమయ్యే గ్లోబల్ సమిట్ ఎందుకు ఫ్యూచర్ సిటీలోనే జరుగుతోంది..? ఎందుకంటే, అదే హైదరాబాద్ ఫ్యూచర్ కాబట్టి…! అది అవసరం కాబట్టి, అది ఓ అవకాశం కాబట్టి…! ఖచ్చితంగా ఓ గ్రాండ్ సక్సెస్‌ఫుల్ కొత్త నగరం తప్పకుండా నిర్మితం అవుతుంది కాబట్టి..! కావాలి కాబట్టి..!!
ఎందుకంటే… మహానగరాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అనేకం మన దేశంలోనే వృద్ధి చెందాయి… అవే సక్సెస్ స్టోరీలు ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ఓ ప్రేరణ… దేశ రాజధాని ఢిల్లీ… తరువాత న్యూఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ఎలా పరిఢవిల్లుతున్నాయో చూస్తున్నాం… సేమ్, ముంబైకి నవీ ముంబై అలాగే… కోల్‌కత్తాకు అనుబంధంగా న్యూ టౌన్… బెంగుళూరుకు వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ… అహ్మదాబాద్‌కు గాంధీనగర్, చండీగఢ్‌కు మొహాలీ… ఇలా ఎన్నో ఉదాహరణలు…
Ads
హైదరాబాద్ ఆల్రెడీ సికింద్రాబాద్, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలుగా విస్తరించింది కదా, మరో కొత్త నగరం అవసరమా..? ఈ సందేహాలు చాలామందిలో ఉన్నాయి… (కొన్ని పొలిటికల్ సెక్షన్ల రొటీన్ కువిమర్శల్ని వదిలేద్దాం)… అవసరం ఉంది, అదీ పర్‌ఫెక్ట్ ప్లానింగుతో కావాలి… అదే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సంకల్పం…
- ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకోవాలంటే, వాటితో పోటీపడాలంటే ఓ అల్ట్రా మోడరన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ఓ గ్లోబల్ కాస్మోపాలిటన్ సిటీ కావాలి… అదే ఫ్యూచర్ సిటీ… సింపుల్‌గా రేవంత్ రెడ్డి స్వప్నం అది… అది ఎందుకు అవసరమో, అదెలా నిర్మాణసాధ్యమో చెప్పాలంటే మరిన్ని వివరాల్లోకి వెళ్దాం ఓసారి…
నగరీకరణ పెరుగుతోంది… నగరాలు విస్తరిస్తున్నాయి… ఉపాధి, విద్య, వైద్యం, వినోదం, పౌరసదుపాయాలు… అవి అవసరాలు… కానీ ప్రస్తుత నగరాలపై ఈ వలసల భారం పెరుగుతోంది… రద్దీ, ట్రాఫిక్, కాలుష్యం, ఇరుకుదనం, డ్రైనేజీ, పారిశుధ్యం, చెత్త సమస్యలే కాదు… తాగునీరు, విద్యుత్తు, రవాణా వంటి మౌలిక సదుపాయాల మీద కూడా భారీ ఒత్తిడి…
- సో, శివారు నగరాలు తప్పనిసరిగా కావాలి… అవీ రాబోయే రోజులకు సరిపడేలా… కొత్త సాంకేతికల్ని, ఆధునికతల్ని, ఉపాధి అవకాశాల్ని అందిపుచ్చుకునే విశ్వనగరాలుగా కావాలి… ఎస్, ఫ్యూచర్ సిటీ ఆ దిశలో సంకల్పించిందే…

అందుకే ఫ్యూచర్ సిటీ ఓ అవసరం… ఓ అవకాశం… ఓ స్వప్నం… దేశంలోని కొన్ని ఉదాహరణల్ని చూద్దాం… ముందుగా మన నగరాన్నే చూద్దాం… స్థూలంగా చూస్తే ఇది త్రినగరి… హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్… పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విస్తరింపచేయబడిన సైబరాబాద్ ఎంతటి ప్రఖ్యాతిని పొందిందో మన ఎదుట నిలిచిన ఓ ప్రసిద్ధ ఉదాహరణ…
- అంతేనా..? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలు అదనం… అవీ సరిపోవడం లేదు… మరెలా..? మరో శివారు నగరం కావాలి… అదే ఫ్యూచర్ సిటీ… రేవంత్ రెడ్డి కాన్సంట్రేట్ చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ…
సంకల్పం ఉండాలి, ప్రణాళిక ఉండాలి… అటువైపు అడుగులు పడాలి… అది సాకారం కావాలి… సో, ఫ్యూచర్ సిటీ లక్ష్యాలేమిటో ప్రపంచానికి పరిచయం చేయడానికే గ్లోబల్ సమిట్‌ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించడం..! శాటిలైట్ సిటీలు నగరీకరణ అవసరాలు…

ముంబై తీసుకుందాం… నవీ ముంబై (Navi Mumbai) ఎలా ఏర్పడింది?
-
ఉద్దేశం…: ముంబైలోని అధిక రద్దీని, ట్రాఫిక్‌ను తగ్గించడం, బల్క్ కెమికల్స్, చమురు, బొగ్గు వంటి కారకాల వల్ల ఏర్పడే పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించడం… మరో లివబుల్ శాటిలైట్ సిటీ కావాలి… దేశ వాణిజ్య రాజధానికి అదీ అవసరం…
-
అభివృద్ధి…: CIDCO (City and Industrial Development Corporation) అనే ప్రభుత్వ సంస్థ 1971లో దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసింది… ఇది కేవలం వసతి నగరం కాకుండా, స్వయం-పోషక ఆర్థిక కేంద్రంగా, సువిశాలమైన రోడ్లు, రైలు అనుసంధానం, పారిశ్రామిక జోన్‌లతో నిర్మించబడింది… గ్రాండ్ సక్సెస్…
గురుగ్రామ్ (Gurugram) ఎలా నిర్మించబడింది?
-
ప్రధాన నగరం…: ఢిల్లీ… ఇప్పుడు గురుగ్రామ్ లేని ఢిల్లీని ఊహించలేం… అలా డెవలపైంది…
-
అభివృద్ధి…: 1990ల నుండి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు (ముఖ్యంగా DLF వంటి సంస్థలు) ప్రభుత్వ సహకారంతో ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు.
-
విజయం…: ఢిల్లీకి దగ్గరగా ఉండటం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు… ఇది ఐటీ/ఐటీఈఎస్ (IT/ITES), ఫైనాన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారి, అతిపెద్ద కార్యాలయ స్థలం (Office Space) హబ్‌గా రూపాంతరం చెందింది… సూపర్ హిట్ సిటీ…
నోయిడా (NOIDA – New Okhla Industrial Development Authority) ఎలా అభివృద్ధి చేయబడింది?
-
ప్రధాన నగరం…: ఢిల్లీ… గురుగ్రామ్ సరిపోలేదు… ఇంకా విస్తరణ కావాలి, అదుగో అలా డెవలప్ చేయబడిన మరో సక్సెస్‌ఫుల్ శాటిలైట్ సిటీ…
-
అభివృద్ధి…: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1976లో దీనిని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసింది…
-
విజయం…: ప్రభుత్వమే నేరుగా భూమిని సేకరించి, అత్యుత్తమ రోడ్లు, మెట్రో అనుసంధానం, పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్‌లను అభివృద్ధి చేసింది… ఇది మీడియా, విద్య, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు కేంద్రంగా మారింది…
వైట్‌ఫీల్డ్ , ఎలక్ట్రానిక్ సిటీ (Whitefield & Electronic City) ఎలా అభివృద్ధి చెందాయి?
-
ప్రధాన నగరం…: బెంగళూరు… ఐటీ బూమ్, అనేక ప్రాంతాల నుంచి జనం వలస రావడంతో నగర విస్తరణ అనివార్యమైంది… అలా శివారు నగరాల నిర్మాణం జరిగింది…
-
అభివృద్ధి….:
-
ఎలక్ట్రానిక్ సిటీ…: KEONICS సంస్థ 1970లలో దీనిని ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కోసం (Electronics) స్థాపించింది… ఇది ప్రభుత్వ ప్రేరేపితమైన అభివృద్ధి…
-
వైట్‌ఫీల్డ్…: మొదట ఆంగ్లో-ఇండియన్ల కోసం ఒక టౌన్‌షిప్‌గా ఉండగా, 1990లలో ఐటీ పరిశ్రమల (IT Industry) విస్తరణతో భారీగా అభివృద్ధి చెందింది…
-
-
విజయం…: ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆకర్షించడంతో, బెంగళూరు ఓ సిలికాన్ వ్యాలీగా స్థిరపడింది… ఇదొక సక్సెస్ స్టోరీ…

సైబరాబాద్ (Cyberabad), హైటెక్ సిటీ (Hitec City), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) ఎలా అభివృద్ధి చెందాయో కూడా ముందే చెప్పుకున్నాం కదా… 1990ల చివరలో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించింది…
- అవసరం, భూమి లభ్యతతో హైటెక్ సిటీ ఐటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా మారాయి… ఇది హైదరాబాద్ యొక్క గ్లోబల్ సిటీ ప్రతిష్టను పెంచింది… అవి ప్రణాళికబద్దంగా నిర్మించబడలేదు…
గాంధీనగర్, అహ్మదాబాద్‌కు అనుబంధంగా గుజరాత్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబడింది… న్యూ టౌన్, కోల్‌కతాకు అనుబంధంగా కోల్‌కతా నగర రద్దీని తగ్గించడానికి, IT/ITES కేంద్రంగా మార్చడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం HIDCO ద్వారా అభివృద్ధి చేసింది… మొహాలీ, చండీగఢ్‌కు అనుబంధంగా ప్లస్ దేశ రాజధానికి దగ్గరలో… చండీగఢ్ పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, ఐటీ, టెలికాం పరిశ్రమల (IT, Telecom) కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది…
ఇవన్నీ కొత్త నగరాలు… శివారు నగరాలు… ప్రధాన నగరాలకు అనుబంధంగా అవసరార్థం ఏర్పడిన సూపర్ హిట్ సిటీస్… ఎస్, ఇదే దిశలో ఫ్యూచర్ సిటీ ఓ అవసరం… ఓ అవకాశం… అందుకే ఖచ్చితంగా వాటన్నింటినీ మించిన గ్రాండ్ సక్సెస్ సిటీ అవుతుంది… ఎందుకు..?

భూలభ్యత… మెట్రో విస్తరణ… GHMC విస్తరణ… దగ్గరలోనే ఓఆర్ఆర్‌తో ఈజీ యాక్సెస్… ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో రవాణా అనుసంధానం… అంతర్జాతీయ ప్రమాణాల సదుపాయాలకు ప్రణాళిక రచన… కేవలం ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, ఎయిరోస్పేస్ రంగాలే కాదు… స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, సినిమా, ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగాలకు చాన్స్… ప్లానింగ్… అన్నింటికీ మించి రాజకీయ సంకల్పం… నిబద్ధత… ఒక ముఖ్యమంత్రి స్వప్నించే భావినగరం… ఇదీ ఫ్యూచర్ సిటీ కథ…
- మరి ప్రపంచానికి పరిచయం చేయాలి కదా… అందుకే అక్కడే గ్లోబల్ సమిట్ జరిగేది… ఒక స్వప్నాన్ని ఆవిష్కరించడం… ఆచరణ సాధ్యతను ప్రొజెక్ట్ చేయడం… శుభం… ఒక క్వాంటం సిటీ, ఒక ఎడ్యుకేషన్ సిటీ, ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక ఫిలిమ్ సిటీ, ఓ రీసెర్చ్ సిటీ, ఓ స్కిల్ సిటీ, ఓ ఎక్సలెన్స్ సిటీ, ఓ నెట్ జీరో సిటీ, ఓ ఇన్నొవేషన్ సిటీ… వాట్ నాట్..? ఇలా అనేక ఒకట్లు కలిస్తే అదే ఫ్యూచర్ సిటీ…!!
Share this Article