.
Pardha Saradhi Potluri ….. భారత్ కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించింది?
సర్గోదా డిస్ట్రిక్ట్, కిరానా హిల్స్, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్థాన్!
హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణకి అంగీకరించిందానికి కారణం ఉంది….
పాకిస్తాన్ లో సర్గోద జిల్లాలో అణు ధార్మికత లక్షణాలు బయటపడడంతో పాకిస్థాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలని ఖాళీ చేయించి దూరంగా వెళ్లిపొమ్మని మైకులతో ప్రచారం చేస్తున్నది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త!
Ads
కిరానా హిల్స్, సర్గోద!
కిరానా హిల్స్, సర్గోదా అనేది పాకిస్థాన్ లో అత్యంత రహస్యంగా మరియు రక్షణ ఉండే ప్రదేశం!
కిరానా హిల్స్ ని అమెరికాలో ఉన్న Area 51 తో పోలుస్తారు! రెండు చోట్ల కూడా కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు! నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైన మిలిటరీ అధికారులు తప్పితే ఎవరూ ఆ దారిదాపుల్లోకి వెళ్ళలేరు!
కిరానా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేస్తారు! అందుకే కిరానా హిల్స్ గురుంచి ఎవరికి ఏమీ తెలిసే అవకాశం ఉండదు!
కిరానా హిల్స్ మొత్తం పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధీనంలో ఉంటుంది!
కిరానా హిల్స్ ప్రాంతాన్ని బ్లాక్ హిల్స్ ( నల్ల కొండలు) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగులో ఉండే కొండలు 12 కిలోమీటర్లు వరకూ వ్యాపించి ఉంటాయి!
ఆ ప్రాంతం మొత్తం పదునైన కొండ రాళ్ళతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవరూ వెళ్ళలేరు! అందుకే మిలిటరీ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకోని 1980 లో ఆ ప్రాంతాన్ని కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కోసమే అనువుగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు.
1980 లోనే చుట్టుపక్కల ఉండే ప్రజలని 15 కిలోమీటర్లు దూరంగా ఉండేట్లుగా భద్రత ఏర్పాట్లు చేశారు.
1980 లో అక్కడ భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణం మొదలుపెడితే 1990 లో పూర్తయింది.
కిరానా హిల్స్ తో అనుసంధానం చేస్తూ ముషాఫ్ ఎయిర్ బేస్ నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి కానీ ఎవరి వద్దా ధ్రువీకరించిన సమాచారం లేదు దశబ్దాలుగా! చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అదీ కొద్దిమందికే!
కానీ 1980 కి ముందు అంటే 1965 లో భారత పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో కిరానా హిల్స్ మీద, ముషాఫ్ ఎయిర్ బేస్ మీద భారత యుద్ధ విమానాలు బాంబులు వేసాయి. దాదాపు 10 పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్ లో ఉండగానే బాంబు దాడుల వలన ధ్వంసం అయ్యాయి అప్పట్లో. ముషాఫ్ ఎయిర్ బేస్ అప్పట్లో విమానాలని నిలిపి ఉంచడానికి (పార్కింగ్) మాత్రమే వాడేవారు.
1983 నుండి 1990 ల మధ్య పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ నేతృత్వంలో పాకిస్థాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ( Pakistan Atomic Energy Commission -PAEC) కోల్డ్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్స్పీరిమెంట్స్ ( Cold టెస్ట్స్ or Subcritical Nuclear Tests ) ని నిర్వహించింది. కోల్డ్ టెస్ట్ అంటే అణు బాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యూరేనియంకి బదులుగా సాంప్రదాయ పేలుడు పదార్ధాన్ని వాడుతారు.
అంతా బాగుంది అని నిర్ధారణ చేసుకున్న తరువాత 1998 మే నెలలో చాగై హిల్స్ లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది పాకిస్తాన్.
అణు పరీక్ష నిర్వహించిన చాగై హిల్స్ గురుంచి మాత్రమే ప్రపంచానికి తెలుసు కానీ కిరానా హిల్స్ గురుంచి ఎవరికీ తెలియదు!
అణు పరీక్ష విజయవంతం అయిన తరువాత ముషాఫ్ ఎయిర్ బేస్ ని ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేసి కిరానా హిల్స్ తో అనుసంధానం చేసింది.
కిరానా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అణు వార్ హెడ్లని భద్రపరిచింది పాకిస్థాన్!
ఒకవేళ భారత్ తో జరిగే యుద్ధంలో అణు దాడి జరిగితే, కిరానా హిల్స్ లో ఉన్న సొరంగాల నుండి అణు వార్ హెడ్లని బయటికి తెచ్చి, వాటిని మిసైల్స్ తో అనుసంధానం చేసి, అక్కడి నుండి విమానాలతో తరలించడానికి ముషాఫ్ ఎయిర్ బేస్ ని ఎయిర్ Complex గా అభివృద్ధి చేశారు. అంటే సొరంగం నుండి నేరుగా Air Complex లోకి దారి ఉంటుంది కాబట్టి సాటిలైట్ కి కనిపించదు!
ఇప్పుడెలా బయటపడింది?
సర్గోద దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడడంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడ్డది!
రేడియేషన్ ఎందుకు బయటపడ్డది?
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్!అందులో భాగంగా సర్గోదా ఎయిర్ బేస్, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ ల మీద ప్రెసిషన్ మిసైల్ ఆటాక్ చేసింది భారత్!
సర్గోదా, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ లలో F-16, JF-17, జెట్ ఫైటర్స్ ని నిలిపి ఉంచింది పాకిస్తాన్ కాబట్టి వాటి మీద దాడి చేసింది భారత్!
విషయం ఏమిటంటే సర్గోదా, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ లనుండి కిరాిన హిల్స్ 20 KM దూరంలో ఉంది.
భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేలుడు ధాటికి కిరానా హిల్స్ లో ఉన్న భూగర్భ సొరంగాలలో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటికి వచ్చింది అనే అనుమానం రావడం వల్ల పాకిస్థాన్ కాల్పుల విరమణ అడిగింది!
మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో భారత్ దాడులు ఆపితే మేము రేడియేషన్ లీక్ మీద పరీక్షలు నిర్వహించుకుంటాము అని వేడుకున్నది పాకిస్తాన్!
రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణకి అంగీకరించండి అని అమెరికా అడిగితే మోడీ ఒప్పుకున్నారు! (మిగతాది తరువాయి భాగంలో… బోరాన్ తరలింపు దేనికి..? అమెరికా విమానం ఏమిటి..?)
Share this Article