మర్కజ్ రవి అని పేరు మార్చి పాఠకులతో బూతులు తిన్న ఈనాడు నిర్వాకం గుర్తుంది కదా… ఈనాడుకు తాత ఓ హిందీ చానెల్ ఉంది… దాని పేరు సోనీ ఎంటర్‌టెయిన్‌మెంట్… సెట్ అంటారు… అందులో క్రైమ్ పెట్రోల్ అని ఓ ఫేమస్ క్రైమ్ అంథాలజీ సీరిస్ వస్తుంటుంది… అంటే, ఏమీ లేదు… గతంలో మన తెలుగు చానెళ్లలో భీకరమైన గొంతులతో నేరాలు- ఘోరాలు అంటూ కొన్ని నేరసంఘటనల దర్యాప్తును వివరిస్తూ, భయపెట్టి చంపేవాళ్లు కదా… ఇదీ అలాంటిదే… కాకపోతే కాస్త నాణ్యత మెయింటెయిన్ చేస్తారు… దేశవ్యాప్త రీచ్ ఉన్నప్పుడు, ఆమేరకు యాడ్స్ వస్తున్నప్పుడు ఆమాత్రం కష్టపడకపోతే ఎలా అంటారా..? అవును…
అయితే మొన్న ఈ క్రైమ్ అంథాలజీలో భాగంగా ఆఫ్తాబ్ కేసును ప్రసారం చేశారు… ఆఫ్తాబ్ కేసు ఏమిటి అనడక్కండి… దేశమంతా సంచలనం సృష్టించిన కేసు… ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ఆ నీచుడు ఆమెను 32 ముక్కలు చేసి, ఢిల్లీ పరిసరాల్లో ఒక్కొక్క ముక్క ఒక్కోచోట పారేసి వచ్చాడు… నరరూప పిశాచం వాడు… ఇక్కడ ఏ మతం అయితేనేం..? నేరానికి మతం ఏముంది..? నేరగాడి మతాన్ని దాచే అవసరం ఏముంది..? దాచకపోతే సెక్యులర్ పాతివ్రత్యానికి చేటు కలుగుతుందా..? మరీ సోనీ కూడా ఈనాడు జర్నలిస్టుల్లాగే ఆలోచించింది…
Ads
ఇదీ క్రైమ పెట్రోల్‌లో ఈ కేసు ఎపిసోడ్… అహ్మదాబాద్-పూణె మర్డర్ కేసు అని మార్చారు… నిజానికి ఆ కేసు మొత్తం ఢిల్లీ పరిసరాల్లోనే జరిగింది… అన్నింటికీ మించి అందులో అఫ్తాబ్ పేరును మిహిర్ అని చూపించారు… హిందూ పేరు… బాధితురాలు, ముక్కలుముక్కలుగా కోయబడిన శ్రద్ధా వాకర్ పేరు అన్నా ఫెర్నాండెజ్ అని చూపారు… అది క్రిస్టియన్ పేరు… వాళ్లు ఓ గుడిలో పెళ్లిచేసుకున్నారట… సోనీ వాడు వాడిష్టం వచ్చినట్టు క్రైమ వార్తను మార్చిపారేశాడు…
నిందితులు, బాధితుల మతగుర్తింపును మార్చాల్సిన పనేమిటి..? నేరాన్ని నేరంగా చూడాలి… ఆప్తాబ్ తల్లిని హిందువుగా చూపించారు, భక్తురాలు అట… యూట్యూబ్‌లో కూడా ఈ ఎపిసోడ్ అప్‌లోడ్ చేశారు… ఈ కథనం రాసేసమయానికి ఆ వీడియో అలాగే ఉంది… కానీ దేశవ్యాప్తంగా సోనీ నిర్వాకం మీద విమర్శలు వస్తున్నాయి… ఈ ఎపిసోడ్ సోనీ లివ్ ఓటీటీలో కూడా ఉంది…
ఇక్కడ సోనీ చేసిన పనికి జస్టిఫికేషన్ ఏముంది..? మత సంబంధ ఉద్రిక్తతలు, గొడవలు రేగుతాయి అనుకున్నప్పుడు పేర్లను హైడ్ చేయడం అలవాటే… కానీ ఇలాంటి తీవ్ర నేరాల్లో పేర్లు హైడ్ చేయడం కాదు, మరీ హిందూ పేర్లను పెట్టడం నీచమే… ఈ కేసుపై ఒకవైపు దర్యాప్తు సాగుతోంది, కోర్టులో విచారణ కూడా సాగుతుంది… ప్రతి కాగితం మీద ఒరిజినల్ పేరు ఉంటుంది… మరి సోనీ వాడికి మతగుర్తింపు మార్చే పనేల..? ఈ కొత్త పైత్యం ఇప్పుడే స్టార్టయింది… ఎప్పుడో ప్రారంభించి ఉంటే కసబ్ పేరును కామేష్ అనీ, అఫ్జల్ గురు పేరును ఆనందస్వామి అని రాసి పారేసేవారేమో… ష్, నయీం పేరును నరేష్ అనీ రాసి ఉండేవారు… ఈనాడుకు సమయానికి తోచలేదు…!!
Share this Article