Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!

October 24, 2025 by M S R

.

డిజైన్‌ లోపం.. ఆ 2 నిమిషాలే కీలకం: ‘స్లీపర్‌’లో ఎందుకీ ప్రమాదాలు..?

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే.

Ads

సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు.. గత కొన్నేళ్లుగా స్లీపర్‌ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి..?

డిజైన్‌ లోపమేనా..?
సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో 2 x 1 సీటింగ్‌ ఉంటుంది. 30 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్‌ బస్సులైతే 36- 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్‌ ఆరు అడుగుల పొడవు.. 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్త్‌లను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య.

ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా.. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇక, స్లీపర్‌ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటోంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోయినప్పుడు.. ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.

అలసట.. మగత..
300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్‌ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్‌కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.

అధునాతన బస్సుల్లో డ్రౌజీనెస్‌ అలర్ట్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నా.. వాటి పనితీరు, సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. డ్రైవింగ్‌ సమయంలో తాము నిద్ర మత్తులో ఉంటున్నామని 25 శాతం మంది డ్రైవర్లు అంగీకరించినట్లు 2018లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఆ రెండు నిమిషాలే కీలకం…
ప్రమాదాల సమయంలో మొదటి రెండు నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, అప్పర్‌ బెర్త్‌ల్లో ఉన్నవారు బయటపడటం చాలా క్లిష్టంగా ఉంటోందని అంటున్నారు.

చైనాలో నిషేధం…
ఈ స్లీపర్‌ బస్సులు తొలుత పశ్చిమ దేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి. అయితే, వీటిల్లో జరుగుతోన్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్‌ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి.

చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్‌ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది… (ఈ విశ్లేషణాత్మక కథనం వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది... సందర్భం కాబట్టి షేర్ చేస్తున్నా... ఈ విశ్లేషకుడు ఎవరో గానీ ధన్యవాదాలు)...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Knowledge is not devine… జ్ఞానం ఎప్పుడూ అత్యంత ప్రమాదకరం…
  • హాస్యం అశ్లీలం చొక్కా వేసుకుని థియేటర్లకు వచ్చిన రోజులవి..!!
  • ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!
  • హఠాత్తుగా ఈ ఏసీ బస్సులు ఎందుకిలా కాలిపోతున్నయ్…? ఏం చేయాలి..?!
  • దావత్ వితౌట్ దారు..! ఆల్కహాల్‌పై మోజు తగ్గుతున్న యువతరం..!!
  • BESS… The Game-Changer for Continuous Power…
  • కోహ్లీ డక్, రోహిత్ 73… ఎక్కడొచ్చింది తేడా..? ఎవరిదీ తప్పు..?
  • అందం, వినోదం, యోగా, వ్యాపారం ప్లస్ మోసం- శిల్పాశెట్టికి పలు ముఖాలు…
  • BESS… పవర్ సెక్టార్‌లో రేవంత్‌ భేషైన ముందడుగు… అదేమిటంటే..?!
  • “నా ఎడిటర్ అభిప్రాయంతో విభేదించే స్వేచ్చ నాకు లేదా?”

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions