సృజనాత్మక స్వేచ్ఛ ఎలా వెర్రితలలు వేస్తోందో… కనీసం ఈ జాతికి విశేష సేవలందించిన మహనీయుల చరిత్రల్ని కూడా కమర్షియల్ క్రియేటివ్ ఫ్రీడమ్ అనే ఓ దిక్కుమాలిన పదంతో ఎలా భ్రష్టుపట్టిస్తారో మనం ఆర్ఆర్ఆర్ కథతో చూడబోతున్నాం… చెబుతూ పోతే అలాంటి ఉదాహరణలు బోలెడు దొరుకుతయ్… దురదృష్టం కొద్దీ మన పాలన వ్యవస్థలు, న్యాయవ్యవస్థలు కూడా పట్టించుకోవడం లేదు… మరో తాజా ఉదాహరణను సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా ‘ది ప్రింట్’ న్యూస్ వెబ్ సైటులో రాశాడు… బిజినెస్ స్టాండర్డ్‌లో కూడా వచ్చినట్టుంది…
నిజానికి గుప్తా ఎక్కడో మొదలుపెట్టి, ఎటెటో తీసుకుపోతుంటాడు తన వ్యాసాల్ని… ఇది మాత్రం ఒకే సబ్జెక్టు మీద కేంద్రీకృతం చేసి, మనసు పెట్టి రాసినట్టున్నాడు… మరీ రెండు వేల పదాల్ని ఇక్కడ అనువదించలేం గానీ… సారాంశం ఏమిటో చూద్దాం ఓసారి…
‘‘సోనీ లివ్‌లో రాకెట్ బాయ్స్ అనే ఓ సీరీస్ వస్తోంది… ఎనిమిది ఎపిసోడ్లు చూశాను… అంటే మూడు సినిమాల పెట్టు… జిమ్ సర్బ్, ఇశ్వాక్ సింగ్, రెజీనా కసాడ్రా, సబా ఆజాద్, దివ్యేంద్రు భట్టాచార్య, రజిత్‌కపూర్ తదితరులు నటించారు…
Ads
మన అణుశాస్త్ర ప్రగతికి ప్రాథమిక చోదకశక్తిగా మనం హోమీ బాబాను గుర్తుచేసుకుంటాం పదే పదే… ఆయన మరణానికి కారణమైన విమానప్రమాదం ఓ మిస్టరీ… అంతెందుకు..? లాల్ బహదూర్ శాస్త్రి మరణం కూడా మిస్టరీయే కదా… కుట్రలు కూడా కావచ్చు… నేనేమో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టును, సినిమా రివ్యూలు రాయలేను, కానీ ఈ రాకెట్ బాయ్స్ చూశాక రాయాలనిపిస్తోంది… జాతీయవాద టీవీ సీరిస్ పేరిట ఇద్దరు అద్భుత శాస్త్రవేత్తలు హోమి బాబా, విక్రమ్ సారాబాయ్ గురించి చూస్తుంటే బాగానే ఉంది… కానీ…
జాతీయవాద కథనం అంటే ఓ ముస్లిం విలన్‌ను సృష్టించాలా..? అప్పట్లో ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా అనే గొప్ప ఫిజిసిస్ట్… సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ బోస్, సారాబాయ్, బాబాల కేటగిరీ తను… అప్పట్లో, అంటే 1940 ప్రాంతంలో ఫేమస్ రాయల్ సొసైటీలో పది మంది భారతీయ శాస్త్రవేత్తలు చేరితే అందులో ఎనిమిది మంది ఫిజిసిస్టులే…
సినిమా, టీవీ సీరీస్ అంటే కొంత థ్రిల్లింగ్ మసాలా యాడ్ చేయడం సహజమే… కానీ ఓ దళిత సైంటిస్టు చరిత్రను వక్రీకరించి, తప్పుడు బాష్యాలు చెప్పి, పైగా ఓ ముస్లిం పేరు పెట్టి ఓ విలన్‌గా చూపించాల్సిన అవసరముందా..? మేఘనాథ్ సాహా కలకత్తాకు చెందిన ఈ ఫిజిసిస్ట్ ఓ బ్యాడ్ సైంటిస్టుగా, బాబా అంటే ద్వేషం-ఈర్ష్యలున్నవాడిగా చూపించారు… తను పేరును కూడా మెహదీ రజాగా మార్చారు… ఆయన కలకత్తా న్యూక్లియర్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్ సైక్లోట్రాన్‌కు ఆద్యుడు… 1951 ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచాడు… నెహ్రూ విధానాల్ని బహిరంగంగానే విమర్శించేవాడు…
ఈ విలన్ పాత్రను ఎలా చిత్రించారంటే… తను షియా అట… ముస్లిం లీగ్ మద్దతుదారట… తన ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి జిన్నా నుంచి నిధులు తీసుకున్నందుకు బాబా తనను బయటికి పంపించేశాడట… తరువాత ఓ జర్నలిస్టు సాయంతో భారత అణుకార్యక్రమాన్ని భగ్నం చేయడానికి సీఐఏ ట్రాపులో చేరిపోయాడట…
దర్శకుడు అభయ్ పన్నూతో మాట్లాడితే ఈ పాత్ర పూర్తిగా కల్పితం అన్నాడు… మేఘనాథ్ సాహా కథతో సంబంధం లేదంటాడు… మరి మిగతావన్నీ సేమ్ పేర్లతో పాత్రలుగా కనిపిస్తున్నప్పుడు ఈ మెహది రజా మాత్రం కల్పితపాత్రగా ఎలా సృష్టించబడ్డాడు..? మేఘనాథ్ సాహా ఓ పేద నామశూద్ర కులంలో పుట్టాడు… (దళిత ఉపకులం) కర్జన్ బెంగాల్ విభజనను విద్యార్థి దశలోనే వ్యతిరేకించాడు, స్కాలర్ షిప్ కోల్పోయాడు… ప్రెసిడెన్సీ కాలేజీలో వర్ణవివక్షను ఎదుర్కొన్నాడు…
సాహా సమీకరణం అనేది ఇప్పటికీ ఫిజిసిస్టులు గుర్తుచేస్తుంటారు… ఫేమస్ ఫిజిసిస్టుల వాదనల్ని కూడా తను వీగిపోయేలా చేసేవాడు… ఒక సంస్థ నిర్మాణం అనే కోణంలో తను బాబా, సారాబాయ్‌లకు ఏమీ తక్కువ కాదు… స్వాతంత్ర్యానికి పూర్వమే కలకత్తాలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించాడు… అంతేతప్ప తను జిన్నా నుంచి డబ్బు తీసుకోలేదు, పాకిస్థాన్ వెళ్లే ఆలోచన కూడా లేదు… నిజానికి తను దేశం పట్ల ప్రేమ ఉన్నవాడు… ఫైట్ చేసినవాడు… ఇండియన్ ప్లానింగ్ కమిటీ కోసం కూడా వర్క్ చేశాడు…
బాబా ఎదగడానికి జేఆర్‌డీ టాటా సహకరించాడు… సారాబాయ్ కూడా అంతే… వాళ్లిద్దరితో మేఘనాథ్‌కు కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి… సహజమే కదా… 1951లో కలకత్తా నుంచే లోకసభకు ఎన్నికై, నెహ్రూతో కొన్ని అంశాల్లో విభేదిస్తూనే ప్లానింగ్ కమిషన్‌కు సహకరించాడు… ప్రత్యేకించి భారీ నీటిప్రాజెక్టుల దిశలో తన ఆలోచనలు సాగేవి… దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు తన పుణ్యమే… ఎంపీగా ఉంటూనే కలకత్తా యూనివర్శిటీ సైన్స్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పేవాడు…
బాబా, సారాబాయ్, సాహా పలు అంశాల్లో విభేదించుకున్నా సరే… పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేవాళ్లు… అని ఆటమిక్ ఎనర్జీ హెడ్‌గా చేసిన అనిల్ కాకోద్కర్ చెప్పేవాడు… సాహా కమ్యూనిస్టు కాదు, ఫస్ట్ పార్లమెంటులో ఇండిపెండెంట్ ఎంపీ, గ్రేట్ ఫిజిసిస్ట్… మరి మెహది రజాగా ఎందుకు మార్చారు ఆయన్ని..? ఇదేనా క్రియేటివ్ ఫ్రీడం..? ఒక హీరోను ఇలా విలన్‌ను చేయాలా..?!” (Pic Source :: The Print)
Share this Article