.
ఆమె తన పదేళ్ల వయస్సులోనే చావు అంచుల్ని చూసింది. తిరిగి ఆమే.. 20 ఏళ్ల తర్వాత వచ్చి తనను కాపాడిన వైద్యుడికి ఒక పెన్నును బహుమతిగా ఇచ్చింది.
కొన్ని ఘటనలు నిజమా అనిపిస్తాయి. కళ్ల ముందే జరుగుతాయి. గిల్లి చూసుకుంటేనే కానీ అది నిజమో, కాదో ఒకింత నమ్మకం కుదరదు. కానీ, అవి నిజమైనప్పుడు మిగిల్చే ఆశ్చర్యంతో పాటు.. అనుభూతి కూడా మాటలకందనిది. అలాంటి అమ్మాయికి సంబంధించిన ఓ కేస్ స్టడీనే వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చెందిన ఓ వైద్యుడు తన X ఖాతాలో షేర్ చేయగా అదిప్పుడు వైరల్ గా మారింది.
Ads
సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఓ పదేళ్ల బాలికను హైదరాబాద్ లో ఓ బాలికను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధితో పోరాటం చేస్తోంది. ఆ అమ్మాయి బతకుతుందో, లేదోనన్న టెన్షన్ ఆ తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమెను తమిళనాడు వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు.
ఇరవై ఏళ్ల తర్వాత!
కట్ చేస్తే ఆ యువతి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె వెల్లూరులోని వైద్యుడిని కలిసింది. తనను బతికించిన ఆ వైద్యుడికి కృతజ్ఞతగా ఓ ఫౌంటెన్ పెన్ అందించి తనను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పుకుంది. ఈ ఘటన సదరు డాక్టర్ ను కన్నీళ్లు పెట్టించింది. అంతేకాదు, ఇప్పుడు ఇంటర్నెట్ లోనూ భిన్నరకాల మానవీయ స్పందనలకు అవకాశం కల్పించింది.
ఆ డాక్టర్ సుధీర్ కుమార్. ఆయన తన X ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. దీనిని “ఏ విజిట్ ఆఫ్టర్ ట్వంటీ ఈయర్స్ : ఏ స్టోరీ ఆఫ్ రీసైలెన్స్ అండ్ మెడికల్ మిరాకిల్” అనే పేరుతో ఆయన ట్వీట్ చేశారు. వైరల్ ఎన్సెఫాలిటీస్ అండ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్టికస్ అనే న్యూరో వ్యాధితో ఆ యువతి ఎలా తన వద్దకు వచ్చిందో సదరు వైద్యుడు తన పోస్ట్ లో ఓసారి గుర్తు చేసుకున్నాడు.
దాదాపు ఆమె ప్రాణాలకు ఎలాంటి భరోసా లేని.. చావు అంచుల వరకూ వెళ్లింది. ఓవైపు ఆమె తల్లి దైవ ప్రార్థన చేస్తుంటే.. తండ్రి బిడ్డ బతుకుతుందో లేదోనని పుట్టెడు దుఖంతో ఆసుపత్రిలో కూతురు బెడ్ వద్దనున్న సన్నివేశాలు ఇప్పుడు మళ్లీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయని వైద్యుడు పేర్కొన్నాడు.
ఆ తర్వాత అంతా టచ్ అండ్ గో డేస్. ఆమెను వెంటిలేటర్ పై ఉంచాం. ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి.. ఐసీయూలో వారం రోజులు, 24 గంటల పాటు పర్యవేక్షించాం. తమ కూతురు బతికి బట్ట కడుతుందా, తిరిగి స్కూల్ కు వెళ్తుందా ఇదిగో తల్లిదండ్రుల ఆందోళన ఇలా సాగిపోయేది.
కానీ, నెమ్మదిగా ఆటుపోట్లు తగ్గిపోయాయి. జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆమె చిన్ని చేతులు కదలడం ప్రారంభించాయి. ఆమె కళ్లు తెరిచింది. ఓ చిర్నవ్వు నవ్వింది. ఆ దృశ్యం పెను తుఫాన్ తర్వాత సూర్యుడి కిరణాలను చూసినంత ఉద్వేగానికి గురిచేసింది.
కొన్ని వారాల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయింది. చాలా బలహీనంగానే వీల్ చైర్ లో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రుల కంట తమ బిడ్డను కాపాడినందుకు ఆనందభాష్పాలు కనిపించాయి. అయితే, ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడుతుందో, లేదో.. ఆమె చదువు సంగతేంటనే ఒక ప్రశ్న వారి ముఖాల్లో కనిపించింది.
రెండు దశాబ్దాలు గడిచాయి. ఎన్నో కేసులు చూశాం. వస్తుంటారు, పోతుంటారు. వాస్తవానికి తన కేసు గుర్తేలేనంతగా మసకబారిపోయింది. కానీ, రెండు దశాబ్దాల తర్వాత ఓ యువతి ఔట్ పేషంట్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చి తనను కలిసి.. ఒకప్పుడు తాను వైద్యమందించి కాపాడిన బాలికనని చెప్పేసరికి నాకూ ఆశ్చర్యమేసింది.
అసలు నాకు ఆ కేసే గుర్తు లేదు. ఇప్పుడామె సాఫ్ట్వేర్ ఇంజనీరై తన కుటుంబానికి మద్దతైతోంది. జస్ట్ డాక్టర్ గా నేను చేసిన నా డ్యూటీకి కృతజ్ఞతగా ఆమె వచ్చి నన్ను కలిసింది.
ఆలోచించే బహుమతితో అబ్బురపర్చింది!
ఆమె డాక్టర్ ను కలిసి ఓ చిన్న బాక్సును ఆయన టేబుల్ పై ఉంచింది. అది అక్కడే ఓపెన్ చేశాడు డాక్టర్ సుధీర్ కుమార్. తెరిస్తే అందులో ఉంది ఓ ఫౌంటెన్ పెన్. ఇంకా చాలామంది రోగుల జీవితాల్లో ఇలాగే ఆశను రాయడం కొనసాగించాలని కోరింది.
అలా ఆమె కోరడం.. ఇరవై ఏళ్ల తర్వాత తిరిగిరావడం.. ఫౌంటెన్ పెన్ గిఫ్ట్ గా ఇవ్వడం.. ఇవన్నీ చాలా అరుదైన క్షణాలంటూ సదరు డాక్టర్ సుధీర్ రాసుకొచ్చారు. ఎప్పుడో ఒకప్పుడు వారు కాపాడిన ప్రాణాలే తిరిగి వచ్చి ఇలా కలవడం వైద్యుల చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుందనీ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రోగులు తాము పేషంట్స్ గా పడ్డ క్షోభను కూడా మర్చిపోవచ్చునేమోగానీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులను మాత్రం మర్చిపోరంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చనీయాంశమైంది.
వైరల్ ఎన్సెఫాలిటీస్ అండ్ రిఫ్రాక్టరీ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే..?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం వైరల్ ఎన్సెఫాలిటీస్ అనేది వైరస్ వల్ల కలిగే మెదడువాపు వ్యాధి. ఈ వైరస్ కేంద్రనాడీ వ్యవస్థ వెలుపల ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్తనాళాల ద్వారా మెదడుతో పాటు, వెన్నుపాముకూ ప్రయాణిస్తుంది.
ఇది వృద్ధుల కంటే యువతలోనే ఎక్కువ కనిపిస్తుంది. చాలాసార్లు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడమూ కష్టమేనంటారు డాక్టర్స్. కొంతమందిలో మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా యాంటీబాడీస్ తో తట్టుకునే శక్తి, సామర్థ్యాలుంటాయనీ చెబుతున్నారు.
అయితే, ఇది తీవ్రమైన వాళ్లకు మాత్రం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం రిఫ్రాక్టరీ స్టేటస్ ఎపిలెప్టికస్ అనేది తీవ్రమైన, ప్రాణాంతకమైన, అత్యవసర చికిత్సనందించాల్సిన వ్యాధి…
Share this Article