.
కోదండరాంను సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు కొందరు… ప్రత్యేకించి బీఆర్ఎస్ క్యాంప్… ఎన్నాళ్లుగానో ఉన్న పాత కక్షలు తీర్చుకుంటున్నట్టుగా… దుర్మార్గంగా… బీజేపీ క్యాంపు సంయమనం పాటిస్తోంది హుందాగా…
ఎస్, రాజకీయంగా కోదండరాం అడుగులు తప్పు కావచ్చు, ఈనాటి రాజకీయాలకు తను పనికిరాడు కావచ్చు… కానీ ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్‌గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా…. అన్నింటికీ మించి ఉద్యమ మద్దతు పార్టీలు, సమూహాల నడుమ అనుసంధానకర్తగా… కన్వీనర్‌గా…
Ads
తనను వీసమెత్తు తప్పు పట్టే పనిలేదు… ఐనాసరే, కేసీయార్ తనను తొక్కాలని చూశాడు… ఇంటి తలుపుల తాళాలు విరగ్గొట్టాడు… హౌజ్ అరెస్టులు, రోడ్ అరెస్టులు… అడుగడుగునా విపరీతమైన నిర్బంధకాండ… ఎందుకు..? తను థ్రెట్ కాకూడదని… తను చెప్పినట్టు వినడు కాబట్టి…
తనొక్కడే తెలంగాణ ఉద్యమకారుడిగా, పితగా ఏవేవో కీర్తికిరీటాలు ధరించడం కోసం… తన వందిమాగధులతో జాతిపిత అనే భుజకీర్తులు తొడిగించుకునే నియంత పోకడలు… కోదండరాం మాత్రమే కాదు, అసలు పాత తెలంగాణ జేఏసీయే ఉండకూడదు అని… అది ఉంటే తన రాజకీయ నిర్ణయాల సమీక్ష వేదికగా ఉంటుంది కాబట్టి…
అందుకే జేఏసీని తుత్తునియం చేశాడు… ఉద్యోగసంఘాలను విడదీశాడు… చివరకు కోదండరాం బీజేపీ అనుకూల వ్యక్తుల మద్దతుతో ఇంటర్ బోర్డు ఎదుట ఓ చిన్న ఫ్లాటులో ఆఫీసు తెరిచి, కాలం గడిపిన దుస్థితి… నిజానికి తనకు ఎవరు పడకపోతే వాళ్లను ప్రత్యర్థులుగా గాకుండా శత్రువుల్లా పరిగణించి, తొక్కేయాలని నిరంకుశంగా వ్యవహరించి… తెలంగాణలో ఓ ద్వేషపూరిత రాజకీయాల్ని ప్రారంభించిందే కేసీయార్…
కావచ్చు, తను రాజకీయాల్లోకి రావడం తప్పుటడుగే కావచ్చు… కానీ తన లెక్కలు తనకుంటాయి… తను అవినీతిపరుడు కాదు, కుసంస్కారి కూడా కాదు… తెలంగాణ ఉద్యమసంధానకర్తగా తెలంగాణ సమాజానికి తెలుసు కోదండరాం ఎలాంటివాడో…
రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటాయి… రేవంత్ రెడ్డి ఒక ఉద్యమ సంధానకర్తగా కోదండరాం పాత్రను గౌరవించాడు… అది సరైన గుర్తింపు… ఓ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడు… సుప్రీంకోర్టుకు ఎందుకు నచ్చలేదనే సాంకేతిక కారణాలను పక్కన పెడితే… యాంటీ- బీఆర్ఎస్ ప్రజాస్వామిక శక్తులన్నీ కోదండరాంను గౌరవించాయి…
ఈ ఎమ్మెల్సీ పదవి ఉంటే ఎంత..? ఊడిపోతే ఎంత..? కోదండరాం వీటికి అతీతుడే… కాకపోతే ఇప్పటికీ తెలంగాణ సమాజం కోరుకునేది తను తనలాగా ఉండాలని… తను వర్తమాన రాజకీయాలకు పనికిరాడు… తను ఎప్పుడూ తెలంగాణ అవసరాలు, కోరికలు, తెలంగాణ పట్ల విద్వేష రాజకీయుల కుట్రలను ‘ప్రశ్నించే శక్తిగా’ ఉండాలని..!
ఇప్పుడు కేసీయార్ క్యాంపు ఇంకా ఇంకా ఎందుకు ద్వేషిస్తోంది..? తనను రేవంత్ రెడ్డి గౌరవించాడు కాబట్టి, ఓ చట్టసభకు పంపించాడు కాబట్టి… అంతే కదా…
పనిలోపనిగా కేసీయార్ అస్సలు సహించని అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను మరోసారి పోస్టుల్లోకెి లాగి ట్రోల్ చేస్తున్నారు… అవును, ఒక వ్యక్తిని శాసనమండలికి నామినేట్ చేయాలా లేదా తన కోటాలో అనేది ఆమె విచక్షణాధికారం… చాలామంది ఆక్షేపిస్తున్నట్టు కోదండరాం రాజకీయ నాయకుడే, మరి దాసోజు శ్రావణ్ రాజకీయ నాయకుడు కాదా..!?
Share this Article