ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద ఆడియోలు, వీడియోల ఎపిసోడ్ల క్రియేటర్ ఎవరు..? ఆడించేదెవ్వరో కాసేపు పక్కన పెడితే… సీటు కింద సెగ తగిలినట్టుంది… ఢిల్లీ కాస్త అసహనంగా కదిలింది… ఇన్నాళ్లూ కేసీయార్ ఎంత గోకినా, బజారుకు లాగి రచ్చ చేయాలని ప్రయత్నించినా, ప్రధానితో ఏదో ఒకటి అనిపించి, మళ్లీ దాన్నీ రచ్చ చేయాలని భావించినా… రాష్ట్ర నేతలు, ఒకరిద్దరు జాతీయ నేతలు తప్ప ప్రధాని మోడీ మాత్రం ఎక్కడా కేసీయార్ మీద ఏ కామెంట్లూ చేయలేదు…
కేసీయార్ స్థాయికి నేను దిగిపోయి, తనపై కామెంట్ చేయను అనే పొలిటికల్ వ్యూహమే అది… నువ్వు గోకూ గోకకపో, నేను గోకుతూనే ఉంటా అని కేసీయార్ చెప్పాడు కదా… వీడియోలతో గోకాడు, కాస్త గట్టిగానే… ఆ వీడియోలను తెలంగాణలోనే ఎవడూ పెద్దగా నమ్మడం లేదు, కానీ ఢిల్లీ బీజేపీకి మాత్రం చిర్రెత్తుతోంది… అందుకేనేమో తొలిసారిగా ప్రధాని మోడీ రామగుండం సభలో కేసీయార్‌ను ప్రత్యక్షంగా పేరు ప్రస్తావించకుండానే సీరియస్ టోన్‌లో మాట్లాడాడు…
తెలంగాణను దోచుకునే తినే అవినీతిపాలనను, కుటుంబపాలనను దూరం చేస్తాం, వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా తన ప్రసంగం సాగింది… ఇది ఓ హెచ్చరికే… ‘‘కొంతమంది వికృత ఆలోచనపరుల విపరీత చేష్టలు, రాజకీయ తంత్రాలతో అభాసుపాలు చేస్తున్నారు’’ అనే వ్యాఖ్య మొన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ను ఉద్దేశించే… అంతేకాదు, ‘తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వెతికి పట్టుకుంటాం, రోజూ తిట్లు తింటున్నాను, ఈరోజు హైదరాబాద్‌లో ఉన్నవారికి నిద్రపట్టదు…’ అనే వ్యాఖ్యలూ కేసీయార్‌ను టార్గెట్ చేసినవే…
Ads
ప్రధాని వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజంతా విరుచుకుపడతాయేమో అని రాజకీయ విశ్లేషకులు భావించారు… ఎక్కడా చడీచప్పుడూ లేదు ఎందుకో మరి…! సింగరేణిని ప్రైవేటీకరించలేది లేదు, రాష్ట్రానికే ఎక్కువ వాటా ఉన్నప్పుడు అమ్మేయడం ఎలా సాధ్యం అని ప్రధాని నేరుగానే ప్రశ్నించాడు… దాంతో వెంటనే బొగ్గు బ్లాకుల కేటాయింపు మీదకు డైవర్ట్ చేసింది టీఆర్ఎస్… ఇదే సింగరేణి తన బొగ్గు గనులన్నీ తనే తవ్వుతోందా..? తాడిచర్ల బ్లాకును ప్రైవేటుపరం చేసిందెవరు..?
సరిగ్గా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎలా బిహేవ్ చేసేవాడో సేమ్ కేసీయార్ కూడా అలాగే చేస్తున్నాడు… సీబీఐ రాకుండా నిషేధాన్ని విధించడం, మోడీ వస్తే నల్లజెండాలు ఎగరేయించడం, రోజూ మోడీ మీద పడిపోవడం… మోడీ వ్యతిరేక శక్తులకు డబ్బు సమకూర్చడం, జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక వేదికల కోసం ప్రయత్నించడం… ఇప్పుడేమో అదే మోడీ ప్రాపకం కోసం వెంపర్లాట… బీజేపీతో పొత్తు కోసం ఆరాటం… మోడీని పర్సనల్‌గా అటాక్ చేసింది ఆ స్థాయిలో చంద్రబాబు ఒక్కడే… చివరకు మోడీ సతీమణిని కూడా తన విమర్శల్లోకి తీసుకొచ్చాడు… తనను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం బడబడా ఏడ్చేస్తాడు విలేకరుల ముందు…
కేసీయార్ ఎందుకు హఠాత్తుగా మోడీకి వ్యతిరేకమయ్యాడు అనేది రెండు పక్షాల్లోని కొందరు ముఖ్యులకు మాత్రమే తెలిసి ఉండవచ్చు… కానీ మోడీ అంత దూకుడుగా కేసీయార్ మీద ఏమీ పడటం లేదు… కేసీయార్ సర్కారును ఇప్పటికిప్పుడు మోడీ ఏదో చేసే సీన్ లేదు, చేయలేడు… మరి ఎందుకీ తీవ్ర వైషమ్యం… ప్రజలకు అర్థం కాని ఏదో లోగుట్టు ఉంది… అది బయటకు రాదు… కేసీయార్ ఫసాక్ అనుకోగానే తొక్కేయడానికి బీజేపీ అంత ‘వీజీ టార్గెట్’ కాదు… కేసీయార్ తాతలున్నారు బీజేపీలో… అందుకే కథ రసకందాయంలో పడుతోంది… ఇదే ఫ్లోలో ఆ ఇద్దరి నడుమ వైరానికి అసలు కారణాలేమిటో కూడా బయటపడితే బాగుండు..!!
Share this Article