ఇది చదవగానే ముందుగా ఓ సందేహమొస్తుంది… జగన్‌కు నెగెటివ్ వార్త కాబట్టి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి, అది నిజమేనా అనేది ఆ డౌట్… ‘‘మీడియాను తిట్టండి, ప్రెస్ కాన్పరెన్స్‌లు పెట్టి మరీ తిట్టండి… మనం మంచి చేసినా కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారు… మనం కౌంటర్ చేయకపోతే జనం నమ్మే ప్రమాదం ఉంది…’’ అని జగన్ కలెక్టర్లకు పిలుపునిచ్చాడట…
వార్తలో ఏముందో పక్కన పెడితే… ఆ డెక్కుల్లోనే ఓ పాయింటుంది… ‘‘ఏ మంచి చేసినా నెగెటివ్‌గా రాస్తున్నారు… ఐనాసరే పాజిటివ్‌గా తీసుకొండి’’ అన్నాడట… మరి పాజిటివ్‌గా తీసుకునే పక్షంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ తిట్టాలనే పిలుపు దేనికి..? అందుకే వార్త పట్ల డౌట్లు… ఇక్కడ జగన్‌కు ఓ ప్రశ్న… ఈ వార్త నిజమే అయితే… ‘‘మీడియాను కలెక్టర్లు ఎందుకు తిట్టాలి..? మీ రాజకీయాల్లోకి వాళ్లను లాగడం దేనికి..? ఏం నీకు మంత్రులు లేరా..? అధికార ప్రతినిధులు లేరా..? అసలు మీడియా తప్పుడు కథనాల బట్టలు విప్పే తెలివైన కేరక్టర్లే లేవా..?’’
దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనట్టుగా మీడియా సలహాదారులు… ప్రజాధనం కోట్లు వృథా… నిజానికి ఇదే స్థితిలో చంద్రబాబు ఉంటే వాషింగ్టన్ పోస్టు, న్యూయార్స్ టైమ్స్, బీబీసీ వంటి అంతర్జాతీయ పత్రికల్ని కూడా మేనేజ్ చేసేవాడు… మరి జగన్ వార్తల్ని ఇక్కడే కనీసం తెలంగాణ ఎడిషన్లలో కూడా సరిగ్గా క్యారీ చేయరు దేనికి..? అంతెందుకు..? తన సొంత మీడియా సాక్షి ఒక్క విషయంలోనైనా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలను చదివేట్టుగా కౌంటర్ చేయగలిగిందా..?
Ads
సర్క్యులేషన్ జగనే పెంచాలి… యాడ్స్ జగనే ఇప్పించాలి… మరి సాక్షి జగన్‌కు ఉపయోగపడుతున్నదెంత..? ఒక్క నిమిషం ఈ ప్రశ్న వేసుకున్నాడా తను..? చాలామంది అభిప్రాయం ఏమిటంటే… ఆంధ్రజ్యోతి ఒక అబద్ధాన్ని కూడా నిజమని భ్రమించేలా వండి, మసాలాలు వేసి, తినబుల్‌గా వడ్డిస్తుంది… సాక్షి రాతలు ఉత్త ఉప్మారాతలు… అవెవడూ చదవడు… మరి ఇలా చాలా కోణాల్లో ఆలోచించకుండా… తిట్టండి, తిట్టండి అంటే అదేం ముఖ్యమంత్రిత్వం సారూ..?
ఊర్లో సర్పంచి అయ్యా అప్పా అంటే నడవదు… చేతిలో దుడ్డుకర్ర చేతిలో పట్టుకోవాలి… నిజంగా తప్పుడు రాతలు రాస్తే, ఆ కర్రకు పనిచెప్పాలి… జగనే కదా… కరపత్రికలకు కర్రతో జవాబు చెప్పడానికే కదా 2435 జీవో తీసుకొచ్చింది, అదేమైంది..? పోనీ తప్పుడు రాతలకు వివరణలు ఇవ్వమనండి… అంతేగానీ తిట్టడం ఏమిటి..? పోనీ, తిడతారు సరే, ఎవరిని తిడతారు, ప్రెస్‌మీట్లకు వచ్చే రిపోర్టర్లను తిడతారా..? యాజమాన్యాలను తిడతారు, అంతే కదా… వాళ్లేం చేయగలరు..? జరిగింది రిపోర్ట్ చేసి, హైదరాబాద్‌కు పంపిస్తారు… రామోజీ, రాధాకృష్ణ వాటిని చెత్తబుట్టల్లో పడేస్తారు… వేరే పత్రికలు, వేరే చానెళ్లు కూడా ఆ తిట్లను లైట్ తీసుకుంటాయి… లేకపోతే ప్రత్యక్ష ప్రసారం చేసి, జగన్‌ను మోయవు కదా…!! జగన్ సార్… ఇంకాస్త హుందాగా కూడా పరిపాలించవచ్చు..!!
Share this Article