Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

June 20, 2025 by M S R

.

మామూలు మాఫియా వ్యవహారాల్లోనే కాదు… కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ డబుల్ ఏజెంట్లు అనే ఓ పదం చాలా క్లిష్టమైంది… అలాంటోళ్లే కథల్ని అటూ ఇటూ మార్చేస్తారు…

అమెరికా అధ్యక్షుడు ఆ డబుల్ ఏజెంట్ లేదా క్రాస్ ఏజెంట్‌కన్నా అధ్వానంగా కనిపిస్తున్నాడు… పిచ్చి లేచినట్టు తూలుతున్నాడు… ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయగల ఏకైక అగ్రదేశం అధ్యక్ష కుర్చీలో కూర్చుని తలతిక్క కూతలకు దిగుతున్న తీరు ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది…

Ads

పోనీ, ఆ మాటల వెనుక ఏమైనా మర్మమో, వ్యూహమో ఉందా..? ఏమీ లేదు…! పాకిస్థాన్ ప్రధాని మన్నూమశానం మొత్తం వదిలేసి… సైన్యాధ్యక్షుడిని పిలిచి దావత్ ఇచ్చాడు… ఉండొచ్చు, క్రిప్టో వ్యాపారం, బెలూచ్ గనులు తదితర దురాలోచనలు ఉండవచ్చుగాక…

కానీ ఇండియా విస్తుపోతోంది… సాక్షాత్తూ ప్రధాని మోడీ షాక్ తింటున్నాడు… ఈ ట్రంపు కోసమా నేను ప్రచారం చేసింది అని ఖిన్నుడవుతున్నాడు… అవును, ట్రంపు మాత్రమే కాదు… అమెరికా ఎప్పుడూ ఇండియా దోస్త్ కాదు, అది గుర్తించకపోవడమే మోడీ ఫెయిల్యూర్…

ఈ నేపథ్యంలో పెద్దలు Subramanyam Dogiparthi పోస్టు ఒకటి ఇంట్రస్టింగు…



అమెరికా అధ్యక్షులు ఎందుకు పాకిస్థాన్ని వెనకేసుకు వస్తారు ? కెనడీ మినహాయించి ఆ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్లు అందరూ పాకిస్తాన్ కొమ్ము కాసేవారే . ప్రపంచంలో అతి పెద్ద రెండు ప్రజాస్వామ్యాలు భారత్ , అమెరికా . పాకిస్థాన్ ప్రజాస్వామిక దేశం కాదు . అయినా దానినే వెనకేసుకు వస్తారు .

అమెరికన్లు ఎక్కువ మంది ఇండియానే ఇష్టపడతారు . అదేంటో అధ్యక్షులు అందరూ పాకిస్థాన్నే ప్రేమిస్తారు . అమెరికా పరువుని నిలువునా తీసిన బిన్ లాడెనుకు పాకిస్థాన్ అనధికారికంగా ఆశ్రయం ఇచ్చింది . అయినా బుద్ది , సిగ్గు రాలేదు .

నెహ్రూ ఆర్ధిక నమూనా రష్యాదే అయినా కెనడీకి గొప్ప మిత్రుడు . ఇందిరాగాంధీ రష్యాతోనే ఎక్కువ స్నేహం చేసింది . అత్యవసర సమయాలలో నిర్ద్వంద్వంగా , నిజాయితీగా రష్యా భారత్ వెంట ఉంది .

ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన ప్రధానులలో బలవంతుడు మోడీయే . 2014 లో మోడీ ప్రధాని అయితే ట్రంప్ 2016 లో ప్రెసిడెంట్ అయ్యాడు . 2020 ఎలక్షన్లలో బహిరంగంగా ట్రంపుకి ప్రచారం చేసారు . బహుశా ప్రపంచంలో ఇంత బహిరంగంగా మరి ఏ ఇతర దేశ అధినేతా ఏ దేశపు ఎన్నికల్లో పాల్గొని ఉండరు …

ఇంత సపోర్ట్ మోడీ నుండి పొందిన ట్రంప్ తాజా క్షుద్ర విన్యాసాలు చూస్తుంటే భారతీయులకు ఆశ్చర్యం కలుగుతుంది . ఎందుకు ట్రంప్ ఇంత ద్రోహం చేస్తున్నాడు !? ఎందుకు చేయవలసి వచ్చింది .

వీటన్నింటినీ మించి అమెరికా ప్రత్యర్థి అయిన చైనా కూడా పాకిస్థాన్ వెంటే ఉంది . అయిననూ అమెరికా పాకిస్థాన్నే సపోర్ట్ చేస్తుంది ?! వాడి దగ్గర ఉంది ఏంటి ?! మన దగ్గర లేనిదేంటి ?! ఏమాత్రం నమ్మదగని అమెరికా కోసం మనకు ఎందుకు ఈ వెంపర్లాట..?  అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులే విశదీకరించాలి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions