Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!

June 23, 2025 by M S R

.

Pardha Saradhi Potluri …… ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే!

ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది నిన్న ఉదయం!
అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి మూడు ఇరాన్ యూరేనియం శుద్ధి కర్మాగారాల మీద దాడి చేసి, ధ్వంసం చేసి, సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి!

Ads

B2 బాంబర్లు దాడిచేసిన అణు శుద్ధి కర్మాగారాలు ఇవి:
ఫారదౌ ( Fordow), నటంజ్ ( Natanz ), ఇస్ఫా హాన్ ( Esfahan).
ఇరాన్ యూరేనియం శుద్ధి చేస్తున్నది అణు విద్యుత్ కోసమే అని చెప్తూ వస్తున్నా అది కేవలం అణు బాంబు తయారీ కోసమే అని ప్రపంచానికి తెలుసు!
యురేనియం శుద్ధి చేసేది పౌర అవసరాలకి అయితే ప్రస్తుతం ఇరాన్ చేస్తున్నది అబద్ధమన్నది తెలిసిపోతుంది!

ఒకసారి యురేనియం శుద్ధి చేసే విధానాలు వాటి ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం…
1.విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే అణు రియాక్టర్ల కోసం యురేనియంని 3- 5 % ల మధ్య ( 3-5% U 235 Isotope) శుద్ధి చేస్తే చాలు. ఈ స్థాయిలో శుద్ధి చేస్తే ( enrichment) న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ని కంట్రోల్ చేస్తూ వేడి పుట్టించి ( controlled Nuclear Fission) విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
2. అణు బాంబు గ్రేడ్ యురేనియం – Weapons Grade Uranium. అణు బాంబు తయారు చేయడానికి యురేనియం 90 % ( U 238 ) శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ యురేనియంని విద్యుత్ ఉత్పాదన కోసం వాడలేరు.

తేడా గమనించారా? U 235 ని విద్యుత్ ఉత్పాదన కోసం వాడితే U 238 ని అణు బాంబుల కోసం వాడతారు.
ఇరాన్ మీద దాడి జరిగే సమయానికి 90 % శుద్ధి చేసిన యురేనియంని తయారు చేసింది! జస్ట్, శుద్ధి చేసిన యురేనియంని అణు బాంబు కోసం తరలించడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే అమెరికా దాడి చేసింది!

నిజానికి ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తున్నది అని తెలిసినా ఇన్నాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుని, ఇప్పుడు చివరి క్షణంలో దాడి చేయడం అమెరికా ఆత్మ రక్షణ చర్య అనే చెప్పాల్సిన అవసరం ఉంది!
ఇజ్రాయేల్ దాడి చేస్తే అది ఇరాన్, ఇజ్రాయేల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణగా ప్రపంచం చూస్తుంది అని అమెరికన్ మేధావుల ఆలోచన! కానీ ఏదో ఒక రోజున దాడి చేయకతప్పదని తెలిసీ ఉదాసీనంగా ఉండడం అమెరికా చేసిన, చేస్తున్న వ్యూహత్మక తప్పిదం ఇది!

ఇరాన్ U 235 యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా, లేదా, U 238 వెపన్ గ్రేడ్ యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా వంకలు చూపకుండా ముందే దాడి చేసిఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు!
పాకిస్థాన్ అణు అస్త్రాలు కలిగిన దేశమే అయినా మోడీ నేరుగా దాడి చేశారు కానీ ఇరాన్ ఇప్పటికే అణు బాంబు తయారు చేసుకొని ఉండవచ్చు అనే భయంతోనే ఇన్నాళ్ళు తాత్సారం చేసింది అమెరికా!

ఇక్కడ సరైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనేది కీలక అంశంగా చెప్పుకోవాలి! పేరు గొప్ప CIA ఏం చేస్తున్నట్లు? RAW చేయగలగింది CIA ఎందుకు చేయలేకపోయింది?
మరి ఇజ్రాయేల్ ఎందుకు దాడి చేయలేక పోయింది?
ఇజ్రాయేల్ వారం క్రితమే అంటే జూన్ 16 న దాడులు చేసింది కానీ మూడు అణు కేంద్రాలు కూడా పర్వతపాదాల వద్ద చాలా లోతుగా నిర్మించింది ఇరాన్!

ఇరాన్ కి తెలుసు ఇజ్రాయేల్ దగ్గర బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయని… అవి రీ ఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ని కూడా తొలుచుకుంటూ వెళ్లి ధ్వంసం చేయగలవు అని! దాంతో పర్వతపాదాల వద్ద లోపలికి మూడు అంచెలుగా అణు రియాక్టర్లని నిర్మించింది ఇరాన్!

జూన్ 16 న ఇజ్రాయేల్ చేసిన దాడిలో మొదటి అంతస్థు మాత్రమే ధ్వంసం అయింది. మిగతా రెండు అంతస్థులని తొలుచుకుంటూ వెళ్లగలిగిన బాంబులు ఇజ్రాయేల్ దగ్గర లేవు, ఒకవేళ అమెరికా ఇచ్చినా వాటిని మోసుకెళ్లి వదలగలిగిన బాంబర్లు ఇజ్రాయేల్ దగ్గర లేవు!

80 మీటర్లు లోతుకి వెళ్లి దాడి చేయాలి అంటే చాలా బరువైన బంకర్ బస్టర్ బాంబు కావాలి అది….
GBU -57 MOP బాంబ్!
GBU – 57 MOP అంటే మాసీవ్ ఆర్డినేన్స్ పెనిట్రేటర్ ( MASSIVE ORDINANCE PENETRATOR )
ప్రపంచంలో ఏ దేశంలో కూడా GBU 57 MOP బాంబు లేదు…

GBU-57 MOP ప్రత్యేకతలు….
GBU 57 బాంబు బరువు 14 టన్నులు ఉంటుంది.
GBU 57 GPS ఆధారంగా గట్టిగా ఉండే భూమి లేదా పర్వతాలు, కొండలు లోపలికి 80 మీటర్ల లోతుకి చొచ్చుకువెళ్లి దాడి చేస్తుంది.
GBU -57 బాంబు 80 మీటర్ల లోతుకి వెళ్లిన తరువాత ఆగిపోయి, అప్పుడు దానిలో ఉండే పేలుడు పదార్ధం పేలిపోయేట్లుగా డిజైన్ చేశారు. దీనిని delayed action fuse అంటారు.
అంటే బాంబు భూమి లేదా కాంక్రీట్ ని తొలుచుకుంటూ వెళ్ళిపోయి ఆగిన కొద్దిసేపటి తరువాత పేలిపోయి భూగర్భంలో ఉండే టార్గెట్ ని ధ్వంసం చేస్తుంది.

So! ఇజ్రాయేల్ జూన్ 16 న ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేసిన తరువాత సాటిలైట్ ఇమేజెస్ ని పరిశీలించి, తమ దాడిలో అణు కేంద్రాలు పూర్తిగా నాశనం అవలేదని ఇంకా ఆక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయని నిర్ధారణకి వచ్చి GBU 57 తో దాడి చేయమని అమెరికాని అడిగింది!

ఇజ్రాయేల్ అభ్యర్ధన అనేది కొద్ది గంటలలోనే అంటే, జూన్ 17 న దాడి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ట్రంప్ ని అడగడం జరిగింది కానీ ట్రంప్ మీన మేషాలు లెక్కిస్తూ చివరికి నిన్న ఉదయం దాడి చేశాడు!

ఆయుధాల విషయంలో గోప్యత ఎందుకు అవసరమో GBU – 57 MOP బాంబు ఉదంతం ఒక ఉదాహరణ!
GBU – 57 MOP గురుంచి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కి కూడా నూరు శాతం వివరాలు తెలియవు…

….. తరువాయి భాగం… బిన్ లాడెన్ - కొండ గుహ - GBU 57 MOP!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…
  • అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…
  • బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
  • పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
  • ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!
  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!
  • సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!
  • మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…
  • రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions