Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాధా రాధా మదిలోన మన్మథ బాధ… ఆమె హఠాత్తుగా తెరపైకి వచ్చింది అందుకేనా..?!

December 19, 2022 by M S R

రాధ అనగానే ఎన్ని జ్ఞాపకాలు… రాధా రాధా మదిలోనే మన్మథ బాధ అంటూ బోలెడు పాత సంగతులు చుట్టుముడతాయి,.. సౌత్ ఇండస్ట్రీలో ప్రతి హీరో పక్కన హీరోయిన్‌‌గా చేసింది,.. ప్చ్… ఇప్పుడు చూస్తే మదిలోన ఏదో నొప్పించే బాధ అని పాడుకోవాలి… అంతగా ఊరిపోయింది… పాపం శమించుగాక… అక్క అంబిక, తను ఒక దశలో తమిళ, తెలుగు సినిమాలను ఏలారు…

ముదళ్ మరియాదై చిత్రంలో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది…. తన నటనా జీవితపు తారస్థాయిలో తన బంధువైన మణి అనే ముంబై వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది… పెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పింది… ముంబైలో ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంటు నిర్వహిస్తున్నది. కూతురు కార్తిక కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది కానీ పెద్దగా క్లిక్ కాలేదు…

మొత్తం మెయన్ స్ట్రీమ్‌కు దూరంగా,… బుల్లి, వెండితెరలకు దూరంగా… కెమెరాలకు దూరంగా ఉంటున్న ఆమె హఠాత్తుగా బిగ్‌బాస్ 6 సీజన్‌లో ఓ గెస్టుగా దర్శనమిచ్చింది… ఒక రవితేజ, శ్రీలీల వచ్చారంటే ధమాకా ప్రమోషన్… ఒక నిఖిల్ వచ్చాడంటే 18 పేజెస్ ప్రమోషన్… మరి ఈ భారీ కేరక్టర్ దేనికి వచ్చినట్టు..?

Ads

చాలామందికి అర్థం కాలేదు… తీరా అదే స్టార్‌మాటీవీ వాడు ఓ ప్రోమో వదిలాడు… అప్పుడు అర్థమైంది రాధ ఎందుకొచ్చిందో అక్కడికి… స్టార్‌ మాటీవీ వాడు బిగ్‌బాస్ పాత, కొత్త కంటెస్టెంట్లతో రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటాడు కదా… అన్నీ సరదా, టైంపాస్ పల్లీ తరహా ప్రోగ్రామ్స్… బీబీ జోడీ అంటూ ఓ షో కొత్తగా ప్లాన్ చేశాడు… బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను జోడీలుగా చేసి, డాన్స్ పోటీ అన్నమాట… సరే, ఓ వినోద చానెల్‌కు అంతకన్నా ఎంటర్‌టెయినింగ్ షో ఏముంటుంది..? దీని లాంచింగుకు నాగార్జున గెస్టు… ఆ షోలో రాధ జడ్జ్… ఇంద్రజ, రమ్యకృష్ణ, ఖుష్బూ చాలా మందికి తెలుగు టీవీ డబ్బులు ఇస్తూ ఎంగేజ్ చేసుకుంటోంది… Why not Radha…

కొన్ని పాత సినిమాల్లో నాగార్జున, రాధ కలిసి రొమాన్స్ చేశారు… కాకపోతే ఆమె ఇప్పుడు బామ్మ, నాగ్ స్టిల్ యంగ్…

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కాబట్టి ఈ షోలను కాదనరు, డబ్బులు సరేసరి… ఈ బీబీ జోడీ షో లాంచింగ్‌కు నాగార్జున కూడా వచ్చాడు… ఆ షూటింగు కోసం వచ్చిన రాధను బిగ్‌బాస్ ఫినాలేకు కూడా పట్టుకొచ్చారు… మరి బీబీ జోడికి ప్రమోషన్ చేసుకోవచ్చు కదా… అదీ చేతకాలేదు… దీనికి శ్రీముఖి హోస్ట్… ఈ ఆంటీలు, ఈ రష్మిలు గట్రా పక్కకు వెళ్లిపోయి శ్రీముఖి ఈమధ్య బాగా పాపులరైపోయింది ఇలాంటి షోలకు… పైగా ఆమె కూడా బిగ్‌బాస్ కేరక్టరే కదా.,.. గతంలో ఈటీవీ ఢీ షోకు జడ్జిగా చేసిన సదా ఒక జడ్జి… రాధ మరో జడ్జి… ఇంకో పాత కొరియోగ్రాఫర్ కూడా కనిపిస్తున్నాడు…

హహహ… ఆర్‌జే సూర్య, ఫైమా డాన్స్ నవ్వు పుట్టిస్తోంది… మళ్లీ ఫైమా చేతిపై నాగార్జున ముద్దు కూడా పెట్టుకున్నాడు… ఈ ప్రోమోలో బాగా నచ్చింది ఏమిటంటే… ఆషు రెడ్డి వచ్చి శ్రీముఖిని మేం పిలిస్తే వచ్చేవాళ్లవెరో తెలుసా అంటూ ఏదో అడుగుతోంది… కొంపదీసి ఆర్జీవీ కాదుకదా అన్నట్టు శ్రీముఖి జబర్దస్త్ సెటైర్ వేసింది… ఈమధ్య ఆషురెడ్డి కాలివేళ్లను చీకిన ఆర్జీవి ఎక్కడికో పాతాళంలోకి పడిపోయిన వివాదం తెలిసిందే కదా…

చాన్నాళ్ల తరువాత తేజస్వి వచ్చి ఎవరితోనో జతకట్టి డాన్సు చేస్తోంది… ఈ షోలో యాంకర్ శివ ఒక్కడే ఆడ్‌గా కనిపిస్తున్నాడు… ఎప్పటిలాగే అవినాష్ సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ పర్‌ఫామ్ చేశాడు… పర్లేదు… సో, రాధ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా… మరొక్కసారి… రాధా రాధా, మదిలోన మన్మథ బాధ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions