Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వుమెన్ బిల్లుతో ఆగమాగం… ఇదేమరి మీడియా దుందుడుకుతనం అంటే…

September 19, 2023 by M S R

సీనియర్లు ఏమంటారంటే..? ఏ జర్నలిస్టూ ఏ రంగంలోనూ నిపుణుడు కాదు, కానీ కామన్ సెన్స్  వాడాలి… అన్నింటికీ మించి ఓపిక, సంయమనం అవసరం అంటారు… పూర్తి వివరాలు వచ్చేవరకు ఆగాలంటారు… కానీ ఇప్పుడంత టైమ్ ఎక్కడుందని… ఏదైనా పరిణామం తెలిసిందంటే చాలు, మనకు అర్థమైనకాడికి ఏదో ఒకటి రాసిపడేయడమే… దురుద్దేశంతో కాకపోవచ్చు… కానీ అందరికన్నా వేగంగా, ముందుండాలనే తాపత్రయంతో…

పార్లమెంటులో మహిళా బిల్లు మీద చాలామంది సోషల్ మీడియాలో ఎడాపెడా రాసిపడేశారు… పడేస్తున్నారు కూడా… డిజిటల్ పేపర్లు కూడా సోషల్ మీడియా బాటే… మహిళా బిల్లు అనగానే ఎక్కడెక్కడ తెలంగాణలో మహిళ ఓట్లు ఎక్కువున్నాయో లెక్కలు తీసి ఎవరెవరి సీట్లు గల్లంతవుతాయో లిస్టులు రాసేశారు… ఎవరి దాకో ఎందుకు..? ఏకంగా కేసీయార్, కేటీయార్, హరీష్ స్థానాలకు కూడా ఎసరు పెట్టేశారు…

Ads

ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా ఉంది… అదుగో కేసీయార్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేశాడు గానీ… ఇప్పుడు తలపట్టుకున్నట్టే… కనీసం 35 మంది అభ్యర్థిత్వాలు మార్చేయాల్సిందే… ఆల్‌రెడీ కేసీయార్ మహిళా అభ్యర్థుల కసరత్తు స్టార్ట్ చేసేశాడు… సతీమణులు, కోడళ్లు, బిడ్డలు పోటీకి ఇష్టపడని చోట్ల, కనీసం 15 మంది బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కూడా విశ్లేషణలు వచ్చాయి… అక్కడికి వీళ్లే డీలిమిటేషన్లు చేసేసి, వీళ్లే రిజర్వేషన్ల సీట్లను ఖరారు చేసేసి, వీళ్లే ఎన్నికల సంఘం ప్రతినిధులు అయిపోయారు… కొందరైతే ఏకంగా తెలంగాణలోని 119 సీట్లలోని 63 సీట్ల వోట్ల వివరాలు రాసేసి, అన్నీ రిజర్వ్ అయిపోయినట్టే అని రాసిపడేశారు…

నిజానికి విషయం ఏమిటంటే… ఇప్పుడు లోకసభలో, రాజ్యసభలో బిల్లు పాస్ కాగానే అది చట్టం అవుతుంది నిజమే… కానీ తక్షణం ఆ రిజర్వేషన్లు అమల్లోకి రావు… జనగణన జరిగిన తరువాత, అంటే 2027 తరువాతే అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది… అంటే తెలంగాణలో వచ్చే ఎన్నికలకు అవి వర్తించవు అన్నమాటే కదా… అసలు జనగణన 2021లోనే జరగాల్సి ఉంది… కరోనా కారణంగా వాయిదా పడింది… అదెప్పుడు జరుగుతుందో ఎవరికీ క్లారిటీ లేదు…

women bill

women bill

ఈలోపు డీలిమిటేషన్ గడువు ముందుకొస్తుంది… అదెన్నాళ్లో ఎవరూ అంచనా వేయలేరు… వెరసి 2029 లోకసభ ఎన్నికల నాటికి గానీ ఈ ప్రక్రియలన్నీ ఓ కొలిక్కి రావచ్చునని రఫ్ అంచనా… ఈలోపు ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు వచ్చినా పాత రిజర్వేషన్లే ఉంటాయి… పైగా మహిళల వోట్లు ఎక్కువగా ఉన్న సీట్లనే రిజర్వ్ చేస్తారనేది కూడా ఓ ఊహ మాత్రమే… లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు కావచ్చు తొలిసారి… తరువాత ప్రతి అయిదేళ్లకు ఓసారి రొటేట్ చేస్తారు… అంటే అన్ని సీట్లకూ ఒక్కసారి రిజర్వేషన్ వర్తించాలంటే 15 ఏళ్లు పడుతుంది…

Ads

ఇదుగో ఇన్నిరకాల అడ్డంకులున్నయ్… కేంద్రం ఇచ్చిన క్లారిటీ చదివి, విని, నాలుక కర్చుకుని పోస్టులు మడతేస్తున్నారు చాలామంది… అబ్బే, ఇప్పుడే కాదట అని సన్నాయినొక్కులు స్టార్ట్ చేశారు… వేరే కథనాలను పబ్లిష్ చేస్తున్నారు… టీవీలయితే మరీ అరాచకం… గంట గంట బులెటిన్‌కూ మార్పు… ఐనా టీవీ చానెళ్లకు క్రెడిబులిటీ సమస్యేముంది..? వాటిని ఎవరైనా నమ్ముతుంటే కదా… హలో… కేసీయార్, కేటీయార్, హరీష్ స్థానాాలకు వచ్చిన రిజర్వేషన్ల ముప్పేమీ లేదు ఇప్పుడు… నిక్షేపంగా పోటీచేస్తారు… వాళ్ల సొంత స్థానాల్లోనే…!! ప్లస్ కామారెడ్డి వంటి అదనపు సీట్లలో సహా..!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions