నాన్నా, సింహం గుంపుగా వస్తుంది! లయన్ ది కింగ్ ఆఫ్ ది జంగల్
నాన్నా, సింహం సింగిల్‌గా వస్తుంది, పందులే రా గుంపుగా వస్తాయి…- సూపర్ స్టార్ రజినీకాంత్, శివాజీ సినిమా!
ఇది ఎంత చెత్త డైలాగ్ అంటే! దీంట్లో కనీసం వీసమెత్తు వాస్తవం కూడా లేదు! అసలు ఈ ఉపమానం మనుగడలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ, సింహం ఒంటరిగా నడవదు! అది ఎప్పుడూ తన సహచరులతో గుంపుగానే తిరుగుతుంది! సింహాల సమూహాన్ని ఇంగ్లీష్ లో లయన్స్ ప్రైడ్ [LionsPride] అని పిలవడం కద్దు! మగ సింహం నేతృత్వంలో అవి అరణ్యంలో ఒక బృందంగానే వేటాడుతాయి, అన్నీ కలిసే ఆ ఆహారాన్ని ఆరగిస్తాయి! సింగిల్ గా దాడి చేసే శక్తి, సామర్థ్యాలు కలిగి ఉన్నా, సింహం అలా చేయదు, సమయం చూసి పంజా విసురుతుంది!
Ads
ఒకరకంగా, ఈ సోలో థియరీ కాన్సెప్ట్ పెద్దపులి [Panthera Tigris] కి బాగా నప్పుతుంది! పులి అడవిలో ఒంటరిగానే తిరుగుతుంది! ఫిరమోన్ అనే హార్మోన్ విసర్జిస్తూ వెళ్తూ పెద్దపులి తన తన ఏరియా సరిహద్దుల్ని తనే విస్తరిస్తుంది… ఆ పరిధిలో తనదే రాజ్యం… ఆ పరిథిలో ఉన్న ఆడ పులులు అన్నీ దాని సొంతం! తన భౌగోళిక హద్దుల్లోకి వేరే పులి ప్రవేశిస్తే, భీకర యుద్ధమే! రెండిట్లో ఏదో ఒకటే బతికి ఉండాలి, రెండవది చచ్చి తీరాల్సిందే! పులి మాటేసి శత్రువు [Enemy] లేదా ఆహారం [Prey] పై ఆకస్మికంగా దాడి చేస్తుంది!
సరే, ఇవాళ ఫోకస్ కేవలం సింహం [Leo] మీదనే! మన దేశంలో గుజరాత్ రాష్ట్ర పరిసరాల్లో, గిర్ అభయారణ్యం [Gir National Park] లో మాత్రమే సింహాలు ఎక్కువగా కనిపిస్తాయి. బైనామియల్ నామెన్క్లేచర్ [Binomial Nomenclature] ప్రకారం ఆసియాటిక్ లయన్, ఫీలడీ [Felidae] కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయనామం [Scientific Name] పాంథెరా లియో [PantheraLeo]. శిష్ట వ్యావహారిక భాషలో మోటుగా, ఇది పిల్లి జాతికి సంబంధించింది అనొచ్చు!
సింహం రోజులో 16 నుంచి 20 గంటలు నిద్రపోతుంది! గగన వీధిలో డేగ రాజైతే, అడవిలో సింహం రారాజు! నిజం చెప్పాలంటే అరణ్యంలో సింహం కంటే పెద్దవి, బలమైనవి, తెలివైన జంతువులు ఎన్నో ఉన్నాయి! అంతెందుకు, పెద్దపులి, హైనాలు సైతం ఫారెస్ట్ లో తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి! ఐనా, ఏ జంతువుకూ దక్కని గౌరవం, హోదా ఒక్క సింహానికి మాత్రమే దక్కింది!
ఐతే, సమూహంలో నడచినా మగ సింహం తనదైన రాజసాన్ని, ఠీవీని ప్రదర్శిస్తుంది! గుంపు మధ్యలో అది వ్యవహరించే తీరు, అనుసరించే వ్యూహాలు, అవలంభించే వైఖరి దాని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం చేస్తుంటాయి! అడవి అంతా నాదే అన్నట్లు, ఎక్కడైనా సంచరించడం సింహం ప్రధాన లక్షణం! మృగరాజు అడవిలో ఏ జంతువును ఐనా వేటాడి తింటుంది! కానీ, దాన్ని మరే జంతువూ వేటాడలేదు! దట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది లయన్! ఒక రాజులాగే సింహం కూడా తన వారసుడిని ఎన్నుకుంటుంది! తాను ముసలిదై, తన ఆధిపత్యాన్ని కొల్పోతుంటే సమూహంలో మరొక సమర్థవంతమైన సింహానికి ఆ నాయకత్వ బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకుంటుంది!
సింహం పోకడ లేదా ధోరణి [Attitude] లో రాజసం ఉట్టిపడుతుంటుంది! దిక్కులు పిక్కటిల్లే సింహగర్జన, గంభీరమైన నడక, శక్తివంతమైన పంజాదెబ్బ వాటికి మాత్రమే ఉండే విలక్షణమైన లక్షణాలు! ఇక, మగ సింహాల మొహాలపై ఉండే సహజమైన జూలు అచ్చం రాజులు ధరించే కిరీటాన్ని తలపించడం మరో ఆకర్షణ! అందుకే, అది రారాజు, మృగరాజు, కింగ్ ఆఫ్ ది జంగల్‌గా మశూర్! ఇవ్వాళ World Lion Day…. Suraj V Bharadwaj
Share this Article