పురాణాల్లోని అనేకానేక అంశాలకు బాష్యం చెప్పడంలో, వివరణ ఇవ్వడంలో, సందేహ నివృత్తిలో ఉషశ్రీ పేరు చెబుతుంటారు… ఒక ప్రవచనం గురించి ఉదహరించాలంటే చాగంటి పేరు చెబుతుంటారు… అవధానం ప్లస్ ప్రవచనం గరికపాటి ఫేమస్… వీళ్లే కాదు, బోలెడుమంది ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటారు… అసలు దైవసంబంధ, మతసంబంధ అంశాల్ని అరటిపండు ఒలిచినోట్లో పెట్టినట్టుగా చెప్పడం ఓ కళ…
పిట్టకథలు, సరస సంభాషణలు, చమక్కులు, నడుమ నడుమ పద్యాలు, పాటలు, రాగాలతో కొందరు భలే రంజింపజేస్తారు, రక్తికట్టిస్తారు… ఇప్పుడంటే హరికథల్లేవు కానీ ఒకప్పుడు ఆ కథలు చెప్పేవాళ్లు అభినయం, గానం, అర్థవివరణలతో కథను వినిపించేవాళ్లు… ఇవి పండాలంటే కాస్త విద్వత్తు అవసరం… కాదు, ముందుగా విజ్ఞత అవసరం… చిన జియ్యర్ వంటి స్వాములకు లేనిదే అది… అబ్బే, సమ్మక్క-సారలమ్మ గురించి ఆయన కూసిన కూతల గురించో, శివుడిని పూజించబోమనే పెడసరపు ధోరణుల గురించో, ఇతర వివాదాల గురించో చెప్పడం లేదు…
ఏ ఆధ్యాత్మిక వ్యాప్తి ఆయన అధిష్టించిన పీఠం ప్రధాన బాధ్యతో… అందులోనే తనకు నైపుణ్యం లేదు, అసలు దానిపై తనకు ప్రేమ లేదు, ఏమీ తెలియదు అని చెప్పడానికి సాహసిస్తున్నా… నేనేమిటి..? ఈ పిచ్చి వ్యాఖ్యానం చూస్తే మీరు కూడా అదే అంటారు… రామానుజ పీఠంపై జాలి కూడా కలిగే అవకాశం కూడా కలదు…
Ads
మధ్యమధ్యలో ఎందుకు నవ్వుతాడో తెలియదు… ఇంతకీ తను ఏమంటాడంటే… ‘‘రావణాసురుడు అంటే శివుడికి భలే ప్రేమ… మిత్రుడిగా మార్చుకున్నాడు… ఎందుకు మిత్రుడయ్యాడో తెలుసా..? శివుడు ఎప్పుడూ పార్వతిని ప్రసన్నం చేసుకోవడానికి నాట్యం తదితర ప్రయత్నాలు చేస్తాడు… ఆయన ఓసారి సరససల్లాపాల్లో ఉండగా, భీకర తపస్సు ముగించుకుని రావణుడు కైలాసాన్ని ఊపేస్తానంటూ వచ్చాడు… ఊపాడు…
కైలాసాన్ని కదిపే ప్రయత్నం చేసి, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడ్డాడు… కాస్త దూరంగా ఉన్న పార్వతి ఈ కదలికలతో ఒక్కసారిగా వచ్చి శివుడిని వాటేసుకుంది… సాధారణంగా మగవాళ్లు వెళ్లి ఆడవాళ్లను వాటేసుకోవడం పరిపాటి… అలాంటిది పార్వతి వెళ్లి వాటేసుకోవడం ఇర్రెగ్యులర్… దీంతో శివుడు పరవశించి పోయాడు… ఆనందం పట్టలేకపోయాడు… ఆమె తనంతట తనే వచ్చి వాటేసుకోవడానికి కారణం రావణాసురుడు అని తెలిసి… పార్వతి వచ్చి తనను వాటేసుకోవడానికి కారకుడయ్యాడు కాబట్టి రావణాసురుడి మీద అభిమానం పొంగింది… తరువాత నీతో మంచి మిత్రుడిగా ఉంటాను అని రావణాసురుడికి చెప్పాడు…’’
పరమ వెగటుగా ఉంది కదా ఈ భాషణం..? గాత్ర శుద్ధి, సందర్భ శుద్ధి, జ్ఞాన శుద్ధి, ప్రసంగ శుద్ధి, వాక్ శుద్ధి అనగా ఏమిటో తెలుసా స్వామీ తమరికి..? హేమిటేమిటి..? తాండవం వంటి శివనృత్యాలు పార్వతిని ప్రసన్నం చేసుకోవడానికా..? రావణాసురుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కైలాసాన్ని ఎత్తి ఊపేస్తాడా..? ఊపేయడానికే కైలాసానికి వస్తాడా..? మగవాళ్లు వెళ్లి ఆడవాళ్లను వాటేసుకోవడం పరిపాటా..? పార్వతి వెళ్లి శివుడిని వాటేసుకోవడం ఇర్రెగ్యులరా..? దాంతోనే శివుడు పరవశించిపోయి, కారకుడైన రావణాసురుడిని మిత్రుడిగా చేసుకున్నాడా..?
ఇంత బేకార్ ప్రవచనం బహుశా ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండడు… స్వామీ చిన్న కోరిక… ఇది ఎప్పటి వీడియో అనేది తెలియదు… ఐనాసరే, తమరి అద్భుతమైన, అబ్బురపరిచే విద్వత్తుకు ఈ మచ్చుతునక చాలు కదా… దయచేసి మీరు ప్రసంగాలు, ప్రవచనాలు మానేయండి ప్లీజ్… వైష్ణవానికి అదే మీరు చేయగల గొప్ప సేవ… ఏదో సందు దొరికింది కదాని ఇదేమీ రాయడం లేదు… నిజంగానే చెత్తా ప్రవచనం, చెత్తా బాష్యం స్వామీ…!!
Share this Article