Prasen Bellamkonda…… మరణంలోని అక్షరాలను పేరులోనే పెట్టుకుని దర్జాగా బతికిన మనిషి ఆయనకు మరణమా….
నమ్మకం కుదరక పోవచ్చు కానీ నేను కొన్ని వందల సార్లు చదివిన పుస్తకం శ్రీ రమణ పేరడీలు. నిజం… కొన్ని వందల సార్లు. 80 వ దశకం మొదట్లో అప్పుడప్పుడే తెలుగులో సీరియస్ రచయితలు, కవులనందరినీ చదివిన హాంగోవర్లో ఉండడం వల్ల వాళ్లందరినీ శ్రీ రమణ అనుకరించిన పద్ధతి నాకు అతి పెద్ద ఆశ్చర్యం. ఒక వింత. ఒక మేజిక్. ముఖ్యంగా ప్రేమలేఖలు విభాగం..
Ads
మో ప్రేమలేఖ వందోసారి చదివి కూడా నవ్వాపుకోలేదు… అది ప్రేమలేఖ అని అర్ధమైతే కదా ఆమె ప్రేమించడానికి అంటాడు రమణ. సంజీవదేవ్ ప్రేమ లేఖ ఎంత గొప్పగా ఉంటుందో… కృష్ణ శాస్త్రిదో సంజీవదేవ్ దో గుర్తులేదు కానీ ఇలా రాసాక ఎవరైనా ప్రేమించకుండా ఎలా వుంటారు అంటాడు రమణ…
చలం, రావి శాస్త్రి, శ్రీ శ్రీ ఇంకా బోలెడంత మంది మహా మహా రాతగాళ్ళను రమణ రిరైట్ చేసిన వాక్యాలు చదివితే ఇంత మందిని ఇంత పర్ఫెక్ట్ గా అనుకరించడం మానవ మాత్రులకు సాధ్యమా అని ఘాతానికి గురవుతాం. ఆ పుస్తకం నిండా ఇలాంటి ఘాతాలే. రైలులో ప్రయాణం అనే సన్నివేశాన్ని ఎవరెవరు ఎలా రాస్తారు, నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించినపుడు జరిగే కవిసమ్మేళనం అన్నీ అద్భుతాలే.
మిధునం లాంటి ఆయన ఇతర రచనలు తక్కువవేం కావు కానీ నాకైతే రమణంటే పేరడీలే.
Share this Article