నిన్నామొన్నటి పూనం పాండే ఎపిసోడ్ నగ్నంగా బయటపెట్టిన ఒక నిజం ఏమిటంటే… మీడియా తన క్రెడిబులిటీని పూర్తిగా కోల్పోయిందని… నిజానిజాల వెరఫికేషన్, క్రాస్ చెక్ లేకుండానే వార్తల్ని జనంలోకి గుప్పిస్తున్నారని… సెన్సేషన్ తప్ప ప్రస్తుతం మీడియాకు ఏమీ పట్టదని… మన దయ, ప్రజల ప్రాప్తం అన్నట్టుగా వార్తలు వండబడుతున్నాయని… ఇలా నానారకాల నష్టం…
నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిజాలేమిటో తెలియకుండా వార్తల్ని వడ్డిస్తోంది… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొత్తపలుకులో రాధాకృష్ణ రాసుకున్న ఓ సుదీర్ఘ వ్యాసం… సరే, అందులో జగన్ కుటుంబ తగాదాల్ని, షర్మిల మీద జగన్ సోషల్ బ్యాచ్ వికృత దాడి ఎట్సెట్రా చాలా అంశాలున్నయ్… వాటి జోలికి ఇక్కడ పోవడం లేదు… ఎవరూ శుద్ధపూసలు కారు… ఇదే షర్మిల మీద టీడీపీ బ్యాచ్ గుమ్మరించిన బురద ఏమైనా తక్కువా..?
అయితే సాధారణ జర్నలిస్టులో, జూనియర్లో కాదు… ఏకంగా రాధాకృష్ణ తప్పులు రాస్తే (ఫాక్చువల్ ఎర్రర్స్) ఏమనుకోవాలి..? తను ఒకప్పుడు ఫీల్డ్ జర్నలిస్ట్… ఇప్పుడు ఓ టీవీ చానెల్‌కు, ఓ పత్రికకు ఓనర్… ఓ పెద్ద పార్టీకి ప్రధాన సలహాదారు… ఒక ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు… ఏదైనా రాస్తే ఎంత క్రెడిబులిటీ ఉండాలి..? అబ్బే, అవన్నీ పట్టించుకుంటే ఆయన రాధాకృష్ణ ఎందుకవుతాడు అంటారా..? ఒకటి ఈరోజు రాసుకున్న వ్యాసంలోని ఓ అంశాన్ని తీసుకుందా… యథాతథంగా…
Ads
‘‘నిజానికి విమల ఒక దళితుడిని వివాహం చేసుకున్నారు. అయినా, ఆమె తన ఇంటి పేరును వైఎస్ గానే చెప్పుకొంటున్నారు. ‘వైఎస్ విమలారెడ్డి’గానే చెలామణి అవుతున్నారు. విమలకు ఒక రూల్, షర్మిలకు మరో రూల్ ఎందుకు? విమలకు వివాహం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఇంత సంపద లేదు. అయినప్పటికీ తమ ఏకైక సోదరి విమలకు హైదరాబాద్‌లో ఒక పెద్ద ఇల్లును, విజయవాడలోని రాజ్–యువరాజ్ థియేటర్లలో వాటాను రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆనందంగా పంచి ఇచ్చారు. రాయలసీమ సంస్కృతి అంటే ఇదీ! అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?’’
జగన్‌ను తిట్టిపోయడానికి సందు దొరకడమే కాదు… సందులు చూసుకుని మరీ జొరబడుతూ తిట్టేస్తున్నాడు… సరే, తన పత్రిక తన ఇష్టం… జగన్‌కు ఏమీ చేతకావడం లేదు అనుకుందాం… కానీ ఇక్కడ తప్పులు ఏమిటంటే..? వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకైక సోదరి విమలారెడ్డి పెళ్లి చేసుకున్నది దళితుడినీ కాదు, పేదవాడినీ కాదు… ఆమె భర్త పేరు కోటిరెడ్డి… ఆ పెళ్లి జరిగేనాటికి వైఎస్ కుటుంబం పెద్ద స్థితిమంతులు కూడా కాదు… కాకపోతే రెండు థియేటర్లను తన సోదరికి ఇచ్చాడనేది కరెక్టే…
నిజానికి వైఎస్ కుటుంబంలో దళితుడిని పెళ్లి చేసుకున్నది వైఎస్ రాజారెడ్డి చెల్లెలు రాజమ్మ… అప్పటికి రాజారెడ్డి కుటుంబానికి పెద్దగా ఆస్తులేమీ లేవంటారు… ఆమె కొడుకులే మైఖేల్, క్రిస్టోఫర్ అనుకుంటా… క్రిస్టోఫర్ అంటే వైఎస్ పీరియడ్‌లో ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా చేశాడు… మొన్న జగన్ అమరావతి మీద వేసిన ఓ కమిటీలో కూడా ఉన్నాడని గుర్తు… మరి విమల దళితుడ్ని పెళ్లి చేసుకున్నదీ అని కళ్లుమూసుకుని రాయడం దేనికి..? అబ్బే, రాధాకృష్ణ రాతల్లో కూడా నాణ్యత వెతకడం ఏమిటి మాస్టారూ అంటారా..? సర్లెండి…!!
Share this Article