Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ ముదురుతోంది… మూడో ప్రపంచ యుద్దం వైపు… ఇదీ తార్కాణం…

November 22, 2024 by M S R

.

రష్యా ICBM తో ఉక్రెయిన్ మీద దాడి చేసింది! అంటే వ్యవహారం బాగా ముదిరిపోయిందీ అని లెక్క…

ఉక్రెయిన్ ATACMS, STORM SHADOW మిసైళ్ళ తో రష్యా మీద చేసిన దాడికి ప్రతీకారంగా రష్యా ICBM తో ప్రతిదాడి చేసింది!

Ads

రష్యా ప్రయోగించిన ICBM ని RS – 26 RUBEZH గా గుర్తించారు!

ICBM దాడి చేసింది ఉక్రెయిన్ లోని DNIPRO అనే నగరం మీద. డ్నిప్రో నగరం ఉక్రెయిన్ ఫ్రoట్ లైన్ దళాలు ఉన్న చోటు నుండి 100 km దూరంలో ఉంది!

RS -26 ICBM (Inter Continental Ballistic Missile ) ని MIRV (Multiple Independently Reentry Vehicle ) టెక్నాలజీతో ప్రయోగించింది!

రష్యాలోని అస్త్రఖాన్ (Astrakhan ) నుండి ICBM RS – 26 ని ప్రయోగించింది.

అస్త్రఖాన్ నుండి డ్నిప్రో నగరం మధ్య దూరం 1000KM లు. RS -26 ICBM రేంజ్ 5,500 KM. అసలు ICBM అంటే అంటే ఖండాంతర క్షిపణి అని అర్ధం!

కానీ రష్యా తన పొరుగు దేశం మీద ICBM ని ప్రయోగించడం మీద విమర్శలు వస్తున్నాయి.

ICBM RS -26 తో పాటు రష్యా 5 హైపర్ సానిక్ మిసైల్స్ కూడా ప్రయోగించింది! అయితే హైపర్ సానిక్ మిసైల్స్ ని ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద ప్రయోగించింది!

RS – 26 మొత్తం 6 వార్ హెడ్స్ తో ప్రయోగించింది రష్యా! అయితే ఇవి మామూలు ఎక్సప్లోసీవ్స్ ని కలిగి ఉన్నాయి!

అదే అణు వార్ హెడ్స్ కనుక ప్రయోగించి ఉంటే?

రష్యా అంత తెలివితక్కువగా ICBM RS -26 ని ప్రయోగించిందా?

లేదు. R-7 ICBM ని మొదటిసారిగా పరీక్షించింది MAY 17,1957 లో. అది మొదటి టెస్ట్ ఫ్లైట్!

1957 నుండి టెస్ట్ కోసం ప్రయోగాలు జరిగాయి కానీ ఏకంగా నిజమైన శత్రు టార్గెట్ మీద జరిగింది ఇదే మొదటిసారి!

ICBM తో పాటు MIRV వార్ హెడ్స్ ని శత్రు దేశం మీద ప్రయోగించడం కూడా ఇదే మొదటి సారి!

So! రష్యా ICBM తో పాటు MIRV ని కూడా నిజమైన టార్గెట్ మీదకి విజయవంతంగా ప్రయోగించింది!

డ్నిప్రో నగరంలో ఉన్న మిసైల్ తయారీ ఫాక్టరీల మీద ICBM R-26 దాడి చేసి ధ్వంసం చేసింది!

What next?

ఇక్కడితో ఆగకుండా మళ్ళీ రెచ్చగొడితే ఈసారి మామూలు ఎక్సప్లోసివ్స్ స్థానంలో అణు బాంబులని అమర్చి ప్రయోగిస్తుంది!

రష్యా మొత్తం మూడు లక్ష్యాలని సాధించింది!

1.67 ఏళ్ళ క్రితం టెస్ట్ చేసినవి ఇంకా పనిచేసే స్థితిలో ఉన్నాయా లేవా అన్నది తెలుసుకుంది.

2.MIRV టెక్నాలజీ తనకి నిర్దేశించిన టార్గెట్స్ ని కొట్టాయా లేదాని తెలుసుకున్నది.

3. GLONASS ( Global Navigation Satellite System ) అనేది అమెరికన్ GPS తో సమానమైంది!
GLONASS సిస్టమ్ బాగానే పనిచేసింది!

ఇలాంటి ఫీట్ ని ఏ దేశం కూడా సాధించలేదు ఇప్పటి వరకూ. మంచికో చెడుకో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాకి అవకాశం ఇచ్చాయి!

అసలు రష్యాకి భయపడేది కుప్పలు కుప్పలు గా పడి ఉన్న ICBM లు అణు వార్ హెడ్లతో ఉన్నాయనే!
అవి సక్రమంగా పనిచేస్తున్నాయని నిరూపితం అయ్యింది!

రష్యన్ RS-26 ICBM MIRV అది ప్రయాణించిన మార్గం, ఎంత సమయంలో లక్ష్యాన్ని చేరుకుంది అనే విషయాలని అమెరికన్ నిఘా ఉపగ్రహాలు రికార్డ్ చేసే ఉంటాయి ఎందుకంటే వాటి పని అదే!

*******
అంతా విష్ణు మాయ!

ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు హమాస్ కి 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ బయటపడ్డది! డాలర్లు ఖతార్ దేశంలోని నెతన్యాహు అకౌంట్ల నుండి హమాస్ ముఖ్య నాయకుల ఖాతాలలోకి బదిలీ అయినట్లు బాంక్ స్టేట్మెంట్లు బయటికి వచ్చాయి!

ఉక్రెయిన్ కి అమెరికా దాని మిత్ర దేశాలు ఇచ్చిన ఆయుధ, ఆర్ధికసహాయం పేపర్ల మీద ఉన్నదొకటి అసలు ఇంకొకటి. కనీసం 500 బిలియన్ డాల్లర్లకి రెక్కలొచ్చాయి!

అందుకే చివరి నిమిషంలో అమెరికా ఉక్రెయిన్ కి తమ మిసైల్స్ ని రష్యా మీద ప్రయోగించమని అనుమతి ఇచ్చింది.

జో బిడెన్ అధికారంలోకి వచ్చాకే ఉక్రెయిన్ నాటోలో చేరిక అంశం తెరమీదకి వచ్చి రష్యా యుద్దాన్ని మొదలుపెట్టింది. 2022 నుండి ఇప్పటి వరకూ ఉక్రెయిన్ కి ఎన్ని ఆయుధాలు ఇచ్చింది? ఆర్ధిక సహాయం చేసింది ఎంత? ఈ విషయాలు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బయటపడతాయి. అప్పటి వరకూ యూరోపు , ఇటు రష్యా అణు బాంబులతో అటు తీవ్రమైన చలితో వణుకుతూ ఉండాల్సిందే!

పొలాండ్, స్వీడన్ దేశాలు ఇప్పటికే తమ ప్రజలని అప్రమత్తం చేస్తున్నాయి మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నది అంటూ!…………..( పొట్లూరి పార్థసారథి )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions