చిరంజీవి పాట అంటే అతి పవిత్రం… అది ఎవరితో రాయబడినా, అందులో ఏమున్నా సరే, ఎవరూ ఏమనకూడదు..? అలా ట్రీట్ చేస్తుంటారు… కానీ కోపం, ఏవగింపు పరిధులు దాటితే చిరంజీవి పాటయితేనేం, మరొకటయితేనేం ప్రేక్షకులు, నెటిజనులు ఈడ్చికొడతారు… ఎస్, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఓ దరిద్రమైన వ్యక్తీకరణ అనే భావన వ్యాప్తి చెందుతోంది… ప్రత్యేకించి తనేం రాస్తున్నాడో తనకే అర్థం కాని చంద్రబోస్ కక్కిన అజ్ఞానం మీద చర్చ మొదలైంది…
ఆ పాట రచనే కాదు, గాయకుడితో కూడా ఘోరంగా పాడించాడు సంగీత దర్శకుడు… నిజానికి ఇందులో ఎక్కడా చిరంజీవి తప్పు లేదు… కానీ చిరంజీవి పాట అంటే దానికి ఫుల్ రీచ్ ఉంటుంది, జనంలోకి విపరీతంగా వెళ్తుంది… పైగా పాటల పట్ల చిరంజీవి కీన్‌గా ఉంటాడు… మరి ఈ పాట ఇంత నాసిరకం స్థితిలో ఎలా బయటికొచ్చింది..? ఇదీ ప్రశ్న… రెండురోజుల క్రితం ‘ముచ్చట’ అడిగింది కూడా ఇదే… ప్రేక్షకులంటే మరీ అంత లోకువ అయిపోయారేం చంద్రబోస్ అని ప్రశ్నించింది… ఇదీ లింక్… చంద్రబోసూ… శివుణ్ని మరీ గుడ్డికన్నోడా అని తిట్టేశావేంటి మహాశయా…
తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే …
Ads
అంటూ వూటుకూరు జానకిరామారావు అనే సోషల్ మీడియా నెటిజెన్ ఓ పోస్టు పెట్టాడు… దీన్ని ప్రఖ్యాత రచయిత Yandamoori Veerendranath షేర్ చేస్తూ ఇలా రాశాడు… ‘‘(ఈ post చదివాక నాక్కూడా అర్థం కాలేదు సార్. ఇద్దరు ముగ్గురు పండితులని అడిగాను. తెల్లమొహం వేశారు. ( ఫోన్లో మొహం తెలియలేదు అనుకోండి). తెలిసిన ఇద్దరు సినీ రచయితలతో చర్చించాను. తెలియదన్నారు. మరో మిత్రుడు… “సరైన పదాలు పడలేదు కానీ, బీడీ తాగే హీరో… తుఫాను అంచున తపస్సు చేసే, అంటే ఎంత కల్లోల పరిస్థితుల్లోనయినా, శాంతంగా వశిష్ఠుడిలా తపస్సు చేస్తాడు. మూడో కన్ను లేని, శివుడనీ… అనుకోవచ్చు” అన్నారు.
ఇక్కడ యండమూరి అధిక్షేపణ కూడా చిరంజీవి మీద కాదు… ఆ పాట రాసిన చంద్రబోస్ మీద… తన అజ్ఞానపు రాతల మీద… సదరు వూటుకూరు జానకిరామారావు విమర్శ కూడా తనపైనే… చంద్రబోస్ పెద్దగా స్పందించకపోవచ్చు, ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఉన్నతరువాత ఎలాగూ కాస్త మొద్దుబారి ఉంటాడు కదా, సారీ, రాటుదేలి, నాటుగా మారిపోయి ఉంటాడు… ఆఫ్టరాల్, యండమూరి వంటి ఒకప్పటి ‘‘ఆండ్రోపాజ్’’ రచయితలకు నేను జవాబు ఇవ్వడం ఏమిటి అనుకుంటాడేమో… పోనీ, అనంత శ్రీరాం గాలికిపోయే కంపను డ్యాష్‌కు తగిలించుకునే తత్వం ఉంది కదా, ఏమైనా స్పందిస్తావా తిమిర నేత్రా..!! (ఐదేళ్ల క్రితం యండమూరిని నాగబాబు సంస్కారం లేని మూర్ఖుడు అని తిట్టడం, చిరంజీవి తనని వెనకేసుకుని రావడం గుర్తుంది కదా… గరికపాటి ఇష్యూలాగే… అందుకని యండమూరి తాజా సెటైర్స్ వార్తాంశం అయ్యింది…)(ఈ కథనం రాసే సమయానికి యండమూరి పోస్ట్ లైవ్ గానే ఉంది)
Share this Article