Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రసేన్‌కు పెన్ను బాకీ… నాకేమో యండమూరి పాత పెన్ను బహుమతి…

November 17, 2022 by M S R

Bp Padala …….. Prasen Bellamkonda గారు తన పోస్టులో యండమూరి గారు తనకు పెన్ ఎలా బాకీ ఉన్నారో సరదాగా రాసారు . ఈ ఉదంతం చదివిన తర్వాత యండమూరి గారు తన పెన్ నాకిచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది . 1997 లో అనుకుంటా సాయి గారు ‘రచన’లో ప్రముఖ రచయితల కొత్త కథలు పేరు లేకుండా అచ్చువేసి పాఠకులను ‘ఆబ్జెక్టివ్ ‘గా( పేరు ఉంటే అభిమాన రచయితల పట్ల పక్షపాతంతో రాస్తారని) విమర్శలను రాయమని అడిగేవారు . అందులో భాగంగా ఓ నెల ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నేపథ్యంలో (కథ పేరు ‘యుగాలు మారినా “అని గుర్తు ) ఉల్లిగడ్డ వ్యాఖ్యానంతో చాలా గమ్మత్తు కథ ఒకటి ప్రచురించారు .

అప్పటికే యండమూరి సీరియల్స్ తో పాటు ఆయన నవలన్నీ నమిలి మింగేసిన అనుభవంతో శైలిని , రైటర్స్ వర్కుషాపులో ఒకటి రెండు సార్లు ఆయనను కలిసి ఉండటంతో సులభంగానే రచయిత పేరును ఊహించాను . ముఖ్యంగా స్త్రీవాదులపై ఆ కథలో ఉన్న ఆయన ట్రేడ్ మార్క్ సెటైర్లు ఆయన్ని పట్టిచ్చాయి .

ఎంత ఇష్టమైన రచయిత అయినా సాయి గారి స్పిరిట్ భంగపడకుండా, కాస్త సునిశిత విశ్లేషణ మొహమాటం లేకుండా చేశాను . అయితే ఆశ్చర్యకరంగా 116 రూపాయలు ఇచ్చే ప్రథమ , ద్వితీయ బహుమతులు కాకుండా , ప్రత్యేక బహుమతి అనే కేటగిరీలో ప్రచురించారు . ప్రత్యేక బహుమతిని అందుకోవటానికి రచన ఆఫీసుకి రావాలని సాయి గారి కార్డు పిలుపు . విద్యానగర్ లోని రచన ఆఫీస్ లోకి వెళితే , బుగ్గన త్రివేణి వక్కపొడితో ఒక సిగరెట్ దమ్ము లాగి, నన్ను కాస్త ఆశ్చర్యంగా చూసి ‘కుర్రోడివే ‘ అన్నారు . నా బిడియపు నవ్వే సమాధానం .

Ads

టేబుల్ సొరుగులోంచి ఓ వాడిన పెన్ను తీసి నాకు అందించారు ” యండమూరి నీ విశ్లేషణకు చాలా సంతోషించి ఈ పెన్ పంపించారోయ్ ” అంటూ . ఈ పాత పెన్ ప్రత్యేక బహుమతి ఏంటో , ఇంత దూరం రప్పించడం ఏంటో అర్ధం కాక బుర్ర గోక్కున్నాను మనసులో .

విషయం ఏంటంటే ఏ కథనయితే నేను విమర్శించానో అదే కథను ఈ పెన్ తో రాశారు యండమూరి గారు . ఎన్ని 116 లు ఇస్తే దాని ఎత్తు తూగుతుంది… కుర్రోడిని కదా ఓ వారం రోజుల పాటు పెన్ ని నా బెడ్ పక్కనే పెట్టుకున్నాను ఎక్సయిట్మెంట్ తో … ఇంకా భద్రంగా ఉంది ఆ పెన్ నా దగ్గర , 25 సంవత్సరాల తర్వాత కూడా . థాంక్ యు మాష్టారు అండ్ హ్యాపీ బర్త్ డే మరో సారి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ట్రంపరి వేషాలతో… నాటి జార్జి ఫెర్నాండెజ్ మళ్లీ గుర్తొస్తున్నాడు…
  • ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!
  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)
  • ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న అణు వార్‌హెడ్స్ అమెరికావే..! (Part-1)
  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions