Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న కృష్ణుడిగా రోహిణి… బాలకృష్ణుడిగా శ్రీదేవి… కృష్ణుడిగా రామకృష్ణ…

August 16, 2024 by M S R

మహా నటుడు SVR , జమునల సినిమా ఇది . 1975 లో వచ్చిన ఈ యశోద కృష్ణ సినిమాయే మహానటుడు యస్ వి రంగారావుకి ఆఖరి తెలుగు సినిమా కావటం దురదృష్టం . ఇంతటి మహానటుడు , ఏ పాత్రనయినా అలవోకగా నటించగల నటుడు మరొకరు లేరని చెప్పవచ్చు .

వసుదేవుడు , దేవకీదేవిల వివాహంతో ఆరంభమయి , శ్రీనివాస కల్యాణంతో ముగుస్తుంది సినిమా . భారతీయ సంస్కృతిలో పురాణాలకు , ఇతిహాసాలకు ప్రధాన స్థానం ఉంది . ఎన్ని వందల వేల నాటకాలు , సినిమాలు వచ్చినా ప్రేక్షకులు తనివితీరా చూస్తూనే ఉంటారు . కాస్త బాగా తీసినా చూస్తారు . బాగా తీస్తే కనకవర్షం కురిపిస్తారు .

NTR , అంజలీదేవిలు నటించిన లవకుశ సినిమా దర్శకులలో ఒకరయిన సి యస్ రావు ఈ యశోద కృష్ణ సినిమాకు దర్శకుడు . కొంచెం బాగుంటుంది కొంచెం బాగోదు . కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయిందో నాకు గుర్తు లేదు . ఇప్పుడు బాహుబలి వంటి సినిమాల్లో నటిస్తున్న సీనియర్ నటి రోహిణికి అయిదారేళ్ళ బాలనటిగా ఇదే మొదటి సినిమా .

Ads

చిన్ని కృష్ణుడిగా రోహిణి , బాల కృష్ణుడిగా శ్రీదేవి , కృష్ణుడిగా రామకృష్ణ నటించారు . శ్రీవిద్య , మంజుల , రాజనాల , ప్రభాకరరెడ్డి , చంద్రమోహన్ , కృష్ణకుమారి , శ్రీధర్ , గుమ్మడి , యస్ వరలక్ష్మి , ధూళిపాళ , రాజశ్రీ ప్రభృతులు నటించారు . కంస సభలో నాట్యం చేసే జంటలో ఒకరిగా మంజు భార్గవి తళుక్కుమంటుంది .

తిరుపతి వెంకటేశ్వర స్వామి తన వివాహానికి కుబేరుడి వద్ద కోటి పధ్నాలుగు లక్షల వరహాలను అప్పుగా తెచ్చుకొన్నట్లు ఈ సినిమాలో గోవింద రాజ స్వామి డైలాగ్ ఉంటుంది . ఆరుద్ర నేసిన ఈ సినిమా కధకు సంగీత దర్శకత్వం యస్ రాజేశ్వరరావుది . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సందర్భోచితంగా , ఆహ్లాదకరంగా ఉంటుంది . పాటలు ఆయన లెవెల్లో హిట్ కాలేదు అని అనిపిస్తుంది . థియేటర్లో చాలా శ్రావ్యంగా ఉంటాయి .

SVR కే అంకితం చేయబడిన ఈ సినిమా తమిళం , కన్నడం , హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేయబడింది . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . టివిలో లెక్కలేదు . పండగలప్పుడు ఏదో ఒక చానల్లో తరచూ వస్తూనే ఉంటుంది . చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . SVR , జమునల అభిమానులు అయితే మరీ తప్పకుండా చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోజూ 2 లక్షల మందికి వండి వడ్డించగల అత్యంతాధునిక వంటశాల
  • బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!
  • మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావి… ఈ నివేదిక చెప్పేదిదే…
  • ఈ నగలు దిగేసుకుంటే చాలు… ‘కళల వధువు’ కావడం ఖాయం..!!
  • చక్ దే ఇండియా..! ఆగిపోయిన ఈ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మళ్లీ కదిలింది..!!
  • అసలు ఆ పాత్రే తనకు నప్పలేదు..! దానికితోడు స్వీయ సమర్పణ..!!
  • ఎవరు విలన్లు..? మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ కథలో మరో ట్విస్ట్..!
  • ఈ వీకెండ్ బిగ్‌బాస్ షో నచ్చింది… రాము రాథోడ్ మరింత నచ్చాడు..!
  • విరోధాభాస…! రాజకీయ భేతాళుడు – ఓ విక్రమార్కుడి పాత కథ…!!
  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions