ఈసారి ఎన్నికల విశ్లేషణల్లో ఖచ్చితంగా తెలుగు మీడియా ప్రస్తావన కూడా రాకతప్పదు… జగన్ ఎంతోకాలంగా చెబుతున్నాడు, తనకు ప్రత్యర్థులు చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు… టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు అని..! సో, ఇప్పుడు జగన్ ఎవరూ ఊహించని రీతిలో మట్టికరిచాడు… సరే, ఇదంతా తన స్వయంకృతమే… ఎందుకు ఓడిపోయాడు, మరీ జనం ఇంతగా ఎందుకు ఛీకొట్టారనే అంశాన్ని ఇక్కడ కాస్త వదిలేస్తే…
తెలుగు మీడియా వ్యవహారశైలి, పోషించిన పాత్ర ముఖ్యం… అబ్బే, మీడియా రాతలకు జనం ప్రభావితమవుతారా..? నిజానికి కావద్దు… గతంలో వైఎస్ గెలవలేదా..? పోయినసారి జగన్ గెలవలేదా..? కానీ పూర్తిగా ప్రత్యర్థి పాత్రలోకి మీడియా దూరిపోయి మరీ కూలకూటాన్ని చిమ్మి మరీ పోరాడటం ఈసారే ఇంత భీకర స్థాయి…
ఎస్, ఈనాడు కోణంలో చూస్తే… ఈనాడు బంధువు నవయుగను జగన్ టార్గెట్ చేశాడు… ఈనాడు ఆర్థికమూలం మార్గదర్శినీ టార్గెట్ చేశాడు… అంతెందుకు సీఐడీ కేసుల్లో ఇరికించిన తను ఒకదశలో రామోజీరావును లిఫ్ట్ చేయాలనీ అనుకున్నాడు… కాకపోతే కేసీయార్ చక్రం అడ్డు వేయడంతో రామోజీరావు బచాయించాడు… లేకపోతే ఈ వయస్సులో తట్టుకోవడం కష్టమయ్యేది…
Ads
గతంలో ఎప్పుడూ లేనంతగా పూర్తిగా బట్టలిప్పుకుని మరీ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసింది ఈనాడు… ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పోరాడింది… హమ్మయ్య, ఇప్పుడు రిలీఫ్… సేఫ్… జగన్ లేడు… మరీ ఘోరంగా మట్టికరిచాడు… తన మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఆంధ్రప్రదేశ్‌లో… ఇటు తెలంగాణలో కేసీయార్ తన ఆత్మీయుడు అయినా సరే, తన చంద్రబాబు సాన్నిహిత్యమున్న రేవంతుడే సీఎం కాబట్టి ఇక్కడా పర్లేదు… రెండు తెలుగు రాష్ట్రాలపై మళ్లీ ఈనాడు జెండా ఎగిరింది… రామోజీరావు నవ్వాడు…
టీవీ5, మహాన్యూస్ వంటి చానెళ్లను కాసేపు వదిలేద్దాం… వాటి రేంజ్ మరీ జగనే పెంచాడు తప్ప ఏముంది..? ఆంధ్రజ్యోతి విషయానికొస్తే అది మొదటి నుంచీ టీడీపీ కార్యకర్తలాగే పనిచేసింది… దాపరికం లేదు, ముసుగులు లేవు… ఇక్కడ కేసీయార్‌తో, ఇక్కడ జగన్‌తో… పడలేదు, ఐనాసరే, రాధాకృష్ణ మొండిగానే నిలబడ్డాడు… చివరకు ఏం జరిగింది..? తనకు చంద్రబాబు ద్వారా సన్నిహితుడైన రేవంతుడు తెలంగాణలో సీఎం… ఇప్పుడు తన పార్టీ గెలిచి, తన చంద్రబాబు సీఎం…
సో, రెండు రాష్ట్రాల్లోనూ ఫుల్లు హేపీగా ఉండి, పండుగ చేసుకుంటున్న ప్రముఖుల్లో రాధాకృష్ణ కూడా ఒకరు… ఈ మీడియాలకు తోడు సోషల్ మీడియా… జగన్ సోషల్ మీడియా విభాగం ఎవరికి ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలియక జగన్‌ను నిండా ముంచింది… ఎందరో మీడియా సలహాదారులు, ఒక్కడూ ఉపయోగపడలేదు, పనిచేయలేదు… బోలెడన్ని యూట్యూబ్ చానెళ్లు, సైట్లను పోషించారు… వీసమెత్తు పాజిటివిటీని పెంచలేదు అవి… జగన్‌ను ప్రశాంత్ కిషోర్ కూడా వదిలేశాడు, డీల్ కుదరక..! దుష్ప్రచారం కూడా చేశాడు… సరే, తన ఐప్యాక్ మాజీ సభ్యుడితోనే (రిషి..?) జగన్ పనిచేయించుకున్నాడు…
చంద్రబాబు ఒకవైపు రాబిన్ సింగ్‌తో (తనూ గతంలో ఐప్యాక్ వ్యవస్థాపక సభ్యుడే) పనిచేయించుకుంటూనే ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా తీసుకున్నాడు… ఇతర దేశాల్లోని చంద్రబాబు అనుకూల సోషల్ మీడియా వింగ్స్ అవిశ్రాంతంగా పనిచేశాయి… వెరసి అరెస్టులు, అవమానాల దశల్ని దాటేసి వచ్చి, మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ అధిరోహిస్తున్నాడు… జగన్ మొహంలో కత్తివేటుకు చుక్క నెత్తురు లేదు… తన మీడియా సాక్షి క్యాంపుతో సహా..!!
Share this Article