Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఖి అబే… పిల్లల్లేక, భర్త దూరమై… ఇక అక్షరాలా ఒంటరిదైపోయింది…

July 8, 2022 by M S R

నో డౌట్… జపాన్ పూర్వ ప్రధాని షింజో అబే మరణం ఇండియాకు నష్టదాయకమే… తను నిఖార్సయిన భారత మిత్రుడు… వ్యక్తిగతంగా మోడీకి సన్నిహితుడు… ఆప్యాయ ఆలింగనాలతో, రెండు దేశాల అనుకూల నిర్ణయాలతో, బాంధవ్యంతో వాళ్ల బ్రొమాన్స్ సాగేది… జపాన్‌లో దీర్ఘకాలం ప్రధానిగా చేసినవాడు… ఆయన తాత కూడా ఇండియాకు సన్నిహితుడే… ఈ దేశపు రెండో అత్యుత్తమ పద్మవిభూషణ్ ప్రకటించామంటే షింజోకు ఇండియా ఎంత గౌరవాన్ని, ప్రేమను ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు…

ఎస్, మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో చైనాను నిలువరించే శక్తుల కలయిక దిశలో జపాన్-ఇండియా చేతులు కలిపాయి… క్వాడ్ అనే నాలుగు దేశాల కూటమి ఆలోచన కూడా షింజోదే… అమెరికా నమ్మలేని దేశం, కానీ యాంటీ-చైనా పోకడల దిశలో క్వాడ్ ఓ తప్పనిసరి అవసరమైంది… జపాన్ ప్రతి దశలోనూ ఇండియాకు సపోర్టుగా నిలిచింది…

రాజకీయాలే కాదు, వాణిజ్య సంబంధాలూ పెరిగాయి… కారణాలు, మోటివ్ బయటపడాల్సి ఉంది కానీ… ఇండియా కోణంలో తను ఇంకా బతికి ఉండాల్సిన వ్యక్తి… కానీ ఫేట్… ఆయన్ని తీసుకుపోయింది… ఆసియాలో ఇలాంటి రాజకీయ హత్యలు కొత్తేమీ కాదు… బేనజీర్ భుట్టో కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు… అయితే షింజో వారసుడు ఎవరు..? కొన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు రాశాయి… కొన్ని కనెక్టయ్యేలా ఉన్నయ్…

Ads

shinzo

ఆయన భార్య పేరు అఖి… ఆమె కూడా ఇండియాను సందర్శించింది… రేడియో జాకీగా పనిచేసేది… జపాన్‌లో పేరెన్నికగన్న ఓ ధనిక కుటుంబానికి చెందిన మహిళ… 1987లో వీళ్ల పెళ్లి జరిగింది… సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండేది… ఇజకయ, అంటే బార్ టైప్… ఆల్కహాల్, స్నాక్స్ అమ్మే దుకాణాన్ని కూడా ఆమె స్టార్ట్ చేసింది… స్వలింగసంపర్కుల యాక్టివిటీస్ పట్ల సానుభూతి ఉండేది ఆమెకు…  సోషల్ ఇష్యూస్ మీద అభ్యుదయ భావాలతో వ్యవహరించేది… కానీ ఆమెకు పిల్లలు కలగలేదు… ఆ ఇద్దరికీ అదే పెద్ద సమస్య… సమాజం నుంచి కూడా బాగా ఒత్తిడి ఉండేది వాళ్ల మీద…

మొదట్లో ఆమె సంతాన సాఫల్య చికిత్సలు కూడా తీసుకుంది… ఫలితం కనిపించలేదు… తరువాత వయస్సు పెరిగేకొద్దీ గర్భధారణ అవకాశాలు సన్నగిల్లిపోయాయి… ఒకవైపు జపాన్‌లో జనాభా పెరగాలని, ప్రతి జంట ఎక్కువ సంతానం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చే వాళ్లు తమకే సంతానం లేని దురవస్థకు చింతించేవాళ్లు… ఒక దశలో ఎవరినైనా దత్తత తీసుకోవాలని అనుకున్నారు…

తమ కుటుంబాలు, తమ పరివారాలకు బయట దత్తత తీసుకోవడం జపాన్‌లో ఓ సంక్లిష్ట వ్యవహారం… చివరకు ఓ దశలో ఇద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు… ‘‘మనకు ఏ పిల్లలూ వద్దు… నీకు నేను, నాకు నువ్వు, అంతే… విధి అదే చెప్పింది… యాక్సెప్ట్ చేద్దాం… ఇక తల్లీదండ్రులుగా వ్యక్తిగత జీవితంలో ఎదిగే ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెడదాం’’ అనుకున్నారు… ఫలితం ఛైల్డ్ లెస్… ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు… ఆమె ఒంటరిదైపోయింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions