Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీరు జ్ఞానులే…. కానీ మన బ్యూరోక్రాట్లతో పోలిస్తే.., జస్ట్, చలిచీమలు…

December 30, 2025 by M S R

.

Murali Buddha …. దాదాపు 20 ఏళ్ళ క్రితం ఇండియా టుడే తెలుగు పత్రికలో ఓ వ్యాసం చదివా …. ఓ పరిశ్రమలో ప్రభుత్వ అధికారులు తనిఖీకి వెళ్లారు … నియమ నిబంధనలు కచ్చితంగా పాటించే పరిశ్రమ అది … తనిఖీ దాదాపు పూర్తి కావస్తుంది …

మేం నిబంధనలు కచ్చితంగా అమలు చేసే వాళ్ళం, మేం తప్పు చేయం అని పరిశ్రమ యజమాని గర్వంగా చెబుతాడు … అధికారి ఓ నవ్వు నవ్వి, మా గురించి మీకు ఇంకా తెలియనట్టు ఉంది … మేం వచ్చాక తప్పులు దొరికి తీరాల్సిందే అంటాడు …

Ads

ఏ ఒక్క తప్పూ దొరక లేదు … చివరలో ఓ తప్పు పట్టుకొని నోటిస్ ఇస్తారు … నోటిస్ చూసి యజమాని బిత్తర పోతాడు … మీ పరిశ్రమలో కార్మికులు నీళ్లు తాగేందుకు కుండలు ఉండాలి, అవి లేవు అని ఆ నోటిస్ …

  • యజమాని నీళ్లు తాగేందుకు మేం ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశాం అని చూపిస్తే … ఫ్రిడ్జ్ తో మాకు సంబంధం లేదు . కార్మిక చట్టం ప్రకారం ఎంత మంది కార్మికులు ఉంటే ఎన్ని కుండలు ఉండాలో చెప్పబడి ఉంది . చట్టం ప్రకారం కుండలు ఉండాల్సిందే, కుండలు లేవు … నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు అని నోటిస్ …

 

దాదాపు అదే సమయంలో అదే పత్రికలో చదివిన మరో వార్త …
విఠల్ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు . బొంబాయిలో విఠల్ ఉపన్యాసం . ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా నినాదాల బోర్డులు పెట్టాలి అని ఓ సూచన .

  • విఠల్ ఉపన్యాసం అయ్యాక . ఓ వ్యక్తి వచ్చి సార్ ముంబైలో ఆ బోర్డులు ఎప్పుడో పెట్టారు . ఆ కాంట్రాక్టర్ ను నేనే…. లంచం ఇస్తే కానీ బిల్లు ఇవ్వను అంటున్నారు అని తన ఫిర్యాదు …

 

1994 లో వరంగల్ లో నేను రిపోర్టర్ గా ఉన్నప్పుడు అల్లూరి మూర్తి రాజు -.. టాటాతో ఉన్నతోద్యోగి శర్మ కలిసి mba కోర్స్ కోసం కాలేజీ పెట్టారు … ఆ రాత్రి మీడియాతో బోలెడు చర్చలు … శర్మ ఒక గొప్ప మాట చెప్పాడు … ఎంత గొప్ప పరిశ్రమ అయినా చివరకు నీతులు బోధించే మీ మీడియా సంస్థలు అయినా నిబంధనలు అన్నీ కచ్చితంగా పాటిస్తే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేవు కఠిన వాస్తవం చెప్పారు …

మన కఠిన నిబంధనలు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు లంచాలు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించడానికే తప్ప సమాజం మేలు కోసం కాదు .

అనుమానం ఉంటే … ఇంటి ముందు రెండు మూడు గంపల ఇసుక పోసి చూడండి, వెంటనే ఏం కడుతున్నారు అని మున్సిపల్ సిబ్బంది వాలిపోతారు, అఫ్ కోర్స్, రిపోర్టర్లు కూడా…

కానీ హైటెక్ సిటీ ప్రాంతంలో వంద గజాల్లో ఐదు అంతస్తుల భవనం కూలిపోతే, అరే, ఇది ఎప్పుడు కట్టారు, మా దృష్టికి రాలేదు అని మున్సిపల్ అధికారులు ప్రకటన విడుదల చేస్తారు … రెండు మూడు గంపల ఇసుక పోస్తే వెంటనే మున్సిపల్ వారికి కనిపిస్తుంది … ఐదు అంతస్తులు కూలేంత వరకు కనిపించదా ? ఇదెలా సాధ్యం అంటే అదే మ్యాజిక్ …



Prabhakar Jaini ………. ఒక మాజీ వాణిజ్య పన్నుల సహాయ కమీషనరుగా నేను మీ మాటలను పూర్తిగా సమర్థిస్తాను. కానీ, దీనికి అనేక కారణాలున్నాయి. ఒక షాప్ మీద రెయిడ్ చేయాలంటే, ఉన్నతాధికారుల వ్రాతపూర్వకంగా ఉత్తర్వులు ఉండాలి. రెయిడ్ చేసిన అధికారి ఒక నిజాయితీ వ్యాపారి సంస్థను రెయిడ్ చేసి, ఏ తప్పిదం లేదని భావించి, అలా రిపోర్ట్ చేస్తే, సదరు ఉన్నతాధికారి, రెయిడ్ చేసిన అధికారి
(1) లంచం తీసుకుని వదిలేసాడని లేదా
(2) వ్యాపారి పన్ను ఎగవేతను పట్టుకోలేని అసమర్థుడని,
ఇలా రకరకాలుగా చులకనగా చూస్తాడు. అతనికి మళ్ళీ రెయిడ్ చేసే ఉత్తర్వులు ఇవ్వడు.

అందుకే, చాలా మంది వ్యాపారస్తులు, రెయిడింగులో ఎంతో కొంత పన్ను కట్టే వీలుండేటట్టుగా, పన్ను ఎగ్గొడతారు. ఆ ఎగ్గొట్టిన పన్ను మొత్తం, కొంత పెనాల్టీ, అధికారులకు కొంత సమర్పించుకుంటే, అందరూ హ్యాపీస్ అని అందరికీ తెలుసు. సంవత్సరంలో ఒకసారే ఆడిట్/ రెయిడ్ జరుగుతుందన్నది రూల్. కాబట్టి, ఒకసారి అధికారులను తృప్తి పరిస్తే, ఆ సంవత్సరం సేఫ్ గా గడిచిపోతుంది. లేకపోతే, అధికారుల ‘ఈగో’ దెబ్బ తింటుంది.

అయితే, వంద శాతం నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారులు కూడా ఎవ్వరూ లేరన్నది కూడా నిజం. ఈ మధ్య ప్రభుత్వాలు కూడా బిజినెస్- ఫ్రెండ్లీ గా చట్టాలు రూపొందిస్తున్నాయి. అనేక వస్తువుల మీద పన్నులు తగ్గించాయి. అయినా, వ్యాపారులు జీరో వ్యాపారం మానరు. సిటీలో ఏయే ఏరియాల్లో జీరో వ్యాపకం జోరుగా సాగుతుందో అందరికీ తెలిసిందే కదా?



Murali Buddha….. నాకు తెలిసిన ఓ వ్యాపారిని రాజకీయ నాయకుడు వేధిస్తున్నాడు … ఆ నాయకుడు 3 దశాబ్దాల నుంచి నాకు పరిచయం … ఐనా ఆ వ్యాపారికి నేను ఇచ్చిన సలహా ఏమంటే….. నువ్వు వ్యాపారివి, వాడు నాయకుడు … నీ వ్యాపారంలో వంద వస్తువులు ఉంటే నీ మీద వంద కేసులు పెట్టవచ్చు … నువ్వేమీ ఉద్యమకారుడివి కాదు, వ్యాపారం చేసుకునే వాడివి, వాడికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి…….. నాకు చెప్పాను అని కూడా చెప్పకు అని సలహా ఇచ్చాను…



Prabhakar Jaini …… అంతే! మేమొకసారి, కంప్లైంట్ రావడంతో ఒక పెద్ద కేసు పట్టుకున్నాము. ఆ వ్యాపారి అకౌంట్ బుక్స్ అన్నీ సీజ్ చేసాము. ఆ వ్యాపారి అప్పటి హోమ్ మంత్రి దగ్గరకు వెళ్ళి, కేసు నుండి బయట పడేయమని కోరాడు. ఆయన సరేనని, ఒక చిన్న చీటీ ఇచ్చి, ”ఇందులో ఉన్న బిల్లు కట్టి రా ఫో” అని చెప్పాడట. బయటకొచ్చి చూస్తే ఆ చిట్టీలో డెబ్భై వేలు అని రాసి ఉందంట.

ఆ వ్యాపారి విధి లేక ఆ బిల్లు చెల్లించి వచ్చిన తర్వాత, ఆ మంత్రి మా డీజీపీ గారికి (విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంటు) ఫోన్ చేస్తే, ఆయన “అవన్నీ నాకు తెలియదండి!” అని నిర్మొహమాటంగా చెప్పేసరికి, ఆ మంత్రి చేతులెత్తేసాడట.

తర్వాత ఆ వ్యాపారి మా ఆఫీసుకు వచ్చి, ఎగ్గొట్టిన పన్ను, పెనాల్టీలు చెల్లించిన తర్వాత పై సంఘటన గురించి చెప్పాడు. మేం మళ్ళీ ఆ షాపుకు జీవితంలో వెళ్ళలేదు. కానీ, మంత్రి మాత్రం అడపాదడపా, చిట్టీలు పంపుతూనే ఉన్నాడంట….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీరు జ్ఞానులే…. కానీ మన బ్యూరోక్రాట్లతో పోలిస్తే.., జస్ట్, చలిచీమలు…
  • ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!
  • SIR … వోట్ల ప్రక్షాళన తరువాత ఏమిటి..? ఇదీ ఓ క్లారిటీ..!
  • అసలు ఏమిటి ఈ ఉన్నావో కేసు..? ఎవరు ఆ నొటోరియస్ క్రిమినల్..?
  • వెండి, బంగారం…! ఎందుకీ పరుగు..? ఎక్కడి దాకా..? సేఫేనా..?
  • ‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
  • వీడొక డర్టీ ఫెలో… అగ్లీ కేరక్టర్… తగిన శాస్తి చేయండి… అర్హుడే..!!
  • ముక్కోటి ఏకాదశి అంటే ఒకటే తిథి కదా.., మరి పదిరోజుల దర్శనాలు..?!
  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions