నిజమే, అంగీకరించాలి… తెలంగాణకు వ్యతిరేకి అయినా సరే, మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి తెలంగాణవ్యాప్తంగా అభిమానగణం ఉంది… ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వల్ల లబ్దిపొందిన కుటుంబాలు ఆయన్ని మరిచిపోవు… కానీ అదొక్కటీ షర్మిల పార్టీకి ఒక ‘డ్రైవింగ్ ఫోర్స్’గా సరిపోతుందా..? ఈ ప్రశ్న ఎందుకంటే..? వైఎస్ పన్నెండో వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాదు నోవాటెల్ అనే స్టార్ హోటల్లో ఓ ప్రోగ్రాం నిర్వహించనుంది… సెప్టెంబరు రెండున… ఇది నాన్-పొలిటికల్, నాన్-పార్టీ ప్రోగ్రాం అని చెబుతున్నారు… వైఎస్ కేబినెట్ సహచరులు, పొలిటికల్ కొలీగ్స్, స్నేహితులు, శ్రేయోభిలాషుల భేటీ అంటున్నారు… తమకు సన్నిహితులు అనుకున్నవారిని ఆహ్వానాలు పంపిస్తున్నారు… ఇన్నేళ్లుగా లేనిది ఒక్కసారిగా హైదరాబాదులో విజయమ్మ తన స్వర్గీయ భర్త పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది… ఈ కుటుంబం రాజకీయ పోకడలు తెలంగాణకు సంబంధించి అనూహ్యంగా ఉంటున్నయ్… రాజకీయేతర భేటీ అంటున్నా సరే, ఏదో ప్రచ్చన్న రాజకీయం లేకుండా ఏ అడుగైనా ఎందుకు ఉంటుంది..?
Sir.. Madam YS Vijaya Lakshmi is organising a programme to mark the 12th death anniversary of late CM Dr YS Rajasekhara Reddy garu at 5.00 pm on 02.09.2021 at HICC Novatel, Hyd’. It’s purely non-political and non party program of his Cabinet, his Political collegues, friends, media friends and well wishers. Vijayamma garu personally extending the invitation and requested you to join the event and make it success.
Regards
ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి చూపని షర్మిల ఏకంగా ఓ తెలంగాణ పార్టీయే పెట్టేసింది… తెలంగాణ అంటేనే వ్యతిరేకించే కుటుంబం ఇప్పుడు తెలంగాణ పాట పాడుతోంది… అన్నతో పంచాయితీ, అందుకే ఇక్కడ పార్టీ పెట్టింది అనే వాదన అబ్సర్డ్… తెలంగాణలో ఎవరూ నమ్మడం లేదు ఆ వాదనను… అన్నతో తగాదా అయితే ఏపీలో కొట్లాడాలి గానీ తెలంగాణలో ఏమిటనే ప్రశ్నకు ఆమె క్యాంపులో ఈరోజుకూ సరైన జవాబు చెప్పేవారు లేరు… ఉండరు, ఎందుకంటే అబ్బే, అన్నతో కొట్లాట ఏమీలేదు, కేవలం రాజన్నరాజ్యం కోసమే తెలంగాణలో పార్టీ పెట్టాం అంటారు… అసలు రాజన్నరాజ్యం అంటే ఏమిటి..? దానికి నిర్వచనం ఏమిటి..? అందుకే ఆమెకు, ఆమె పార్టీకి యాక్సెప్టెన్సీ రావడం లేదు… తోడుగా నిలిచిన ఒకరో ఇద్దరో ఆమెను వదిలేసి వెళ్లిపోతున్నారు… ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్ తదితర పాత జిల్లాల్లోని కొందరు నేతలు ఆమెకు తోడుగా నిలుస్తారు అనే ప్రచారాలు సాగాయి గానీ ఒక్కరూ ఆమెతో కలవలేదు… కృత్రిమంగా ఎంత హైప్ క్రియేట్ చేయాలనుకున్నా సరే, హైఫై దీక్షలు చేస్తున్నా… పరామర్శ యాత్రలు చేస్తున్నా ఏదీ కుదరడం లేదు… రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రెడ్లు తనవైపు చూస్తున్నారు… బహుజనం ఆర్ఎస్ ప్రవీణ్ వైపు చూస్తున్నారు… ఇలా అనేక కారణాలు ఉండవచ్చుగాక… ఆమె రాజకీయ ఉనికి ప్రస్తుతం జస్ట్, నామ్కేవాస్తే… (తన ఇంటికి పరామర్శకు వస్తానంటే ఓ తండ్రి వద్దు తల్లీ, ప్లీజ్ రావద్దు అని ఓ నిరుద్యోగి తండ్రి ఓ వీడియో ద్వారా ఆమెను వేడుకున్నాడు అంటేనే ఆమెకు తెలంగాణలో ఉన్న యాక్సెప్టెన్సీ స్థితి ఏమిటో తెలుస్తోంది…)
Ads
ఆమె ఎప్పుడూ అన్న చెప్పినట్టు వినే చెల్లి… అన్నకు అవసరమైన సందర్భాల్లో తప్ప ఎప్పుడూ రాజకీయాల్ని తన వృత్తిగా ఎప్పుడూ చెప్పుకోలేదు… కానీ అకస్మాత్తుగా రాజకీయం మాట్లాడుతోంది… ఆమె ఎవరు విడిచిన బాణం అయినా సరే, జగన్ మాట్లాడడు, కేసీయార్ మాట్లాడడు… ఎవరి ఉద్దేశాలు, ఎవరి వ్యూహాలు ఏమిటో తెలియదు… జగన్ వ్యూహకర్త పీకే ఆమెకూ సహకరిస్తాడు… ఇప్పుడు విజయమ్మ పెట్టబోయే మీటింగుకూ షర్మిల పార్టీకి స్థూలంగా పైకి చూస్తే ఏమీ సంబంధం ఉండదు… కానీ వైఎస్ వర్ధంతి అంటేనే ఇన్నేళ్లూ కేరాఫ్ ఇడుపులపాయ… పైగా విజయమ్మ తన కూతురు షర్మిల పార్టీకి కూడా ప్రధానమద్దతుదారు… సో, హైదరాబాదులో పాత వైఎస్ అభిమానులు, శ్రేయోభిలాషుల రాజకీయతర భేటీ అనగానే ఓ ఇంట్రస్టు క్రియేటవుతోంది… ఈ భేటీ వెనుక కూడా పీకే ఉన్నాడా..? దీంతో ఏం సాధించాలని భావిస్తున్నారు..? పొలిటికల్ సర్కిళ్లలో, జర్నలిస్ట్ సర్కిళ్లలో అందరి మెదళ్లకూ మేత…!!
Share this Article