Ashok Vemulapalli…. “యుద్దం సెయ్”…. తమిళ దర్శకుడు మిస్కిన్ సినిమా ఇది .. ఇది మిస్కిన్ మాత్రమే ఇలా తీయగలడు అనిపించగలిగేవాళ్లలో అతను ఒకడు .. ఆఖరికి వీధి లైట్ కిందే సినిమా షాట్ తీసేస్తాడు .. చీకట్లోంచే కెమేరాని రన్ చేస్తాడు .. మిస్కిన్ కి ఒక ప్రత్యేక కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు.. క్రైం , సైకిక్ స్టోరీ లైన్ తో మిస్కిన్ తీసే సినిమాలు చూడటానికి హాలీవుడ్ లో క్రిస్టఫర్ నాలెన్ సినిమా చూడటానికి ఉండాల్సినంత ఓపిక , బుర్రా రెండూ ఉండాల్సిందే ..
2011 లో వచ్చిందీ సినిమా .. చేరన్ హీరో.. సినిమా చివర్లో ఒక 16 ఏళ్ల కుర్రాడికి సీఐడీ ఆఫీసర్ చేరన్ MANs SEARCHING FOR MEANING అనే పుస్తకం ఇచ్చి చదువుకోమంటాడు.. విక్టర్ ఫ్రాంకిల్ రాసిన పుస్తకం అది.. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రుల్ని కళ్ల ముందే హత్యచేయడం చూసిన ఆ కుర్రాడు , సొంత అక్కని వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేయడం లాంటి ఎన్నో చూడకూడని దారుణాలు చూసి… మానసికంగా క్రుంగిపోయిన అతన్ని మళ్లీ జీవితం మీద ఆశ కల్పించడానికి చేరన్ ఈ పుస్తకం ఇస్తాడు…
సినిమా ముగిసిపోయాక కూడా పుస్తకం కుర్రాడికి ఇప్పించడం అనేది మంచి కాన్సెప్ట్ .. ఒక సీన్లో బులెట్ గాయం… చనిపోయే ముందు డాక్టర్ గా యాక్ట్ చేసిన జయప్రకాశ్ ఇలా అంటాడు.. జేకే .. LIFE IS NOT A HEAVEN .. ITS A HELL .. హాస్పిటల్ కి మిమ్మల్ని తీసుకెళ్తానంటే .. నేను కూడా డాక్టర్ నేనయ్యా .. నా ప్రాణం ఎంత సేపట్లో పోతుందో నాకు తెలీదా అని మందు బాటిల్ ఓపెన్ చేయించి, తాగి చనిపోయే సీన్ సినిమాకే హైలెట్ .. ఈ సీన్ వరకూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు స్టోరీ ఎక్కడా రివీల్ కాదు .. కానీ అప్పటికే రెండు గంటల సినిమా ముగుస్తుంది .. చివరి అరగంటలోనే సినిమా అంతా అర్దమవుతుంది .. అప్పటివరకూ జరిగిన సీన్లన్నీ మన మైండ్లో తిరుగుతుంటాయి ..
మిస్కిన్ స్క్రీన్ ప్లే లో ఒక మ్యాజిక్ ఉంటుంది .. బహుశా మిగిలిన డైరెక్టర్ల టేకింగ్ కి మిస్కిన్ కి చాలా తేడా ఉంటుంది.. అతని సినిమాలు డిటెక్టివ్ , పిశాచి , సైకో , మాస్క్ ఇలా ఏది చూసినా ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టులే ఉంటాయి .. ఇప్పటివరకూ మిస్కి పదేళ్లలో పది సినిమాలు తీస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్లు ఎనిమిది హిట్లు ..
యుద్దం సెయ్ సినిమాలో అటు క్రైం , ఇటు సెంటిమెంట్ , థ్రిల్లర్ , సైకిక్ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ టచ్ చేస్తాడు.. మొదట సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో తల , కాళ్లు , చేతులూ ఇలా నరికి బాక్సుల్లో ప్యాక్ చేసి ఒక చోట పెడుతుంటారు .. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సీఐడీ ఆఫీసర్ గా చేరన్ రంగంలోకి దిగుతాడు .. ఆ తలలు , కాళ్లు చేతులూ ఎవరివో సినిమా చూస్తున్నవారికి ఇంటర్వెల్ వరకూ ఏమీ అర్దం కావు ..
మిస్కిన్ సినిమాల్లో కొన్ని సీన్లు విచిత్రంగా ఉంటాయి .. ఒక సీన్లో పోలీస్ స్టేషన్ ఎదుట పుచ్చకాయల బండి ఉంటుంది.. ఆ స్ట్రీట్ వ్యాపారి రాత్రి వెళ్లిపోయేముందు కాయలపై కవర్ కప్పి వెళ్లిపోతాడు స్టేషన్ లో కానిస్టేబుల్ డ్యూటీ దిగి వెళ్తూ కవర్ ఓపెన్ చేసి ఒక పుచ్చకాయ దొంగతనం చేసి సైకిల్ పై పెట్టుకుని వెళ్లిపోతాడు .. తెల్లవారుతుంది .. యధావిధిగా పుచ్చకాయల వ్యాపారి ఉదయాన్నే సైకిల్ పై తన షాప్ దగ్గరకు వచ్చి సైకిల్ కి తగిలించి ఉన్న రేడియో ఆన్ చేసి ఒక పాట పెట్టి వింటూ పుచ్చకాయల పైన కప్పిన పరదా విప్పుతుంటాడు .. పుచ్చకాయల మధ్యలో ఒక వ్యక్తి తలకాయ ఉంటుంది ..
అతను గట్టిగా అరుస్తూ పోలీస్ స్టేషన్ లోపలికి పరిగెత్తి పోలీసులకి చెబుతాడు .. అపుడు పోలీసులు వచ్చి తలకాయని మార్చురీకి తరలిస్తారు .. విచిత్రమేమంటే రాత్రి కానిస్టేబుల్ కాయ దొంగతనం చేసిన స్థానంలోనే ఈ తలకాయ ఉంటుంది.. ఈ సీన్ మొత్తం డైరెక్టర్ అలా కెమేరాని పుచ్చకాయల షాప్ వెనక పెట్టి వైడ్ యాంగిల్ లో వదిలేస్తాడు .. ఎక్కడా ఫ్రేం కదలదు.. రాత్రి కానిస్టేబుల్ దొంగతనం నుంచి ఉదయం తలకాయ కనిపించేవరకూ ఫిక్సిడ్ షాట్ ఉంటుంది .. ఇంతకీ ఆ తలని మనకు చూపించడు .. కేవలం వెనుక వైపు ఉంగరాల జుట్టుని మాత్రం చూపిస్తాడు .. సినిమా ఫాలో అవుతున్నవారికి ఆ రింగుల జుట్టు ఎవరిదో అర్దమవుతుంది
మరో షాట్లో ఇద్దరు అమ్మాయిలు టెన్నిస్ ఆడుతుంటారు.. అలా ఆడుతున్న అమ్మాయిల కాళ్లని చూస్తున్న ఇద్దరు రిటైర్డ్ ముసలాళ్లని మనకి చూపిస్తాడు .. తమకు మనవరాళ్ళ వయసున్న అమ్మాయిలను తాతయ్యలు అంత కామంగా చూస్తున్నారా అనే భావన కల్పిస్తాడు డైరెక్టర్ .. అయితే ఆ టెన్నిస్ ఆడుతున్న వారిలో ఒకమ్మాయి మెల్లగా నడుచుకుంటూ టెన్నిస్ కోర్ట్ లో మూలన ఉన్న అట్టపెట్టె తెరిస్తే అందులో మరెవరిదో తలకాయ ఉంటుంది .. ఇక్కడ టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలని అంతసేపు చూపించింది ఆ తలకాయ చూపించడానికే .. అయితే పైన ఈ అమ్మాయిలని కామంగా చూసిన ఆ ఇద్దరు ముసలాళ్ల కథని దర్శకుడు చివర్లో రివీల్ చేస్తాడు .. వాళ్లని చివర్లో చూసినపుడు ఇంతకుముందు వీరిద్దరినీ ఎక్కడో చూశామే అని బుర్ర పెట్టి మనం వెదుక్కోవాల్సి వస్తుంది..
ఒక యువతిని గాంగ్ అత్యాచారం చేస్తుంటే ఎదురుగా ముసలివాళ్ల బ్యాచ్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటారు .. బహుశా ఈ తరహా పైశాచికత్వం ఇంకే సినిమాలో ఉండదు .. అయితే ఆ ముసలాళ్లు ఆ అమ్మాయిని అలా చేయిచడానికి వేరే కారణం ఉంటుంది .. ఇక్కడ ప్రస్తావిస్తే ఇంట్రస్ట్ పోతుంది ..
సినిమా మొత్తం ఊహించని మలుపులు తిరుగుతుంది .. ఇంతమందిని చంపిన ఆ హతకులెవరనేది చివర్లో చూసి ఆశ్చర్యపోతాము .. సినిమాలో ఒక నవ్వు ముఖం మాత్రం కనిపించదు .. అంతా డార్క్ గా , సీరియస్ గా సాగిపోతుంది .. తన స్క్రీన్ ప్లే తో సినిమా ముగిసేవరకూ మెడ తిప్పుకోనీయకుండా మ్యాజిక్ చేస్తాడు మిస్కిన్ .. యూట్యూబ్ లో తమిళ్ లో , హిందీలో మాత్రమే సినిమా ఉంది .. అశోక్ వేములపల్లి

Share this Article