సాధారణంగా టీవీ సీరియల్స్ మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? చెత్త..! ఇదే కదా… కాకపోతే ఇళ్లల్లో ఉండే మహిళా ప్రేక్షకులకు వేరే వినోదం లేదు… థియేటర్ సిండికేట్ల దోపిడీ కారణంగా థియేటర్లకూ పోయే పరిస్థితి లేదు… అదొక నిలువు దోపిడీ… అందరికీ తెలిసిందే… పైగా థియేటర్ వెళ్లాలంటే డబ్బు మాత్రమే కాదు, చాలా అంశాలు అనుకూలించాలి, ఆ చర్చలోకి వెళ్లడం లేదు…
ఆ థియేటర్ దుర్మార్గుల అరాచకాలు చివరకు వాళ్లనే ముంచేస్తాయి, అది వదిలేద్దాం… కూర్చున్న కొమ్మను నరుక్కునే సిండికేట్ మాఫియాలు అవి… ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ చార్జీలు పెరిగిపోయాయి… అన్ని ఓటీటీలను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ధనికులకే చేతకాదు… ఇక మిగిలిన ఏకైక వినోద సాధనం టీవీలే… అవేమో దిక్కుమాలిన, చెత్త, పనికిమాలిన, మతిచెడిన, నెత్తిమాసిన సీరియల్స్‌ను రుద్దుతుంటాయి…
సాగదీత అని కాదు… లాజిక్ ఉండదు, తీసేవాడికి చూసేవాడు లోకువ అన్నట్టుగా… అవే అత్తాకోడళ్లు, మంత్రాలు, మాయలు… ఇదే దరిద్రం… ఇక విషయంలోకి వస్తే జీతెలుగు వాడు ఎంత ప్రయత్నించినా స్టార్ మాటీవీని కొట్టలేకపోతున్నాడు… రేటింగ్స్‌లో… టీవీ రేటింగ్స్‌కు ప్రధాన ఆధారం సీరియల్సే కదా… స్టార్ మాటీవీ వాడి సీరియల్స్ నాణ్యతతో ఉంటాయని కాదు, అవీ సోకాల్డ్ దిక్కుమాలిన సీరియల్సే… కానీ దాని రీచ్ ఎక్కువ… రేటింగ్స్‌ను ఏదోరకంగా మాయ చేయగలడు వాడు…
Ads
ఈ విషయంలో జీతెలుగువాడు వెనకబడిపోతున్నాడు… మీటర్డ్ టీవీలున్న ఇళ్లు దొరకడం లేదేమో… దాంతో ఇక ఆదివారం కూడా ప్రముఖ సీరియల్స్ ప్రసారం చేస్తానని ప్రకటించింది… అలా రేటింగ్స్ పెంచుకోవడం ఓ చిట్కా అన్నమాట… నిజంగానే జీతెలుగులో ఆదివారం ప్రసారం చేయడానికి మంచి సినిమాలు ఏమీ లేవు… కొనదు, దాంతో ఇక సీరియల్సే శరణ్యం అనుకుంది… పైగా స్టార్ మా రియాలిటీ షోలు కూడా ఈమధ్య పెద్ద పాపులర్ ఏమీ లేవు…
బాగా రేటింగ్స్ ఉన్న సీరియల్స్ ఆదివారం ప్రసారం చేస్తుందట… చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరేళ్ల సావాసం, మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం, త్రియని సీరియల్స్… ఇవీ ఆ సీరియల్స్… నిండునూరేళ్ల సావాసం ఏడు గంటలకు, మేఘ సందేశం ఏడున్నర గంటలకు టెలికాస్ట్ అవుతాయని చెప్పింది… పడమటి సంధ్యారాగం ఎనిమిది గంటలకు.., త్రినయని ఎనిమిదిన్నర గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతున్నాయి…
నిజానికి ఒకప్పుడు జీతెలుగులో త్రినయని టాప్, తరువాత ప్రేమ ఎంత మధురం… ఈ రెండో సీరియల్ ఎప్పుడో భ్రష్టుపట్టిపోయింది, త్రినయని కూడా దిక్కుమాలిన రొటీన్ ట్రీట్‌మెంట్‌తో దెబ్బతిని టాప్ 30 జాబితాలో నుంచి మాయం అయిపోయింది… టీఆర్‌పీ రేటింగ్ పరంగా పడమటి సంధ్యారాగం టాప్‌లో ఉంది… కాస్త జగద్ధాత్రి త్రినయనికన్నా బెటర్… భిన్నమైన కాన్సెప్టు… ట్రీట్‌మెంట్ మాత్రం అదే రొటీన్ చెత్తా… మేఘ సందేశం 6.92, నిండు నూరేళ్ల సావాసం 6.82తో టాప్ ఫైవ్‌లో స్థానం దక్కించుకున్నాయి… కానీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మాత్రం టీఆర్‌పీ రేటింగ్‌లో చాలా చాలా పూర్… ఐనా ఆదివారం వేస్తారట… తాజా టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ సీరియల్‌కు 2.64 మాత్రమే వచ్చింది…
Share this Article