ఎస్, ఎవరు కాదన్నా, ఎవరు ఔనన్నా… టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల్ని ఎవడూ చూడటం లేదు… అందుకే స్టార్ హీరోల భారీ సినిమాలకూ రేటింగులకు కరువు… కాస్తో కూస్తో చూస్తున్నారూ అంటే… ఎంత దిక్కుమాలినవే అయినా సరే, సీరియళ్లు చూస్తున్నారు… అవీ స్టార్ మా, జీ తెలుగు సీరియళ్లు మాత్రమే… జెమిని టీవీని జనం ఏనాడో మరిచిపోయారు, ఈటీవీ ఆ పోటీ బరి నుంచి ఏనాడో తప్పుకుంది…
ఏటా ఒకసారి స్టార్ మా, జీ తెలుగు తమ సీరియళ్ల కోసం అవార్డుల్ని ప్రదానం చేస్తూ భారీ టీవీ షో నిర్వహిస్తుంటాయి… స్టార్ మా పరివార్… జీ తెలుగు కుటుంబం అవార్డులు… ఈసారీ కాస్త రోజుల తేడాతో అటూ ఇటూ రెండు చానెళ్లూ ఇవే షోలను ప్రసారం చేశాయి… స్టార్ మా అవార్డుల షో ఎన్ని పార్టులో తెలియదు గానీ జీ తెలుగు అవార్డుల ఫంక్షన్లు రెండు పార్టులుగా ప్రసారం చేశారు…
వీటిలో జీ తెలుగు షో బాగున్నట్టనిపించింది… ఎందుకంటే, ప్రధాన కారణం… స్టార్ మా హోస్ట్ శ్రీముఖి… అదే హైపిచ్ అరుపులు, కేకలు, ఓవరాక్షన్… అంత సీనియర్ యాంకర్ అలా విసిగిస్తే… కమెడియన్ నుంచి హోస్టుగా మారిన సుడిగాలి సుధీర్ జీ తెలుగు షోను పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు… ఓవర్ లేదు, తక్కువ లేదు… అరుపులు, కేకలు అస్సలు లేవు…
Ads
తరువాత కారణం ప్రధానంగా… జీ తెలుగు మొత్తం రెండు ఎపిసోడ్లలో చాలా ఎమోషనల్ టచెస్ ఉన్నాయి… కొన్నిచోట్ల ఆర్ద్రంగా అసలు ఇది ఓ కమర్షియల్ టీవీ షోయేనా అనిపించింది… బాగుంది… కానీ స్టార్ మా పరివారం షో భారీగా, అట్టహాసంగా ఉన్నా సరే… అక్కినేని సెంటినరీ తప్ప మిగతా ఏ ఆకర్షణా లేదు… అఫ్‌కోర్స్, అక్కినేని కుటుంబం తదితరులు పాల్గొనడమే ఆ షోకు ఆకర్షణ…
మరోవైపు జీ తెలుగు షోలో బోయపాటి, ఒకప్పటి హీరో తరుణ్, బలగం వేణు, శ్రీవిష్ణు, సుధీర్ బాబు తదితరులు కనిపించారు… మొత్తంగా రెండు షోలను కంపేర్ చేస్తే మాత్రం అడ్డగోలు ఖర్చు పెట్టినా సరే స్టార్ మా షో వెలవెలపోయింది… సీరియళ్ల రేటింగ్స్‌లో స్టార్ మాతో పోటీపడలేకపోతున్నా సరే, ఈ సీరియళ్ల అవార్డుల షోలో మాత్రం జీతెలుగే నెగ్గినట్టు కనిపించింది…
ఏదో ఒక టీవీ… అది కాదు చెప్పాలనుకున్నది… తెలుగు టీవీ సీరియళ్లలో 60, 70 శాతం నటీనటులు, ప్రత్యేకించి హీరోయిన్లు కన్నడిగులే… అఫ్‌కోర్స్, మగ జెంట్స్ కూడా..! పర భాష అయినా సరే… తెలుగులో ఫ్లూయెంటుగా మాట్లాడుతున్నారు… అచ్చం తెలుగు మనుషుల్లాగే… భాషను నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, భాషను గౌరవిస్తున్నారు, తమకు ఉపాధి కల్పిస్తున్న తెలుగు టీవీ ఇండస్ట్రీ పట్ల తమ కమిట్మెంట్ కనబరుస్తున్నారు… గుడ్… ఐ అప్రిసియేట్ ఆల్ కన్నడ స్టార్స్ వర్కింగ్ ఫర్ తెలుగు టీవీ ఇండస్ట్రీ..!! ప్రజెంట్ బిగ్‌బాస్ కూడా ఇదే చెబుతోంది..!! మన తెలుగు నటులు ఇంగిలిపీసులో ఏడుస్తుంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లు మాత్రం తెలుగును ప్రేమిస్తున్నారు… షేమ్ ఎవరు..?
చివరగా… స్టార్ మా డబ్బు, రీచ్ ప్రభావంతో ఏదైనా మెయింటెయిన్ చేయగలమనే ధీమా ఉండవచ్చుగాక… కానీ కొన్ని అంశాల్లో జీతెలుగును కొట్టలేకపోతోంది…!!
Share this Article