.
ప్రవస్తి సింగర్ ఈటీవీ పాడుతా తీయగా రియాలిటీ షో మీద ఓ బాంబ్ పేల్చింది కదా… చంద్రబోస్, సునీత, కీరవాణి, చరణ్‌తో పాటు జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఈటీవీ టీమ్స్ ఒక్కసారిగా డిఫెన్సులో పడిపోయాయి…
ప్రతి తెలుగు సైట్, యూట్యూబ్ చానెల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాశాయి… ఫాఫం, సమర్థనకు సునీత విఫలప్రయత్నం చేసింది… మిగతా కంటెస్టెంట్లతో ‘ఈ షో సూపర్, మాకేమీ ఇబ్బందుల్లేవు’ అంటూ వీడియోలు చేయించినా సరే జనంలో ఓ నెగెటివ్ ఒపీనియన్ ఏర్పడిపోయింది…
Ads
పాపం, బాలు ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం విలువ ఏమిటి..? ఆయన చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిపించడానికి ప్రయత్నిస్తున్న చరణ్ చివరకు దాన్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు… అసలు ఆ షోకు వస్తున్న రేటింగ్స్ ఏమిటని తాజా బార్క్ రేటింగ్ జాబితా పరిశీలిస్తే ఆశ్చర్యం వేసింది.,.
ఎక్కడో దిగువన 1.16 టీఆర్పీలు కనిపించాయి… (హైదరాబాద్ కేటగిరీ)… దారుణమైన రేటింగ్స్… అసలే 25వ సంవత్సరం అన్నారు, ఆస్కారుడు కీరవాణిని పట్టుకొచ్చారు… ఐనా సరే ఈ ప్రోగ్రామ్ రేటింగ్స్ నానాటికీ పడిపోవడమే గానీ జాబితాలో పైకి మాత్రం లేవడం లేదు…
ఆ కీరవాణి ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… పూర్ కమ్యూనికేటర్… ఆ ప్రోగ్రామ్‌కు తను అన్‌ఫిట్ అనిపిస్తూ ఉంటుంది… అసలే టీవీక్షణాలు బాగా పడిపోతున్నాయి… టీవీ ప్రోగ్రాములు వెలవెలపోతున్నాయి… ఐనాసరే, మరీ పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కన్నా దిక్కుమాలిన సుమ అడ్డాకు సగం రేటింగ్స్ ఎక్కువే కనిపిస్తున్నాయి…
టీవీక్షణాల సంగతికొద్దాం… అసలు న్యూస్, ఆ చానెళ్ల డిబేట్లను ఎవడూ దేకడం లేదని న్యూస్ చానెళ్ల రేటింగులు చెబుతున్నాయి… మరీ విశేషం ఏమిటంటే..? ఒక వినోద చానెల్ రేటింగ్స్ కోసం న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ మీద ఆధారపడటం కదా… అదే ఈటీవీ 9 గంటల బులెటిన్… దాని రేటింగ్స్ కూడా పడిపోయాయి…
అంతేకాదండోయ్… దాని ఫ్లాగ్ షోలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎట్సెట్రా షోలు కూడా ఎదురీదుతున్నాయి… వెరసి ఇప్పుడు దాని పొజిషన్ ఏమిటో తెలుసా..? ఇదుగో ఇలా…
చూశారు కదా… స్టార్‌మా ఎప్పటిలాగే టాప్… ఆల్ ఇండియాలో సెకండ్… తరువాత జీ తెలుగు పర్లేదు, మంచి పోటీయే ఇస్తోంది ఉన్నంతలో… మూడో ప్లేసులో ఉన్న ఈటీవీ మరీ స్టార్ మా రేటింగుల్లో మూడో వంతు కూడా సాధించలేదు… చివరకు జెమిని టీవీలాగా మెల్లిగా మరింత కిందకు జారిపోతుందేమో…
సరే, ఒక్కసారి జీతెలుగులో డ్రామా జూనియర్స్ షోకి వద్దాం… సుడిగాలి సుధీర్ హోస్ట్, అనిల్ రావిపూడి, రోజా జడ్జిలు… ఈసారి ప్రోమో చూస్తే ఆశ్చర్యం కలిగింది… అది మొన్నటి పహల్‌గామ్ ఇన్సిడెంట్ మీద స్కిట్… నిజానికి యూరి, పుల్వామా వంటి సంఘటనలప్పుడు కూడా దేశంలో ఇంత కోపోద్రేకాలు వ్యక్తం కాలేదు…
ఈ దుశ్చర్య మీద జాతి మొత్తం రగిలిపోతోంది… మీడియా కూడా స్పందిస్తోంది… ఈ స్కిట్ కూడా ప్రోమోలో బాగున్నట్టే కనిపించింది… గుడ్ ఈ షోకు మంచి రేటింగ్సే వస్తున్నాయి,.. గత వారం 3.83 రేటింగ్స్… గుడ్… జనానికి ఏం కావాలో ఈటీవీకి అర్థమవుతోందా..? సుమ అడ్డాలు, చరణ్ గడ్డాలు కాదు…!!
Share this Article