Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…

March 30, 2026 by Rishi

అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా రష్యా నౌక Anatoly Kolodkin, 7,30,000 బారెల్స్ ఆయిల్‌తో క్యూబా చేరింది.

రష్యా ఈ ప్రయాణంపై అమెరికాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పుటిన్ ఆదేశాలపై, ఈ నౌకను ఒక ఫ్రిగేట్ సముద్రంలో ఎస్కార్ట్ చేయగా, అట్లాంటిక్‌లో ఒక సబ్‌మరిన్ కూడా రక్షణగా ఉండింది.

వైట్ హౌస్ మాత్రం మౌనం. ఇదే సమయంలో ట్రంప్ రష్యన్ ఆయిల్‌పై ఆంక్షలను ఎత్తివేస్తూ, పుటిన్‌తో గంట పాటు మాట్లాడుతున్నాడు.

Ads

ఇప్పుడు ఇది పోటీలా కనిపించడం లేదు… ఇది భాగస్వామ్యంలా ఉంది.

ట్రంప్, ఇరాన్ సంక్షోభాన్ని ఉపయోగించి, గల్ఫ్ ఎనర్జీపై లండన్ ఫైనాన్షియల్ పట్టు బలహీనపరిచాడు. పాత ట్రాన్స్-అట్లాంటిక్ వ్యవస్థ ముగిసింది. దాని స్థానంలో కొత్త ఒప్పందం?

రష్యా ఆయిల్ అమ్ముతుంది, అమెరికా సముద్ర మార్గాలను నియంత్రిస్తుంది, ఇద్దరూ లాభపడతారు.

పుటిన్ & ట్రంప్ శత్రువుల్లా నటిస్తున్న, వాస్తవానికి ఇద్దరికీ లాభమే.
పుటిన్‌కు ఆదాయం, ట్రంప్‌కు ఎనర్జీ ఆధిపత్యం, ధర చెల్లించేది? మిగతా ప్రపంచం.

క్యూబాలోకి చేరిన ఈ నౌక ఒక సంకేతం మాత్రమే:
గేమ్ ముందే ఫిక్స్ అయింది, ప్లేయర్స్ కలిసి ఆడుతున్నారు, మిగతావాళ్లు కేవలం చూస్తున్నారు

కానీ ఇది భాగస్వామ్యం కాదు అనేవాళ్లు కూడా ఉన్నారు.
ట్రంప్ ప్రస్తుతం రష్యాతో నేరుగా పోరాడలేడని తెలుసు., మిత్రదేశాలు విభేదిస్తున్నాయి, జర్మనీ అమెరికాను దూరం చేయాలని చూస్తోంది, ఇరాన్‌తో ఉద్రిక్తత, చైనా తైవాన్ కోసం వేచి ఉంది, ఈ పరిస్థితుల్లో అమెరికా రష్యా తో పూర్తిగా శత్రుత్వం పెట్టుకోలేదు.

డాట్స్ కనెక్ట్ చేస్తే…
ట్రంప్ ఆంక్షలు ఎత్తి వేస్తాడు, కొన్ని వారాల్లో రష్యా బిలియన్లు సంపాదిస్తుంది
, యుక్రెయిన్ యుద్ధ ఖర్చులో పెద్ద భాగం రికవర్ చేస్తుంది

యూరప్ ఏమి చేసింది? ఆయుధాలు పంపింది, ఆంక్షలు పెట్టింది.
ట్రంప్ ఏమి చేశాడు? ఆదాయం ఇచ్చాడు.

మరి ఆ అలాస్కా మీటింగ్?
ఎలాంటి కెమెరాలు లేవు, ఎలాంటి డిప్లమాట్స్ లేరు, కేవలం ఇద్దరు నేతలు మాత్రమే. వాళ్లిదరు ఏమి మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు.

ఇప్పుడు రష్యా ఇరాన్‌కు మద్దతు ఇస్తోంది. ట్రంప్‌కు ఇది తెలుసు, అయినా రష్యాకు లాభం చేకూరే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కనీసం రష్యా ను అడ్డుకునే ప్రయత్నాలు చేయటం లేదు. ఇరాన్ జల,సంధి వద్ద అంతరాయాలు కలుగుతున్న సమయములో రష్యా నుండి చమురు నిరంతరాయముగా బయటకు రాకపోతే అందరికీ సమస్య అని ట్రంప్ కి తెలుసు. అందుకే రష్యా ను పూర్తిగా అమెరికా ఆపడు.

అందుకే ఒక ప్రశ్న: ఇవాళ్టి ప్రపంచ రాజకీయాల్లో నిజంగా శత్రుత్వమా?? లేక స్టేజ్‌పై నాటకమా? కాలమే సమాధానం చెపుతుంది.

— ఉపద్రష్ట పార్ధసారధి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?
  • ఉల్టా పేలిన హరీష్ తుపాకీ..! ఇరికించే ప్లాన్ చేసి దొరికిపోయాడు..!!
  • ప్రతివారం రెండురోజులు లాక్‌డౌన్… పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం…
  • మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions