Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊబర్ లేడీ డ్రైవర్..! ఆన్‌లైన్‌లో హృదయాలను తాకిన X పోస్ట్..!!

February 4, 2026 by M S R

.

( రమణ కొంటికర్ల    99126 99960  ) ….. మనకు తెల్వని, నిజజీవితంలో చూడని చారిత్రాత్మకమైనవి, గొప్ప కథలే కాదు.. నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని లైఫ్ స్టోరీసూ మనల్ని కదిలిస్తాయి. అలా ఇంటర్నెట్ ను కదిలిస్తోంది హైదరాబాద్ కు చెందిన ఓ ఒంటరి మహిళ జీవన ప్రయాణం.

హైదరాబాద్ లో మీ డెస్టినేషన్ కు చేరాలంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్లేవారి సంఖ్య పెరిగిపోయింది. అలా ఊబర్ కారులో ఎక్కిన ఓ కస్టమర్ ను కదిలించిన ఆ కథానాయకురాలే నందిని.

Ads

సురేష్ కొచ్చాటిల్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, మీడియా కన్సల్టెంట్ హైదరాబాద్ లో ఊబర్ లో తన గమ్యస్థానం వెళ్లడానికి ఓ క్యాబ్ బుక్ చేశారు. ఈమధ్య ఊబర్, ఓలా, ర్యాపిడోల్లో ఒక్కసారికి డ్రైవర్ కనెక్టవ్వడం కూడా కష్టమైపోతోంది. వెయిటింగ్ సమయమూ పెరిగిపోతోంది.

అప్పుడప్పుడూ డ్రైవర్ ను బుక్ చేశాక.. అతను రాకపోవడమో, ఆ రైడ్ క్యాన్సిల్ చేసుకోవడమో.. మొత్తంగా మళ్లీ మరో క్యాబో, బైకో, ఆటోనో బుక్ అయ్యేవరకూ వేచిచూడాల్సి వస్తోంది. అదే సురేష్ కొచ్చాటిల్ కూ జరిగింది. రెండు క్యాబ్స్ రద్దైనాయి.

మూడోసారి క్యాబ్ బుక్ కాగా.. డ్రైవర్ పేరు మహిళలాగా అనిపించింది. ఓహో ఊబర్, ఓలా, ర్యాపిడోల్లో కూడా మహిళా డ్రైవర్స్ పనిచేస్తున్నారా అనే ఓ క్యూరియాసిటీ ఆయనలో జనరేట్ అయింది.

అలాంటి తన అనుభవాన్నే సురేష్ కొచ్చాటిల్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

రెండు క్యాబ్స్ రద్దైన తర్వాత బుక్ అయిన మూడో కారు నడుపుతూ ఓ మహిళా డ్రైవర్ సురేష్ కొచ్చాటిల్ ని పికప్ చేసుకుంది. అప్పటికే ఊబర్ వంటి సంస్థలో ఓ కారు డ్రైవర్ గా మహిళ అనే ఒక క్యూరియాసిటీతో ఉన్న సురేష్.. ఆమెతో మాటలు కలిపారు. ఆ సందర్భంగా ఆమెతో జరిగిన సంభాషణ తానెప్పటికీ మర్చిపోలేనంటూ ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఊబర్ కారు స్టీరింగ్ పట్టిన నందిని ఎవరసలు..?

నందినిది విజయవాడ. ఆమె ఒంటరి మహిళ. ముగ్గురు పిల్లల తల్లి. గత ఏడాది నుంచి నందిని ఊబర్ లో డ్రైవర్ గా పనిచేస్తోంది. అనేక సవాళ్ల మధ్య పనిచేస్తున్న నందిని జీవిత ప్రయాణం సురేష్ కొచ్చాటిల్ ను కదిలించింది.

తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలన్న తపనతో నందిని రోజంతా కారు నడుపుతూ కష్టపడుతోంది. తన పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం.. ఎక్కువ మగవాళ్లే కనిపించే డ్రైవింగ్ సీటుపైకెక్కి స్టీరింగ్ తిప్పుతోంది. హారన్స్ సౌండ్స్ తో రణగొణ ధ్వనుల మధ్య… నందిని జీవిత నిశ్శబ్ద ప్రయాణం సురేష్ ను ఆలోచింపజేసింది.

చిన్న చిన్న వాటికే మనస్థాపం చెందేవారు, ఆత్మహత్యలు చేసుకునేవారు, పిల్లలతో సహా అఘాయిత్యాలకు పాల్పడేవారు కనిపించే ఇదే సమాజంలో.. ప్రతికూల పరిస్థితులెదురైనా, వాటిని జయిస్తూ ఓ మహిళ ఎలా ముందుకు తన ప్రయాణాన్ని సాగించగలదో చెప్పేందుకు ఓ నిలువెత్తు ఉదాహరణ నందిని.

రెండు రోజుల క్రితమే విజయారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీమ్ లీడర్.. ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి రైల్ పట్టాల కింద పడి అసువులు బాసిన ఘటన ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అలాంటి నెట్టింటే.. నందిని స్టోరీ అందుకు భిన్నంగా కనిపించడం గమనించాల్సిన విషయం.

ఆన్ లైన్ లో హృదయాలను తాకిన పోస్ట్!

సురేష్ కొచ్చాటి X పోస్ట్ ఆన్ లైన్ లో నెటిజన్ల మనసును దోచుకుంది. ఆమె జీవితంలో తడి వారిని కదిలించింది. క్యాబ్ నడుపుతున్న నందిని ఫోటోను సురేష్ పోస్ట్ చేయడంతో.. విస్తృతమైన స్పందన వచ్చింది. ఆమె ధైర్యం, పట్టుదల, ఆత్మగౌరవం వంటివాటిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

నినాదాలు చేసేవారు కొందరైతే.. నిజ జీవిత అనుభవాల ద్వారానే నిజమైన మహిళా సాధికారిత అంటే ఏంటో చెప్పే స్టోరీ నందిని కథ. ఒంటరి మహిళగా ఉండి.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఆ తల్లి కష్టపడుతున్న తీరుకు ఇంటర్నెట్ ఇప్పుడు సెల్యూట్ కొడుతోంది.

సాధారణ ప్రయాణం – అసాధారణమైన గుర్తింపు!

నందిని తన పిల్లల్ని పోషించేందుకు.. వారిని బాగా చదివించేందుకు మాత్రమే స్టీరింగ్ పట్టుకుంది. అలా సాగిపోతున్న ఆమె సాధారణ ప్రయాణం.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసాధారణమైన గుర్తింపు పొందింది. క్యాబ్ సీటు దాటి.. ఇంటర్నెట్ అంతటా ప్రయాణిస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ స్టార్ అయ్యారు ఊబర్ క్యాబ్ డ్రైవర్ నందిని.

మనకు తెలవని స్ఫూర్తినిచ్చే కథలెన్నో విని ఉంటాం. కానీ, నిజజీవితంలో అనుభవంలోకొచ్చే నందిని వంటి కథలు మాత్రం మరింత బలమైన ముద్రను వేస్తాయి. అదే సురేష్ కొచ్చాటికి జరిగింది. ఆ భావననే ఆయన షేర్ చేయడంతో.. ఊబర్ మహిళా డ్రైవర్ నందిని రియల్ స్టోరీ వార్తల్లోకెక్కింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…
  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions